Saturday, March 31, 2018

జుట్టుంది కానీ ముడిలేదు


జుట్టుంది కానీ ముడిలేదు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి.


1. ఒక ఏటిలో ఒకటేస్తే మునుగుతుంది
    ఇంకొకటి వేస్తే కరిగి పోతుంది
    ఇంకొక్కటేస్తే తేలుతుంది
    ఏమిటివి చెప్పండి?

 

సమాధానం -     వక్క
                                   సున్నం
                                                ఆకు


2. ఒకటి మునుగుతుంది
    ఒకటి తేలుతుంది
    ఒకటి కరుగుతుంది
    మూడూ కలిస్తే నీ పెదవి ఎరుపు
    ఏమిటివి చెప్పండి?


సమాధానం -
                               వక్క,
                                     ఆకు,  
                                          సున్నం


3. ఒక రాజుకు కళ్లున్నాయి కాని ముక్కులేదు
    జుట్టుంది కానీ ముడిలేదు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - టెంకాయ


Friday, March 30, 2018

కుచ్చిల్లెత్తు - గూటం గొట్టు


కుచ్చిల్లెత్తు - గూటం గొట్టు



సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి

1. కుచ్చిల్లెత్తు
    గూటం గొట్టు
    ఏమిటిది చెప్పండి?


సమాధానం - గొడుగు


2. కొంటారు, వండుతారు, 
    తినకనే పారేస్తారు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - కరివేపాకు

Thursday, March 29, 2018

చెట్టుకు పావడ గట్టంగ


చెట్టుకు పావడ గట్టంగ




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విచ్చండి-


1. చెట్టుకు పావడ గట్టంగ
    ఎండకు వానకు తడవంగ
    ఇంటికి వచ్చిన ముడువంగ
    మూలన వంకెకు ఉండంగ
    చెప్పండి ఏమిటో ఇది?


సమాధానం - గొడుగు


2. గూటి నిండా రూపాయలు పోసి
    గూటికి బీగం వేసి,
    లంకా పట్టణం కాల్తుంటే,
    లం- మొత్తుకుంది
    ఏమిటో ఇది చెప్పండి?


సమాధానం - సున్నపు కుండ

Wednesday, March 28, 2018

చచ్చిన దానికి కడుపొచ్చింది


చచ్చిన దానికి కడుపొచ్చింది




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విచ్చండి-


1. చచ్చిన దానికి కడుపొచ్చింది
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - గోనె సంచి


2. చక్కని రెడ్డికి ఒల్లంతా బొచ్చు
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - మడి గట్టు

3. చాప చుట్టనూలేము,
    చంకన పెట్టనూ లేము
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - ఆకాశం

Tuesday, March 27, 2018

తిరిగిన వెంటనే పడుకొని దొర్లు


తిరిగిన వెంటనే పడుకొని దొర్లు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి-

1. గిర్రున తిరిగే కిర్రగు వస్తువు,
    కుర్రలాడు కొను కర్ర వస్తువు,
    గిర్రు గిర్రు మని గిర గిర బర బర 
    తిరిగిన వెంటనే పడుకొని దొర్లు
    ఏమిటది చెప్పండి?


సమాధానం - బొంగరం


2. గుట్ట మీద మట్టి గడ్డ,
    మట్టి గడ్డలో మల్లె తోట,
    మల్లె తోటలో ఐదుగురు కన్యలు,
    ఆడుతూ పాడుతూ ఉంటారు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - అన్నం తినడం

Monday, March 26, 2018

తలకాయ లేని కొమ్మకు తగలేసె


తలకాయ లేని కొమ్మకు తగలేసె




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-


1. చిక్కెము, అరచిక్కెము, అన్నీ చిక్కానికేసి
    తలకాయ లేని కొమ్మకు తగలేసె
    ఏమిటో చెప్పండి?


సమాధానం - పుస్తకాల సంచి


2. చినచిన్నాకులు, చిత్తరాకులు, కసురాకులు
    కానగాకులు ఎన్నికోసినా కట్టకు గావు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - కనురెప్పలు

Sunday, March 25, 2018

దాని అక్కకు బొక్కేలేదు


దాని అక్కకు బొక్కేలేదు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి -

1. చిన్న దానికి చిన్న బొక్క
    పెద్ద దానికి పెద్ద బొక్క
    దాని అక్కకు బొక్కేలేదు
    ఏమిటో చెప్పండి?

