Thursday, January 5, 2017

ముక్కున పైనము నడచును


ముక్కున పైనము నడచును



సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పగలరేమో

ముక్కున పైనము నడచును
ప్రక్కల నోరుండు గాలి పారణ సేయున్
గ్రక్కున వేసిన కూయును
మక్కువతో దీని దెలియు మనుజులు గలరే?

ముక్కుతో ప్రయాణిస్తుందట.
నోరు పక్కన ఉంటుందట.
గాలిని తింటుందట.
వేసివేయంగానే మక్కువతో కూస్తుందట
అదేమిటో చెప్పమంటున్నాడు కవి.

దీనికి సమాధానం - బొంగరం
అది ములికిమీద అంటే ముక్కుతో
నడుస్తుందికదా!
అలాగే వేగంగా తిరుగుతూ
గాలిని తిన్నట్లుందికదా!
ఇష్టపడి వేస్తే శబ్దం చేస్తూ
తిరుగుతుందికదా!
కాబట్టి సమాధానం బొంగరమేకదా!

No comments: