చిత్రకవితా సౌరభం పుస్తకావిష్కరణ
రెండవ భాగం అలంకార చిత్రం
సాహితీమిత్రులారా!
కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ! అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. అయినా మన కవుల కళ్ళు పడ్డాక జీవుడైనా, దేవుడైనా కిక్కురుమనకుండా వచ్చి ఏ పద్యంలోనో, శ్లోకంలోనో కూర్చోవలసిందే. మనుషులతో పాటు, పశువులు, పక్షులు, చెట్లు చేమలు, కొండలు గుట్టలు కూడా మన కవుల చేత వీరతాళ్ళు వేయించుకున్నాయి. కేవలం కొన్ని రోజుల పాటూ మాత్రమే బ్రతికే అల్పజీవులెన్నో మన కవుల పుణ్యమా అని చిర యశస్సును సంపాదించుకున్నాయి. అటువంటి ఘనతకెక్కిన జీవులలో ప్రధానమైనవి రెండు. మొదటిది నల్లి. రెండవది దోమ.
వెనకటికో కవిగారు నల్లి గొప్పతనం గురించి చెబుతూ శివుడద్రిని శయనించుట - రవిచంద్రులు మింటనుంట - రాజీవాక్షుండవిరళముగ శేషునిపై పవళించుట - నల్లి బాధ పడలేక సుమీ అంటూ నల్లి ప్రయోజకత్వాన్ని పసందైన రీతిలో చెప్పుకొచ్చాడు. శివుడు మంచుకొండపై నివసించడానికి, సూర్యచంద్రులు నేలమీద కాకుండా ఆకాశంలో తిరగడానికి, విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకోవడానికి గల కారణం బుల్లి జీవైన ఈ నల్లికి భయపడేనట. ఒకప్పుడు అంతటి వైభోగంతో బ్రతికిన నల్లి కాలప్రవాహంలో తన అస్థిత్వాన్నే కోల్పోయే స్థితికి చేరుకుంది. పల్లెటూళ్ళ నులక మంచాలు, సినిమా ధియేటర్లలో పీలికల కుర్చీలు అంతరించిపోవడంతో వాటికి నిలువ నీడ కరువయ్యింది.
నల్లి సంగతి అలా ఉంటే.. ఆ నల్లికి వేలు విడిచిన చెల్లిలాంటి దోమ మాత్రం నాగరికతా పరిణామలను, పర్యావరణ మార్పులను తట్టుకుంటూ తమ జాతిని విస్తరింపజేసుకుంటూ సాగిపోతోంది. దాని ప్రఖ్యాతి ఎంత గొప్పది కాకపోతే మనం హస్తిమశకాతరం అంటూ ఏనుగు ప్రక్కన దోమను నుంచోబెట్టి మరీ పోలిక చెబుతాం. ఆ మాట అలా ఉంచితే.. అసలు సమానత్వం చూపించడంలో దోమని మించిన జీవి లేదు. పేదా గొప్పా భేదం లేకుండా ఎవరి చెంప వాళ్ళు వాయించుకునేలా చేయగల సామ్యవాద జీవి మన దోమ. గురించి మన సాక్షీ వ్యాసాల పానుగంటి వారు, హాస్యబ్రహ్మ భమిడిపాటి వారు ఏకరువు పెట్టిన మెచ్చుతునకలను ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
ఈరోజు మనం చెప్పుకోబోయేది సామాన్యమైన కథ కాదు. తన కోపంతో ఒక రాజవంశాన్ని పడగొట్టి, మరో రాజవంశాన్ని నిలబెట్టిన రాజనీతివేత్త కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన ఆ రాజనీతివేత్త మన చాణక్యుడు. ఆయనకు వచ్చిన కోపం ఎంతో బలమైన నందరాజ వంశాన్ని నాశనం చేసింది. ఆయనకు కలిగిన అనుగ్రహం సుస్థిరమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆయన రచించిన అర్థశాస్త్రం ఇప్పటికీ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచింది. అటువంటి చాణక్యుని రాజనీతిపై, అతని ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయన్న విషయంపై సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ గ్రంథమే ఈ ముద్రా రాక్షసమ్. ఈ గ్రంథ రచయిత విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడు ఒక రాజవంశీయుడు. తన తాతగారు ఒక సామంతరాజనీ, తన తండ్రి ఒక మహరాజనీ ఆయన ఈ గ్రంథంలోనే చెప్పుకున్నాడు. ఇక ముద్రారాక్షసం కథలోకి వద్దాం. ఈ నాటకానికి వ్యాఖ్యానం చేసిన డుంఢిరాజు ఉపోద్ఘాతంతో కలిపి చెప్పుకుంటే మనకు కథ స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక ముద్రారాక్షసమ్ కథలోకి ప్రవేశిద్దాం.
రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి
దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి
పద్మబంధం
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి
దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి
సప్తదళ గర్భ సీసం ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
తెలుగు భాషలో ఎన్నో చమత్కార పద్యాలున్నాయి. వాటిల్లో ఒకటి..
ఈరోజు చెప్పుకోబోయే న గుణింత అక్షరాలు మాత్రమే ఉండే ఏకాక్షరి పద్యం. ఇది Tongue twister లా ఉంటుంది. ఇది సరదాగా సాధన చేయండి. చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో కూడా చెప్పించండి. ఇటువంటి పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మనకు నోరు బాగా తిరగడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
Rajan PTSK గారికి ధన్యవాదాలు