Saturday, February 27, 2021

పొడుపు పద్యం

 పొడుపు పద్యం





సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చదవండి

ఆలోచించండి 

అర్థం చెప్పగలరేమో

చూడండి.


పంచాంగమగగమారె వైకుంఠుఁడొకసారి

         రక్తబీజమగ పైన వ్రాలె శుకము

బాలకుుడొకఁడు దివ్యస్నానముంజేసె

          గృహకారి గృహములో గృహముగట్టె

గృహమృగమ్మెలుకపై నెగిరి దూఁకి వధించె

          వక్రకంఠమెడారిఁబయనమించెఁ

బాపభీతిల్లె దివాభీతముంజూచి

          మణికట్టుపై గుట్టెముంటితిండి

వేఁటకై యీగపులిపొంచి గూఁటినుండె

నాకసమునకు నెగెరె జిహ్వారదమ్ము

మెప్పుగా నర్థములివేవి చెప్పవలయు

దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!


సమాధానాలు -

పంచాంగము - ఐదు అంగములు కలది (తాబేలు)

రక్తబీజము - దానిమ్మచెట్టు(ఎర్రని విత్తులకాయలు గాయుచెట్టు)

దివ్యస్నానము - ఎండగాసే వానలో తడవటం

గృహకారి - కందిరీగ(మట్టితో నింట నిల్లు గట్టేది)

గృహమృగము - పిల్లి (ఇంటిలో మృగము వంటిది)

వక్రకంఠము - ఒంటె (వంకరమెడ కలది)

దివాభీతము - పగటిని చూచి భయపడేది గుడ్లగూబ

మంటితిండి - మట్టితి తినేది (తేలు)

ఈఁగపులి - ఈగలను వేటాడి తినేది సాలెపురుగు

జిహ్వారదము - నాలుకయే దంతములుగా గలది - పక్షి


Thursday, February 25, 2021

ముద్దుగ గండపెండరము గొనుము

 ముద్దుగ గండపెండరము గొనుము





సాహితీమిత్రులారా!



ఒకానొక రోజు భువనవిజయంలో
 కృష్ణదేవరాయలు సభలోిని
 అష్టదిగ్గజములకు
ఈ విధంగా పలికాడు.
సంస్కృతం తెలుగు సమానంగా కవిత్వం చేప్పిన వారికి
ఈ గండపెండెరము తొడుగుతానని కవిత్వం చెప్పమని చెప్పాడు.
సభలోని వారెవరు ముందుకు రాకపోవడంతో కృష్ణదేవరాయలు
ఈవిధంగా పద్యంలోని రెండు పాదాలను చెప్పాడు.

కృష్ణదేవరాయలు-
ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహూకరింపగా
నొద్దిక నా కొసంగమని యొక్కరు గోరగలేరు లేరొకో

దీనికి ప్రతిగా పెద్దనగారు చెప్పిన రెండు పాదాలు-

పెద్దన-
పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా

అని పలికి ఆశువుగా -

పూతమెఱుంగులుం బసరుపూప బెడంగులుఁ జూపునట్టి వా
కైతలు జగ్గునిగ్గు నెనగావలెఁగ్రమ్మున గమ్మనన్వలెన్
రాతిరియుంబవల్మఱపురాని హొయల్ చెలియారజంపుని
ద్దాతరి తీపులంబలెను దారసిలన్వలెలోఁదలంచినన్
----------------------
-----------------
-------------------
--------------------
----------------------
 ----------------------
                   అని
21 పాదముల ఉత్పలమాలిక  చెప్పగా
కృష్ణదేవరాయలు సంతోషంతో
పెద్దనగారికి
గండపెండెరము(కాలికితొడుగు అందె)
తొడిగి సత్కరించాడు.

Tuesday, February 23, 2021

సంవాదచాటువు

సంవాదచాటువు




సాహితీమిత్రులారా!



