Monday, January 16, 2017

ఏకాక్షర నిఘంటువు - 43


ఏకాక్షర నిఘంటువు - 43




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


గూః - మురికి

గృ - చల్లు, తడపు

గృజ్ - ధ్వనిచేయు

గృధ్ - కోరు, తీవ్రముగా కాంక్షించు

గౄ - పలుకుట, మాటలాడుట, మెచ్చుకొనుట,
               మ్రింగుట, తినుట, క్రక్కుట

గై - పాడుట, పాటపాడుట, చెప్పుట, వివరించుట


గోష్ - ప్రోగుచేయుట

గ్రథ్ - కూర్చుట, వంగుట

గ్రంథ్ - కట్టుట, క్రమముగా ఉంచుట, వ్రాయు,
                    రచించు, ఉత్పత్తిచేయు

గ్రస్ - తిను, మ్రింగు, జీర్ణించుకొను,
                పట్టుకొను, గ్రహము పట్టు, చెడగొట్టు

గ్రహ్ - పట్టుకొను, తీసుకొను, స్వీకరించు, అంగీకరించు,
                 బంధించు, నిలుపు, ఆకర్షించు, జయించు,
                 సంతోషపెట్టు, తెలిసికొను, అర్థము చేసికొను,
                  ఊహించు, నమ్ము, పలుకు, కొను, దొంగిలించు,
                  ధరించు, పరిశీలించు, గ్రహణము పట్టు

గౌః - గోమేధమనే యజ్ఞం


No comments: