Monday, January 16, 2017

వరి నదిలో జలకమాడ పాపము పోవున్


వరి నదిలో జలకమాడ పాపము పోవున్




సాహితీమిత్రులారా!


సమస్య -
వరి నదిలో జలకమాడ పాపము పోవున్

బాపట్ల వేంకటపార్థసారథిగారి పూరణ-

పరలోకవాసులైన పి
తరులకు సంక్రాంతినాడు తర్పణమిడ నా
తరణము పదునాల్గున జన
వరి నదిలో జలకమాడ పాపము పోవున్

సంక్రాంతిరోజు పితృదేవతలకు తర్పణం ఇస్తారు కదా
దాన్ని ఇందులో చొప్పించి వరిని జనవరి గా మార్చడం
వల్ల అర్థవంతంగా మారింది సమస్య

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.

No comments: