Wednesday, November 30, 2016

ఖలహనన కరణగరగళ


ఖలహనన కరణగరగళ




సాహితీమిత్రులారా!


దీర్ఘాలైన అచ్చులు లేకుండా శ్లోకాన్ని లేదా
పద్యాన్నిరాయడాన్ని సర్వలఘుచిత్రం అంటాము.
అలాగే వర్ణముల ఉత్పత్తిస్థానాలను బట్టి కేవలం
కొన్నిటినే తీసుకొని వ్రాయటాన్ని స్థాన చిత్రం అంటాము.

ఈ క్రింది శ్లోకంలో ఈ రెండింటిని చూడవచ్చు చూడండి-

ఖలహనన కరణగరగళ
జలజజనత తరణ సకల జనదర హరణ
లలదజల శరణ జయకర
గలనన రథచరణ నతత ఖరకర శరణ
                                                     (అలంకారశిరోభూషణే - 7 - 21)
(ధర్మ భ్రష్టులైన దుష్టులను వధించువాడా!
విషధరుడైన శివునిచేత, పద్మభవుడయిన
బ్రహ్మచేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా!
జనుల భయాన్ని హరించువాడా!
ముసలితనం లేని దేవతలకు దిక్కైనవాడా!
జయమును కలిగించువాడా!
నిరంతర సూర్యమండల వర్తీ రంగనాథా!
నీకు నమస్కారం)

మొదటిది-
దీనిలోనివన్నీ లఘువులే కావున
ఇది సర్వలఘుచిత్రం క్రింది వస్తుంది.
దీనిలో 2,4 పాదాలలోని చివరి అక్షరాలు
లఘువులైనా గురువులుగా పలికే
సాంప్రదాయం చిత్రకవిత్వంలో ఉంది.

రెండవది-
ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులు
ఉ,ఊ,(ఒ),ఓ,ఔ - అనే అచ్చులు
పెదిమలచే పలుకబడతాయి
వీటిని ఓష్ఠ్యములు అంటారు.
వీటిని లేకుండా రాయడాన్ని నిరోష్ఠ్యము అంటారు.
ఇది స్థానచిత్రము- దీన్ని పెదిమలు తగలకుండా
పలుకవచ్చు చదివి గమనించండి.

కృపాం మయి సదా!


కృపాం మయి సదా!




సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర శ్లోకం చూడండి-

ఒక ప్రియుడు తన ప్రేయసితో ఇలా అంటున్నాడు-

వక్త్రేందు: కబరీభర స్తన తమ స్సీమన్త సూర్యోగురు
ర్వక్షోజా వధర స్స చావనిజని: కేతు ర్భ్రువౌ సుందరి
వాక్యం కావ్యమయం శనైశ్చరగతి ర్మస్తు సౌమ్యోపర
స్సాత్వం చేత్కురుషే కృపాం మయి సదా సర్వేనుకూలాగ్రహా


సుందరీ! గ్రహయోగము ఎట్లు చాలలేదు
నీముఖము చంద్రుడు, నీ కొప్పు తమము(రాహువు),
నీ పాపటబొట్టు రవి, నీ చనుగవ గురువు,
నీ యధరోష్టము లోహితాంగుడు (కుజుడు),
నీ కనుబొమలు కేతువు, నీ మాటలు కావ్యమయము(శుక్రుడు)
నీ నడక శనైశ్చరుడు, నీ నడుము సౌమ్యుడు(బుధుడు)
కాంతామణి అన్ని గ్రహాలు నీ యందే యోగమై ఉన్నవి కదా
నీ దయ ఒక్కటి నాయందు ప్రసరింపచేయుదువేని నా కన్ని
గ్రహములు అనుకూలములు గాక ఏ మగును

దీనిలో ఆమె ముఖం చంద్రబిబం
కొప్పు నల్లగా రాహువువలె ఉన్నది.
నీ పాపట బొట్టు సూర్యకాంతితో వెలుగుచున్నది.
నీ చనుగవ గొప్పవిగా గురునివలె ఉన్నవి.
నీ అధరము ఎర్రగా కుజునివలె ఉన్నది.
నీమాటలు కవి(శుక్రుని)కావ్యం వలె కమనీయంగా ఉన్నవి.
నీ నడక మందముగా(శనైశ్చరునివలె) ఉన్నవి.
నీ నడుము సోమ్యముగా బుధునివలె ఉన్నది.
అని చంద్రుడు, రాహువు, రవి, గురుడు,
కుజుడు, కేతువు, శుక్రుడు, శని, బుధుడు-
తొమ్మిది గ్రహాలను ఆమె శరీరంలో గోపనం చేసి
కవి చెప్పాడు కావున ఇది గోపన(గూఢ) చిత్రమగుచున్నది.

Tuesday, November 29, 2016

అప్పులిడు నతడు ఘనుడా?


అప్పులిడు నతడు ఘనుడా?




సాహితీమిత్రులారా!


భాస్కరరామాయణాన్ని రచించిన
నలుగురు కవులలో ప్రధానమైనవాడు
హుళక్కి భాస్కరుడు. భాస్కరరామాయణాన్ని
కృతిగా అందుకున్నవాడు
సాహిణిమారు(డు)న.
ఈయనను గురించి హుళక్కి భాస్కరుడు చెప్పిన
ఈ ప్రహేళిక లేక పొడుపు కథ లాంటి పద్యం చూడండి-


అప్పులిడు నతడు ఘనుడా?
అప్పు డొసగి మరల పొందు నాతడు రాజా
చెప్పగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు, రాజు నటంచున్


అప్పు ఇచ్చేవాడు గొప్పవాడా -
అని సామాన్యంగా అర్థమౌతుంది.
అప్పులు ఇచ్చేవాడు తీర్చేవాడు కాదు ఇక్కడ.

అప్ అంటే సంస్కృతంలో నీరు -
దాన్ని తెలుగు పదంగా మార్చటం వల్ల
అప్పుగా మారింది.
ఇక్కడ అప్పులిచ్చేవాడు
ఘనుడా అంటే మేఘము

అప్పుడొసగి మరల పొందు నాతడు రాజా -
దీనిలో
రాజు అంటే భూమిని పాలించేవాడు, చంద్రుడు

ఇక భావంలోకి వస్తే

నీటిని ఇచ్చే మేఘునికంటె,
తన కళలను ఇచ్చి తిరిగి
స్వీకరించే చంద్రునికంటె
దానంలో సాహిణి మారప్పే
గొప్పవాడు - అని భావం.

ఆంధ్ర భాషా మయం కావ్యం


ఆంధ్ర భాషా మయం కావ్యం




సాహితీమిత్రులారా!


ఒకమారు శ్రీకృష్ణదేవరాయల కొలువుకు వచ్చిన
సంస్కృతపండితుడు ఆంధ్రభాషను ఈ సడిస్తూ
ఈ విధంగా చెప్పారు-

ఆంధ్ర భాషా మయం కావ్యం 
అయోమయ విభూషణం

(ఆంధ్రభాషా కావ్యం ఇనుముతో చేసిన
ఆభరణం లాంటిది- అని భావం)

అది విన్న తెనాలి రామకృష్ణకవిగారు
ఈ విధంగా అన్నారట-

సంస్కృతారణ్య సంచారి
విద్వన్మత్తేభ శృంఖలం

(సంస్కృతం అనే అడవిలో తిరిగే
మదించిన ఏనుగులాంటి విద్వాంసునికి
కాలి సంకెల ఆ భూషణం - అని భావం.)

Monday, November 28, 2016

ముఖప్రక్షాళనా త్పూర్వం(పేరడి)


ముఖప్రక్షాళనా త్పూర్వం (పేరడి)




సాహితీమిత్రులారా!


కొన్ని శ్లోక పాదాలకు వ్యంగ్యరీతిలో(పేరడి)
చెప్పినవి. ఇవి తెనాలి రామకృష్ణడు చెప్పినట్లు
లోకంలో ప్రతీతి-

రాజగురువు తాతాచార్యులవారిని ఆనాటి వైష్ణవులు
అప్పయదీక్షితుల కంటె కూడ పూజ్యుడని
ఈ విధంగా అనేవారట-

అప్పయ్య దీక్షితా త్పూర్వం 
తాత: పూజ్యో న సంశయ:

ఇది గిట్టని రామకృష్ణులవారి వ్యంగ్య పూరణ-

ముఖ ప్రక్షాళనా త్పూర్వం
గుద ప్రక్షాళనం యథా


సంస్కృత వ్యాకరణనిధీ, బౌద్ధవిరచితమైన
అమరకోశంలోని ప్రతి శబ్దానికీ సాధుత్వం
సాధించినవాడూ ఒక అప్పలాచార్యులవారు
ఆకాలంలో ఉండేవారట. వారిని పండిత
వాదంలో ఎదుర్కోలేని పండితులు
హైందవాభిమానులు ఇలా అనేవారట-

అపశబ్ద భయం నాస్తి 
అప్పలాచార్య సన్నిధౌ

దీనికి రామకృష్ణుని వ్యంగ్యపూరణ-

అనాచార భయం నాస్తి 
తిష్ఠ న్మూత్రస్య సన్నిధౌ


గాలివాన గోవు మేలు గాదె


గాలివాన గోవు మేలు గాదె



సాహితీమిత్రులారా!


సమస్య-
గాలివాన గోవు మేలు గాదె

కడిమిళ్ల వరప్రసాదుగారి పూరణ-

గోవునందు సురలు గూడి యుందురుగాన
ఎల్లరకును బాల తల్లిగాన
లోకమందు నిజము రూపింపగా నలు
గాలివాన గోవు మేలు గాదె

దీనిలో కవిగారు గాలివానకు ముందు
నలు చేర్చడంవలన నలుగాలివాన అయింది
నలుగాలివాన - అంటే నాలుగుకాళ్ళుగలవి అన-
జంతువులలో గోవుమేలైనది అనే అర్థంగా మారింది.



ఆసక్తిగల మీరునూ మరోరకంగా పూరించి పంపండి.


Sunday, November 27, 2016

రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!


రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!




సాహితీమిత్రులారా!



సమస్య-
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!

ఈ సమస్యకు వివిధకవులు చేసిన
మూడు పూరణలు చూడండి-

1వ పూరణ-

గతి లేని వాని నే స
మ్మతి మాలిన మూర్ఖు నెట్టి మానిసి నైనన్
అయి సరసు జేయగల భా
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!

ఎటువంటి మూర్ఖుణ్నైనా
రసికుని చేయగల
భారతి చిత్రం రవికైనా
తెలియదని భావం


2వ పూరణ-

పతిపై నలిగిన స్త్రీతో
అతులితముగ నాట్య మాడి అలసిన స్త్రీతో
అతి నూత్న రజస్వలతో
రతి చిత్రము తెలియరాదు రవికైనా నృపా!

ప్రణయకలహం తీర్చిన తర్వాత,
నర్తించి అలసిన తర్వాత,
క్రొత్తగా వ్యక్తురాలైన కన్యతో -
రతి ఎంతో ఆనందహేతువు- అని భావం.



3వ పూరణ-

క్షితిలోని కవుల కెల్లన్
సతతంబై వెలయు నాంధ్ర సంస్కృతములలో
నతుకన్ మేలయిన ప్లుత వి
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!

ఇందులో రతి కి ముందు
ప్లుత వి చేర్చడంవలన ప్లుతవిరతి అనే
యతికి సంబంధించినదిగా మారినది.


ఆసక్తిగల మీరును మరో విధంగా పూరించి పంపండి.

అతి సర్వత్ర వర్జయేత్


అతి సర్వత్ర వర్జయేత్




సాహితీమిత్రులారా!



అతి సర్వత్ర వర్జయేత్ - అనే
నీతిని సంస్కృతంలోకి
అనువదించమని
మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్యులవారిని అడిగారట-
దానికి ఆయన ఈ విధంగా చెప్పారట.

అతిహితమపి జంతూనా
మతిచేదహితం భవేదు భయథా లోకే
అమృతమస్యహీనం
సీతం కుర్యాత్ స్వయంమృతం సత్సీతం

మిక్కలిహితమైనది అయినా అతి అయితే
ప్రాణులకు రెండువిధాల(శబ్దం వలన, అర్థం వలన)
అహితమవుతుంది.
శబ్దం వలన అహితమెలా అవుతుందో-
అతిహితం - అనే పదంలో
అతి - అంటే తి లేనిది - అంటే కేవలం - అ
అతిహితంలో - తి - పోతే,
అహితం - అవుతుంది.

అర్థం వలన అహితం ఎలాఅవుతుందో-
తియ్యగా ఉండే దేదైనా ఎక్కువైతే
తినగాతినగా గారెలు కండ్రయెక్కె
అనడం సుప్రసిద్ధమే కదా!

దీనికి ఉదాహరణ ఉత్తరార్థంలో చెప్పబడింది.

అమృతమైనా ఎక్కువైతే మృతమై
త్రాగిన వాణ్ని చంపుతుంది.

