Friday, July 24, 2020

రామాయణంలోని సంఖ్యామానం


రామాయణంలోని సంఖ్యామానం





సాహితీమిత్రులారా!

మన సంఖ్యామానంలో మనం కోటి వరకు లేదా
వందకోట్లవరకు లెక్కిస్తాం. కానీ రామాయణంలో ఉన్న
సంఖ్యామానం చూస్తే మనకు అంతుపట్టదు.
ఇక్కడ ఆ సంఖ్యామానం చూద్దాం-

శతం శత సహస్త్రాణాం కోటిమాహుర్మనీషిణః
శతం కోటి సహస్త్రాణాం శంఖ ఇత్యభిధీయతే
శతం శంఖ సహస్త్రాణాం మహాశంఖ ఇతిస్మృతమ్
మహాశంఖ సహస్త్రాణాం శతం బృందమిహోచ్యతే
శతం బృంద సహస్త్రాణాం శతం పద్మమిహోచ్యతే
శతం పద్మ సహస్త్రాణాం మహాపద్మమితి స్మృతమ్
మహాపద్మ సహస్త్రాణాం శతం ఖర్వమిహోచ్యతే
శతఖర్వ సహస్త్రాణాం మహాఖర్వ మిహోచ్యతే
మహాఖర్వ సహస్త్రాణాం శతం సముద్రమఖిదీయతే
శతం సముద్ర సాహస్ర మోఘ ఇత్యభిధీయతే
శతమోఘ సహస్త్రాణాం మహౌఘ ఇతివిశ్రుతః
                                                                          (వాల్మీకి రామాయణం యుద్ధకాండ)
నూరులక్షలు - కోటి (7 సున్నలు)
నూరువేల కోట్లు - 1 శంఖం (12 సున్నలు)
నూరువేల శంఖములు - 1 మహాశంఖము (17 సున్నలు)
నూరువేల మహాశంఖములు - 1 బృందము (22సున్నలు)
నూరువేల బృందములు - 1 మహాబృందము (27 సున్నలు)
నూరువేల మహాబృందములు - 1 పద్మము (32 సున్నలు)
నూరువేల పద్మములు - 1 మహాపద్మము (37 సున్నలు)
నూరువేల మహాపద్మములు - 1 ఖర్వము (42 సున్నలు)
నూరువేల ఖర్వములు - 1 మహాఖర్వము (47 సున్నలు)
నూరువేల మహాఖర్వములు - 1 సముద్రము (52 సున్నలు)
నూరువేల సముద్రములు - 1 ఓఘము (57 సున్నలు)
నూరువేల  ఓఘములు - 1 మహా ఓఘము(మహౌఘము)(62 సున్నలు)

ఇప్పుడు ఒకటిపక్కన 7 సున్నలుంటే పలకగలము కాని 62 సున్నలుంటే
దీన్ని బట్టి పలకగలం కదా