ఏకాక్షర నిఘంటువు - 46
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ఛద్ - మూయుట, కప్పుట
ఛంద్ - సంతోషపెట్టుట, ఒప్పించు, కప్పివేయు
ఛర్ - క్రక్కు
ఛిద్ - నఱకు, ముక్కలుచేయు, నాశముచేయు, పోగొట్టుట,
నఱకునది, వేఱుచేయునది, తొలగించునది,
నశింపచేయునది
జః - జనించుట, పుట్టినది, శంకరుడు, విష్ణువు
జక్ష్ - తినుట, అనుభవించుట, నాశముచేయుట
జన్ - పుట్టుట
జప్ - మంద్రస్వరముతో ఉచ్ఛరించుట, మనసులోనే మాటిమాటికి
ఉచ్ఛరించుట మంత్రోచ్ఛారణ చేయుట
జి - జయించుట, ఓడించుట
జీవ్ - జీవించుట, పునర్జీవించుట, ఉండుట, వృత్తి నిర్వహించుట
జుష్ - సంతుష్టుడగుట, అనుకూలుడగుట, మిక్కిలి ఇష్టపడుట,
అనుభవించుట, పోవుట, నివసించుట,
ప్రవేశించుట, ఎన్నుకొనుట, తర్కించు, ఆలోచించు,
పరీక్షించు, గాయపరచు, సంతోషించు
జూః - ఆకాశము, సరస్వతి, పిశాచస్త్రీ, వేగము
జృ - వంచుట, వినీతునిచేయుట, అతిక్రమించుట
జృభ్ - ఆవలించు, తెఱచు, పెంచు, వ్యాపింపచేయు
No comments:
Post a Comment