శ్రీనాథుని సంవాద చాటువు -

"అరవిందానన! యెందు బోయెదవు? " 

"మత్ప్రాణేశు ప్రాసాద మం

దిర దేశంబున కో లతాంగి! " 

"బహుళాంధీభూత మార్గంబునన్

దిరుగ న్నీకిటు లొంటి గాదె? " 

"శుకవాణీ! మాట లింకేటికిన్,

మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 

మా వెంటరా నొంటియే? "


ఒక పడుచుపిల్ల మరో పడుచుపిల్లకు 

మధ్యజరిగిన సంవాదపద్యమిది-


 ఒక పడుచు మరొక పడుచు పిల్లను- 

అరవిందానన! యెందు బోయెదవు?

ఎక్కడికి పోతున్నావు ? 


మరో పడుచుపిల్ల 

మత్ప్రాణేశు ప్రాసాద మం

దిర దేశంబున కో లతాంగి!

నా ప్రియతముని సౌధ ప్రాంతాలకు పోతున్నాను 


పడుచుపిల్ల -

బహుళాంధీభూత మార్గంబునన్

దిరుగ న్నీకిటు లొంటి గాదె?

 ఇంత చీకటిలో ఒంటరిగా పోతున్నావు, నీకు భయంలేదా?

 . 

మరో పడుచుపిల్ల-

శుకవాణీ! మాట లింకేటికిన్,

మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 

మా వెంటరా నొంటియే? 

 ఒంటరిగానా? ఏంమాటలవి? ఆకర్ణాంతం సంధించిన 

వింటితో మన్మథుడు నా వెన్వెంటే నడచివస్తుండగా 

నేను ఒంటరి నెలా అవుతాను ?. 


అంటే మన్మథ తాపానికి తాళలేకనే నా ప్రియుని 

కలియడానికి వెళ్తున్పాను అని నర్మ గర్భంగా 

చెబుతున్నదీ పడుచుపిల్ల

 

Sunday, February 21, 2021

మూడక్షరాల సమాధానాలు చెప్పండి

 మూడక్షరాల సమాధానాలు చెప్పండి




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూచి సమాధానాలు చెప్పండి-

దివ్యసంఘములైతతేరిచూడఁగలేని

              కుంభజుదేనిచేఁ గూల్చె నరుఁడు

ప్రతినఁదీరకయుంటఁ బ్రాణావశిష్టుఁడౌ

              కౌంతేయు దేనిచేఁగాచెను హరి

సరసిజవ్యూహాన శత్రుసైన్యంబుల 

              నభిమన్యుఁడెందుచే నడలఁగొట్టె

కౌరవ్యయోధులఁ గపటకేళినటించి

              తేజమున్  దేనిచేఁ దీసె హరియు

ధర్మపథ మెందుచేఁ జేరె ధర్మరాజు

యన్నిటికిఁజూడ మూడేసి యక్షరములు

మధ్యకడ యక్షరములు, సమానమన్ని

కూర్చె గంగాధరము తెల్సికొండు దీని


షరతులు -

ప్రతిప్రశ్నకు సమాధానం మూడక్షరాలుండాలి మరియు మధ్య చివరి అక్షరాలు అన్నిటికి సమానంగా ఉండాలి.


సమాధానాలు -

భక్తిచే, యుక్తిచే, శక్తిచే, రక్తిచే, ముక్తిచే

షరతులు సరిపోయినవికదా


Friday, February 19, 2021

సప్తస్వరాల పద్యాలు

 సప్తస్వరాల పద్యాలు




సాహితీమిత్రులారా!



సంగీత స్వరాలైన స,రి,గ,మ,ప,ద,ని- అనే

సప్తస్వరాలతో పద్యం లేక శ్లోకం కూర్చటం

చిత్రకవిత్వంలో కలదు. దీన్ని శబ్దచిత్రంలో

తీసుకుంటాము. ఇలాంటి ఒక శ్లోకం-


సా మమారిధమనీ నిధానినీ

సామధామ ధనిధామ సాధినీ

మానినీ సగరిమా పపాపపా

సాపగా సమసమాగమాసమా

               (సరస్వతీకంఠాభరణము - 2- 265)

ఇది సరిగమల పద్యం-

సరిగా నీపని సాగనీ గరిప, దా, సాగారి సద్ధామ మా

గరిమన్ సామ నిధానిగా, సమపథంగా సాని నీసారి! మా

దరిగానీ మఱి దారి, సన్నిగమపా! దా సాగ! మాపా! సదా

దర మొప్పం గురుమూర్తినాథ! సురవంద్యా! పాహిపాహి ప్రభో!