సమాధానం -
                         సూది,
                                    దబ్బనము,
                                                      గడ్డపార


2. తోనలో పుట్టేది
    తోవలో పెరిగేది
    తోవపోయే వారి కొంగు పట్టేది
    ఏమిటో చెప్పండి?

సమాధానం - ఉత్తరేణి చెట్టు

శుభాకాంక్షలు


శ్రీరామనవమి శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు, 
శ్రేయోభిలాషులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు



Saturday, March 24, 2018

ఆడదానితో దెబ్బలు పడితి


ఆడదానితో దెబ్బలు పడితి




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. కట కట! రాముని కడుపులో పుడితి
    ఎందుకు పుడితి ఏం సుఖ పడితి
    ఆడదానితో దెబ్బలు పడితి
    ఆగ లేక అగ్గిలో పడితి
    ఏమిటో చెప్పండి?


సమాధానం - పిడక


2. కంఠంబు నలుపు వాడు, నీలకంఠుడు గాడు
    జంటగా పెట్టి సతిని వెంట బెట్టుక తిరుగు వాడు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - ఊరపిచ్చుక

Friday, March 23, 2018

కాంచిన నెయ్యి వచ్చు వెన్నకాదు


కాంచిన నెయ్యి వచ్చు వెన్నకాదు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విచ్చండి-

1. పచ్చపచ్చగనుండు కాకరకాయ కాదు
    పక్కలంతా ముల్లుండు పనసపండు కాదు
    లోపల పెట్టుండు టెంకాయ కాదు
    కాంచిన నెయ్యి వచ్చు వెన్న కాదు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - ఆముదం గింజలు


2. బండి ఎక్కడు, గుర్రమెక్కడు,
    నడవని బాలుడు ఇంటి ముంగిట
    ఇటు అటు తిరుగుతాడు
    ఇదేమిటో చెప్పండి?

సమాధానం - ఊయెల

Thursday, March 22, 2018

బ్రహ్మలనక బంటులనక బంతిని భోంచేసిరంట


బ్రహ్మలనక బంటులనక బంతిని భోంచేసిరంట




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విచ్చండి-


1. నల్లనల్లని పక్షికి నడినెత్తిన రెక్కలొచ్చె, చేతులార గోళ్ళు వచ్చె
    చెవుల సందున కొమ్మలొచ్చె, దాని పచ్చ రత్నాలు కత్తిన కోసి,
    బ్రహ్మలనక బంటులనక బంతిని భోంచేసిరంట.
    ఏమిటో చెప్పండి?

సమాధానం - అరటిచెట్టు

2. నల్లని అడవి; ఆ అడవిలో తెల్లని దారి;
    ఆదారి దాటితే రెండు అగ్నిగోళాలున్నవి;
    అవి దాటితే ఒక వంతెన ఉంది;
    అది దాటితే ఒక కోట ఉంది;
    ఆ కోట ద్వారాలు తెరిస్తే నెమలి నాట్యం చేస్తుంది
    ఏమిటో చెప్పండి?

సమాధానం -
నల్లని అడవి - తల
ఆ అడవిలో తెల్లని దారి - పాపట
ఆదారి దాటితే రెండు అగ్నిగోళాలున్నవి - కన్నులు
అవి దాటితే ఒక వంతెన ఉంది - ముక్కు
అది దాటితే ఒక కోట ఉంది - నోరు
ఆ కోట ద్వారాలు - పెదవులు
తెరిస్తే నెమలి నాట్యం చేస్తుంది - నాలుక

Wednesday, March 21, 2018

ఓయమ్మా వాడొస్తాడే


ఓయమ్మా వాడొస్తాడే





సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-


1. ఓయమ్మా వాడొస్తాడే, 
    వస్తానే ఏస్తాడే
    ఏస్తానే తీస్తాడే, 
    తీస్తానే చస్తానే
    ఏమిటో చెప్పండి?

సమాధానం -
                           జాలరి
                                 గాలం
                                        చేప


2. నదిలో కలకల
    చెట్టుపై కిలకిల
    అది చూస్తే విలవిల
    ఏమిటో చెప్పండి ?


సమాధానం - 
నదిలో కలకల - యమునలో గోపికలు స్నానం
చెట్టుపై కిలకిల - చెట్టుపై కృష్ణుడు నవ్వడం
అది చూస్తే విలవిల - గోపిలు సిగ్గు పడడం   


Tuesday, March 20, 2018

తంతే తన్నబోయింది కాని కాళ్లు లేవు


తంతే తన్నబోయింది కాని కాళ్లు లేవు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విచ్చండి-

1. చూస్తే చూస్తుంది కాని కళ్లు లేవు
    నవ్వితే నవ్వింది కాని నోరు లేదు
    తంతే తన్నబోయింది కాని కాళ్లు లేవు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - అద్దం

2. జడల మహాముని భూలోక బైరగడ్డ
    త్రవ్వి, గోనె సంచులకెత్తి, విసనగిరి పట్నాలు
    వీధి వీధులు తిప్పి, కోరకోర యుద్ధాలు చేసి,
    అన్న పాదం దగ్గర హతమై పోయె
    ఏమిటో చెప్పండి?

సమాధానం - ఎర్రగడ్డ

Monday, March 19, 2018

వైశాఖ మాసంలో వదలిపోతాడు


వైశాఖ మాసంలో వదలిపోతాడు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. వైశాఖ మాసంలో వదలిపోతాడు,
    మాఘ మాసంలో మల్లీ వస్తాడు,
    వొస్తూనే తెస్తాడు ఉల్లిపువ్వులు,
    ఉల్లి పిల్లను విడిచి వెళ్లనంటాడు
    ఏమిటే చెప్పండి?

సమాధానం - కుంపటి నిప్పులు

2. వెలగ కాయల బండి యెగురుకుంటు పోతే
    చింతకాయల బండి చిరుగుకుంటు పోతే
    అందులో ఒక పిల్లడాడుకొంటాడు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - చల్ల కవ్వం
                                         వెన్నపూస

Sunday, March 18, 2018

ఈపున నరముల వాడు


ఈపున నరముల వాడు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విచ్చండి-

1. పట్ట నెత్తివాడు,
    ఈపున నరముల వాడు,
    కాట్లములో కాలినవాడు,
    గుంతలో మురిగిన వాడు
    ఏమిటో చెప్పండి?

సమాధానం - 
   పట్ట నెత్తివాడు  - వక్క
   ఈపున నరముల వాడు - ఆకు
   కాట్లములో కాలినవాడు - సున్నం
   గుంతలో మురిగిన వాడు - పొవ్వాకు(పొగాకు)


2. పదహారు బిందెలమీద,
    ఇద్దరు బోగంవాళ్లు ఆడతారు
    ఇదేమిటో చెప్పండి?

సమాధానం - పాచికలు

ఉగాది శుభాకాంక్షలు


విళంబి నామ సంవత్సర 

ఉగాది శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు 
శ్రేయోభిలాషులకు
విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు

Saturday, March 17, 2018

పదివ్రేళ్లతో బంతులాట ఆడింది


పదివ్రేళ్లతో బంతులాట ఆడింది




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-


1. పదివ్రేళ్లతో బంతులాట ఆడింది
    ఐదివ్రేళ్ల దెబ్బతిని సూర్యునితో పోట్లాడింది
    అవమానం భరించలేక ఆహుతైంది
    ఏమిటో చెప్పండి?

సమాధానం - పిడక


2. పిట్టగాని పిట్టకాళ్లు రెండుకన్నా ఎక్కువ,
    పిట్టంటే పిట్టగాదు రెక్కలోకటి తక్కువ,
    నీరు లేని సముద్రాన్ని దాటించుట తనఘనత,
    నీరు లేని భూమిపైని నరులకదే మూలధనం
    ఏమిటో చెప్పండి?

సమాధానం - ఒంటె



Friday, March 16, 2018

రవికలో వుండే గుబ్బెంత చక్కనో


రవికలో వుండే గుబ్బెంత చక్కనో




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. ఇసుకాపురి పట్నంలో వుండే వీధెంత చక్కనో
    వీధిలో వుండే లం- ఎంత చక్కనో
    లం- తొడిగే రవికెంత చక్కనో
    రవికలో వుండే గుబ్బెంత చక్కనో
    గుబ్బ తాగే బాలెంతెంత చక్కనో
    ఏమిటే చెప్పండి?

సమాధానం - ఆముదం గింజ


2. ఇసుకలో ఇల్లు కట్టి
    దంతాన తలుపు పెట్టి
    తాను పోయి రాజుతో సరసమాడింది
    ఏమిటది చెప్పండి?

సమాధానం - మొగలి పూవు

Thursday, March 15, 2018

వూపితే వుత్తది


వూపితే వుత్తది



సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథ
విప్పండి-

1. ఎన్ను మూరెడు
    కంట కాగెడు
    పులిమితే పురిసెడు
    వూపితే వుత్తది
    ఏమిటిది చెప్పండి?


సమాధానం - జమ్ము వెన్ను



2. కంచిలో ఒక్కాలు
    కామాక్షిలో ఒక్కాలు
    నీ అడుగులో నా అడుగు
    ఏమిటో చెప్పండి?

సమాధానం -  పెండ్లిలో కాలు తొక్కి 
                           తాళికట్టడం

Wednesday, March 14, 2018

చేటలకే గాని గంపలకు లేదు


చేటలకే గాని గంపలకు లేదు



సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. చిలుకలు చిలుకలు కూడంగా,
   సిరంగి పట్నం కట్టంగా,
   అరవై పుట్లు పండంగా,
   చేటలకే గాని గంపలకు లేదు
   ఇదేమిటో చెప్పండి?

సమాధానం - శిశువు

2. గాజుల గల గలలు నావే
    కోయిల కుహు కుహులు నావే
    తుమ్మెద ఝంకారములు నావే
    అయితే నేనెవరు?

సమాధానం - జలపాతం

Tuesday, March 13, 2018

కట్టకనే ఈనకనే దుత్తెడు పాలు


కట్టకనే ఈనకనే దుత్తెడు పాలు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి-

1. కట్ట మీద కన్నె పడుచు
    కట్టకనే ఈనకనే
    దుత్తెడు పాలు యిస్తుంది
    ఏమిటో చెప్పండి?

సమాధానం - 
కట్ట మీద కన్నెపడుచు - ఈతచెట్టు
దుత్తెడు పాలు - కల్లు


2. కట కట రాముని కడుపులో పుడితి
    ఎందుకు పుడితి? ఏం సుఖపడితి?
    ఆడదానితో దెబ్బలు పడితి
    ఆగ లేక అగ్గిలో పడితి
 
సమాధానం - పిడక

Monday, March 12, 2018

తెల్లవారితే ప్రాణం పోతుంది


తెల్లవారితే ప్రాణం పోతుంది




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. చాకిన సంతరించిన ఈడారింది,
   ఇంట్లోనే వుంది, రాత్రికయితే మానం పోతుంది.
   తెల్లవారితే ప్రాణం పోతుంది,
   వాడుకుంటే నువ్వు వాడుకో,
   లేకపోతే ఎవరికైనా ఇవ్వు
   ఏమిటే చెప్పండి?

సమాధానం - మల్లెపూవు

2. తామర కమలం మీద కలువ పువ్వులు
    కలువ పువ్వు క్రిందన సంపెంగె పువ్వు
    సంపెంగ పువ్వు క్రింద దొండ పండ్లు
    దొండ పండ్లు తెరచుకొంటే మల్లెమొగ్గలు
    ఏమిటో చెప్పండి?

సమాధానం -
తామర (కమలం) - ముఖం
కమలం మీద కలువ పువ్వులు - కండ్లు
కలువ పువ్వు క్రిందన సంపెంగె పువ్వు - ముక్కు
సంపెంగ పువ్వు క్రింద దొండ పండ్లు - పెదాలు
దొండ పండ్లు తెరచుకొంటే మల్లెమొగ్గలు - పండ్లు


Sunday, March 11, 2018

గురువుని చంపుమురా


గురువుని చంపుమురా




సాహితీమిత్రులారా!


అస్సామీ జానపద గేయాల్లో
చిత్రవిచిత్రమైన తత్త్వాలూ
ఉన్నాయి. వీటికి ఏదో అంతరార్థం ఉంటుంది.
వీటికి కొంత మన్నన గౌరవం కలిగించటానికి
వీటిచివర అస్సామీ వైష్ణవ యోగులైన శంకరదేవపేరో,
మాధవదేవపేరో చెప్పటం కద్దు.
ఈ గేయం చూడండి-

గురువుని చంపుమురా - వాని
శిష్యుని చంపుమురా
తోడ బుట్టిన తమ్ముని చంపుమురా - ఆ పై
తోటిభక్తుని కొట్టి చంపుమురా
అప్పుడుగాని గురురాయడు
నీకు అందడు అందడు రా.

ఇందులో గురువును చంపుమురా
అనగానే గురువును చంపమనటం
ఎంత విచిత్రమో అర్థమౌతుంది.
దీనిలోని అంతరార్థం-
గురువంటే మనస్సు
శిష్యుడు - జ్ఞానం
తోడబుట్టిన తమ్ముడు - ఆలోచన
తోటి భక్తుడు - శరీరం
ఇది గూఢచిత్రంగా చెప్పవచ్చు.

Saturday, March 10, 2018

విప్పిన పొంగు - ముడిచిన క్రుంగు


విప్పిన పొంగు - ముడిచిన క్రుంగు




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-

1. కాటుక రంగు - కమలము హంగు
   విప్పిన పొంగు - ముడిచిన క్రుంగు

సమాధానం - గొడుగు

2. తల్లుల్ని కాల్చుకొని, 
   పిల్లల్ని ఏరుకు తినే లం-ముండా
   మీ నాయన యాడకు పోయినాడు - అంటే
   ముల్లుకు ముల్లడ్డమెయ్యను బొయినాడు
   వస్తే రాడు రాకుంటే వస్తాడు
   
సమాధానం - 
తల్లులు - కంది కంప
పిల్లలు - కందికాయలు
ముల్లుకు - వంగతోటకు
ముల్లడ్డమేయడం - కంచె వేయడం
వస్తే - వాగు వస్తే

ఏటవతలకు వెళ్ళిన వ్యక్తి
ఏరు వస్తే రాడు, ఏరు రాకపోతే వస్తాడు.

Friday, March 9, 2018

బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు


బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విచ్చండి -


1. చలి లేక నిప్పులో కాగేవాడు
   తాపంలేక చెరువులో నానేవాడు
   బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు
   ఏ వూళ్లో బడితే ఆ వూళ్లో వుండేవాడు
   వీరెవరో విప్పండి చెప్పండి?

సమాధానం - 
   చలి లేక నిప్పులో కాగేవాడు - కంసాలి
   (చలితో పనేముందీ ఎప్పుడూ 
    కొలిమి దగ్గరుంటాడుకదా)
   తాపంలేక చెరువులో నానేవాడు - జాలరి
   (జాలరి కి తాపంతో ఏం పని నీటిలో 
    దిగి చేపలు పడుతుంటాడు కదా)
   బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు - సాలె 
   (సాలెవానికి మగ్గంతో పనికదా 
    మగ్గం గుంటలో వుంటాడుకదా)
    ఏ వూళ్లో బడితే ఆ వూళ్లో వుండేవాడు - చాకలి

2. అనగా అనగా ఒక గచ్చు మేడ
   గచ్చుమేడ మీద చెక్క మేడ
   చెక్క మేడ ముందు కంచు మేడ
   కంచు మేడలో మత్యాల మేడ
   ముత్యాల మేడలో అయిదుగురు నాట్యం
   ఏమిటో చెప్పండి? 

సమాధానం - 
   అనగా అనగా ఒక గచ్చు మేడ - నేల
   గచ్చుమేడ మీద చెక్క మేడ  - పీట
   చెక్క మేడ ముందు కంచు మేడ - పళ్లెం
   కంచు మేడలో మత్యాల మేడ  - అన్నం
   ముత్యాల మేడలో అయిదుగురు నాట్యం - వేళ్లు

Thursday, March 8, 2018

గాలి గండమె గాని నీటిగండం లేదు


గాలి గండమె గాని నీటిగండం లేదు




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథ
విప్పండి-

1. గాలి గండమె గాని  నీటి గండం లేదు
   దేవతా రూపమై తిరుగుతుంది
   పగ బూని శత్రువును నోరార మ్రింగితే
   చావు పాలవుతుంది చిత్రమండి


సమాధానం - చేప


2. కమలా పురం కడప సందున ఒక గుంత
   గుంతలో ఒక గుండు, గుండుకు ఒక బొంగు
   బొంగుకు ఒక కుచ్చు
   ఏమిటో ఇది?

సమాధానం - పూచిన ఉల్లిపాయ మొక్క

Wednesday, March 7, 2018

చెన్నపట్నం సాని చెంపకు తగిలె


చెన్నపట్నం సాని చెంపకు తగిలె




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విచ్చండి-


1. దానికి తగిలె, దీనికి తగిలె.
   చెన్నపట్నం సాని చెంపకు తగిలె
   ఏమిటో చెప్పండి? 

సమాధానం - పసుపు

2. చిగురు చూడు, చిగురందం చూడు,
    ముదురాకుల ముచ్చట్లను చూడు,
    పళ్లూ కాయలు పువ్వులు లేవు
    పసందైన రంగులనే చూడు,
    విత్తనం కోసం చూశావంటే,
    వెదకుటేల వేసారుటేల

సమాధానం - క్రోటన్స్ (మొక్క)

Tuesday, March 6, 2018

రక్తం మాత్రం కారుతున్నది


రక్తం మాత్రం కారుతున్నది




సాహితీమిత్రులారా!

ఈ పొడుపు కథలను
విచ్చండి.


1. ముప్పదిరెండు ముత్యాల కోటలోనికి
    ముగ్గురు వీరులు కలిసి వెళ్ళారు
    కాని ఒక్కడూ తిరిగి రాలేదు
    రక్తం మాత్రం కారుతున్నది
   ఇదేమిటో చెప్పండి?

సమాధానం- 
ముప్పది రెండు ముత్యాలకోట - 
నోటిలోని పండ్లు 32 అవి ఉండే కోట - నోరు
ముగ్గురు వీరులు - ఆకు, వక్క, సున్నం.
రక్తం కారడం - తాంబూలం వేస్తే ఎర్రగా మారుతుందికదా


2. ముక్కు లేని పిట్ట తొక్కు లేని పప్పు
   మొక్కలేని చెట్టు రెక్కవంగని పక్షి
   ఇవేంటియో చెప్పండి?

సమాధానం -
ముక్కు లేని పిట్ట - తూనీగ
తొక్కు లేని పప్పు - ఉప్పు
మొక్క లేని చెట్టు - అంటు కట్టిన కొమ్మ
రెక్క వంగని పక్షి - తూనీగ

Monday, March 5, 2018

తలకాయ లేనోడు నవ్వుతాడు


తలకాయ లేనోడు నవ్వుతాడు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు కథలను
విచ్చండి-

1. కాళ్లు లేనోడు కాళ్లు ఉన్నోడిని మింగుతాడు
   దానిని చూసి తలకాయ లేనోడు నవ్వుతాడు
   వీరెవరో చెప్పండి?

సమాధానం - పాము
                                    కప్ప
                                            తాబేలు

2. కాళ్లు లేవు కాని చెట్టెక్కుతుంది
   నాలుక లేదు కాని నమిలి మింగుతుంది
   కాని మంచినీళ్లు తాగితే మరణిస్తుంది-
   ఏమిటో ఇది చెప్పండి?

సమాధానం - మంట

Sunday, March 4, 2018

కండ్లు ఉన్నోనికి చూపుండదు


కండ్లు ఉన్నోనికి చూపుండదు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు కథ కు
విడుపు చెప్పండి-

1. జుట్టుండే వానికి పేన్లు ఉండవు
   నీళ్లు ఉండే తావన చేపలు ఉండవు
   కండ్లు ఉన్నోడికి చూపు ఉండదు
   ఇదేమిటో చెప్పండి -
   
సమాధానం - టెంకాయ

2. నేను చెట్టు పైనే నివసిస్తాను 
             కాని పక్షిని మాత్రం కాను,
   ఎప్పుడూ చర్మాన్ని ధరించి ఉంటాను 
             కాని సన్యాసిని కాను,
   నాకు మూ కళ్లున్నాయి 
             కాని శంకరుణ్ణి కాను
   నాతోను నీళ్లంటాయి 
             కాని నేను మేఘాన్ని కాదు
   కుండ అంతకంటే కాదు. 
             అయితే నేనెవర్ని-

సమాధానం - కొబ్బరికాయ

Saturday, March 3, 2018

నేను ప్రాణమున్న కదిలే జంతువునే


నేను ప్రాణమున్న కదిలే జంతువునే




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు కథను విచ్చండి

1. నాకు కాళ్లు లేవు, చేతుల్లేవు,
    ఎముకల్లేవు, నాలుక లేదు, కళ్ళు లేవు,
    అయినా నేను ప్రాణమున్న కదిలే జంతువునే
    చెప్పండి? నేనెవరినో

సమాధానం - జలగ

2. పూయని మొగ్గేమిటో?
   పండు అనిపించుకోని కాయ ఏమిటో ?
   కాయ అనిపించుకోని పండు ఏమిటో?
   చెప్పండి?-
 
    సమాధానం- లవంగ మొగ్గ, 
                                  ఉసిరికాయ, 
                                           విబూది పండు  

Friday, March 2, 2018

అనంతభట్టు - చంపూభారతం


అనంతభట్టు - చంపూభారతం




సాహితీమిత్రులారా!