                                                                   (శ్రీకుమూర్తినాథ శతకం - 50)

మరొక పద్యం-

మా పని మీ పని గాదా

పాపమ మా పాపగారి పని నీ పనిగా

నీ పని దాపని పనిగద

పాపని పని మాని దాని పని గానిమ్మా


Wednesday, February 17, 2021

చిత్రకావ్యం వీడియో -2

చిత్రకావ్యం వీడియో -2





సాహితీమిత్రులారా!


వేదాంతదేశికులుగారిని గురించి

చిత్రకావ్యం గురించి సంక్షిప్తంగా  .................



Monday, February 15, 2021

ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో....

 ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో....



సాహితీమిత్రులారా!



సరదాగా మాట్లాడుకుందా!

ఇక్కడ ఇచ్చిన వాక్యాలను చూడండి

ఒక వాక్యం రెండు అర్థాలుగా కనిపిస్తున్నది

1. మీ  సంగతి ఏమిటి? 

   మీసం  గతి ఏమిటి? 

2. గురూజీ  వనం  బాగుందా? 

  గురూ  జీవనం బాగుందా?

3. ఆమే  కమలమును తొక్కింది. 

 ఆ  మేక  మలమును తొక్కింది. 

4. మాట  మాట పెరిగింది. 

   మా  టమాట పెరిగింది. 

5. ఆహారం చూడ ఎంత బాగుందో!

 ఆ హారం చూడ ఎంత బాగుందో! 

6. మాతా తమరు నిమిషంలో చేరారు. 

    మా తాత మరునిమిషంలో చేరారు. 

7. నావ లతలపై పడింది. 

  నా వల తలపై పడింది. 

8. రామారావుంటే  నేను వస్తాను. 

 రామా  రా  వుంటే  నేను వస్తాను. 

9. ఆమె కవితలతో జీవనం చేయును.

  ఆమె కవి తలతో జీవనం చేయును.

10. మాతా  మరను పట్టుకో. 

  మా తామరను పట్టుకో.....

     మన తెలుగు భాషఔన్నత్యం...గొప్పతనం

                     తెలుగు భాషలో

         అనేకార్థక అంటే ద్వ్యర్థి,త్య్రర్థి,చతురర్థి

              కావ్యాలు ఇరువది ఎనిమిది ఉన్నాయని తేలింది.

                                                 -------------------------------------------

                                                      వైద్యం వేంకటేశ్వరాచార్యులు

Thursday, February 11, 2021

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు - 2

 ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు  - 2





సాహితీమిత్రులారా!



రామాయణకాలం నాటి ప్రదేశాలు

నేటి నామధేయాలు - 

1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.

19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)


Tuesday, February 9, 2021

ప్రహేలికా

 ప్రహేలికా




సాహితీమిత్రులారా!


ఈ వీడియోలో ప్రహేలికను గురించిన 

విషయాన్ని ఆస్వాదించండి -



Saturday, February 6, 2021

చిత్రకావ్యం వీడియో - 1

 చిత్రకావ్యం వీడియో - 1




సాహితీమిత్రులారా!

చిత్రకావ్యంలో కూటచిత్రం ఒకటి

దానిలోని ఒక ఉదాహరణ ఈ వీడియోలో 

ఆస్వాదించండి-





Thursday, February 4, 2021

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 11

 కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 11




సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని పదకొండవ శ్లోకం-

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా

సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా |

ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః

కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా ‖ 11


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి - 




Tuesday, February 2, 2021

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు 





సాహితీమిత్రులారా!

భాగవతం, మహాభారతం కాలంనాటి 

ప్రదేశాలకు నేటి పేర్లు గమనించండి


1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్

5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి 

      వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-

       కురుక్షేత్ర, హర్యానా

6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,

     సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - 

     కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,

      పురాణాలు బోధించిన ప్రాంతం) - 

         సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- 

        మన గ్రామం, ఉత్తరాంచల్

12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.

24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.

32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.

-------------------------------------

ముఖపుస్తకం నుండి