అనంతభట్టు 14-15 శతాబ్దాలకు చెందిన సంస్కృతకవి.
సంస్కృతంలో చంపూభారతాన్ని వ్రాశారు. 
చంపూభారతం చాలా ప్రౌఢకావ్యం. దీనిలోని ఇతివృత్తం
భారతకథ. ఇందులో 12 స్తబకాలున్నాయి. భారతంలోని
ఏ ప్రధానాంశం వదలకుండా రసవత్తరంగానూ, సంక్షిప్తంగానూ
భారత చంపువును రచించారు. ఈ కావ్యాంతంలో ఈ కవి
తనకీర్తి దిగంతాలకు వ్యాపించిందని చెప్పుకున్నాడు.
దీనిలో శబ్ద చిత్రాలకు, శ్లేషలకూ చ్యుతచిత్రాలకు
ఇచ్చిన ప్రాధాన్యం అలంకారాలకు కూడ ఇవ్వలేదు.
అయినప్పటికి అక్కడక్కడా అర్థచమత్కృతి ఉంది.
ఇది ఇప్పటికీ పఠన పాఠనాలలో ఉంది. ఇతనిది
నారికేళపాకం. ఇతడు ఎంత గొప్ప విషయాన్నయినా 
గాంభీర్యగుణంతో సూక్ష్మంగా చెప్పగలడు.

అర్జునుడు తీర్థాయాత్రా సందర్భంలో ఉత్తర, దక్షిణ,
పశ్చిమాలందు ఉలూపి, చిత్రాంగద, సుభద్రలను 
వివాహమాడాడు. కాని తూర్పదిక్కున ఏ కన్యనూ
వివాహమాడలేదు. ఎందుకంటే ఆ దిగంగనను
అంటే తూర్పుకన్యను ఇంద్రుడు స్వీకరించాడు
(ఇంద్రుడు తూర్పునకు అధిపతి) కాబట్టి
అక్కడి కన్యలందరూ తనకు సోదరీసమానులనని 
విడచినాడు అని కవి ఇక్కడ ఉత్ప్రేక్షించాడు.
భీముని పుట్టుకవల్ల వాయుదేవుడు పురుడుపడటం
(జాతాశౌచం) వల్ల ఎవరికైనా తగులుతుందేమో అనే 
భయంతో మెల్లమెల్లగా(మందమందగా) చరిస్తున్నట్లు
ఉత్ప్రేక్షించాడు. ఇలాంటి సొగసైన భావాలను
ఎన్నింటినో చూడవచ్చు ఈ భారతచంపువులో.

ఈ గ్రంథానికి వ్యాఖ్యలు రచించినవారు చాలమంది వున్నారు.
వారిలో కురరి రామకవీంద్రులు, మల్లాది లక్ష్మణసూరి, 
నారాయణస్వామి, కుమార తాతాచార్యులు, నరసింహాచార్యులు
చెప్పదగినవారు. 

Thursday, March 1, 2018

న్యస్తాక్షరి


న్యస్తాక్షరి




సాహితీమిత్రులారా!



చెప్పిన పదం లేదా అక్షరం కోరిన
చోట వచ్చేలా పద్యం చెప్పడం
"న్యస్తాక్షరి.."

న్యస్తాక్షరి- "శుభాకాంక్ష."
ఉత్పలమాల వృత్తంలో
సంక్రాంతి వర్ణన
1వ పాదంలో 12వ అక్షరం "శు"
2వ పాదంలో 10వ అక్షరం "భా"
3వ పాదంలో 04వ అక్షరం "కాం"
4వ పాదంలో 14వ అక్షరం "క్ష"
రావాలి

సింహాద్రి శ్రీరంగం గారి పూరణ-

పండెను గుమ్మడుల్, విరిసె బంతి, శుభంబుల పల్కిరర్ధు లున్
భండనభూమి నిక్కితన భాసురకంఠము విప్పికోడిరా
యండు సుకాంతులొప్పెను గృహాంతర సీమలెల్ల గ్రొత్తగా
బెండిలియైన దంపతులు వీడగలేరుక్షణంబు సైతమున్