అహీనం అంటే ఆకారంలేని,
అమృతం అంటే అమృతం - అ - మృతం, కదా!
తేనె అయినా ఎక్కువైతే వికటిస్తుంది వెగటు కలిగిస్తుంది.

ఇది కవిగారు చెప్పిన వివరణే.

Saturday, November 26, 2016

ఉపోఢ రాగాప్యబలా మదేన సా


ఉపోఢ రాగాప్యబలా మదేన సా



సాహితీమిత్రులారా!



యమకాలంకారంలో కొన్ని రకాలు చూశాము-
ఇక్కడ సంధిస్థూలావ్యపేత యమకాన్ని
గురించి చూద్దాం-

ఈ ఉదాహరణశ్లోకం చూడండి
ఇది దండికావ్యాదర్శంలోనిది

ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
యోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే
                                                                     (కావ్యాదర్శ:  - 3-52)

(ఆమె(నాయిక) అబల అయికూడ,
తారుణ్యమదముచేత భరింపబడిన
అనురాగము కలదయికూడ, తనను
తాను నిగ్రహించుకొన్నదయి,
నా పాపముచేత క్రోధరసముతో
కూడుకొన్నదయి మన్మథునికే తాపము
కలిగించిన దైననూ నాకు తానింత తాపము
కలిగించునది కాలేదు (ఇంతని చెప్పటానికి
వీలులేనంత తాపము కలిగించెనని భావము))

ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
యోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే

దీనిలో అక్షరసముదాయం పాదము చివరలందు
పాదం మొదటిలోను వ్యవధానంలేకుండా
ఆవృత్తమవుచున్నది. అదీను నాలుగు అక్షరముల
సముదాయం కావున ఇది సూక్ష్మముకాక
స్థూలమైనదిగా గమనించాలి.
మరియు పాదముల సంధినందు ఆవృత్తం
కావడం వల్ల ఇది సంధిస్థూలావ్యపేత యమకంగా
చెప్పబడుచున్నది
దీనికే సందష్టక యమకమనేపేరు కూడ ఉంది.
దాన్నిగురించి తరువాత  తెలుసుకుందాం..


సరత్సురారాతి భయాయ


సరత్సురారాతి భయాయ




సాహితీమిత్రులారా!


మనం ఛందస్సులో గణాలకువాడే ఈ హల్లులను
(య,మ,త,ర,జ,భ,న,స,ల,గ - అనే పది అక్షరాలను)
ఛందోక్షర వ్యంజనాలు అంటారు. వీటిని ఉపయోగించి
శ్లోకం వ్రాసిన దాన్ని ఛందోక్షరవ్యంజన చిత్రం అంటారు.

సరత్సురారాతి భయాయ జాగ్రతో
జగత్యలం స్తోతృజనస్య జాయతామ్
స్మితం స్మరారే ర్గిరిజాస్య నీరజే
సమేత నేత్రత్రితయస్య భూతయే
                                                     (సరస్వతీకంఠాభరణమ్ - 2- 264)


(పార్వతీ ముఖద్మము నందలి మన్మథ శత్రువైన
శివుని చిరునవ్వు మేలుకొనియున్న స్తోత్రజనముల
కైశ్వర్యమును కూర్చుగాక త్రినేత్రునియొక్క స్మితము
కదలుచున్న రాక్షసులకు భయమును కలుగజేయుగాక)

పై శ్లోకంలో  య, మ, త, ర, జ, భ, న, స, ల, గ- అనే
పది అక్షరములే ఉన్నాయి. అవికాక వేరేమైన ఉండినవేమో గమనిచండి.


Friday, November 25, 2016

మధురవాణీ విలాసములోని చిత్రకవిత


మధురవాణీ విలాసములోని చిత్రకవిత




సాహితీమిత్రులారా!


మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్ష , ద్వ్యక్ష   త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-

''- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-

'', '' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాన నిన్నెకాక నినేనొనై
నానెన్ని కిను నూన
కానుకకైకొన్న నిన్ను న్నా నికఁనే (2-12)


, - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామమున నమ్మినాము మము మనును మో
మామానినాన నెమ్మిని
మే మనుమామ్ముమామి మ్మెన్నేమా (2-13)


త్య్రక్షరకందము-

ద,,- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దావవవవదా
నానావిద్వన్నవీ నిదానా
దీనానాదీదా
నానుదు నె నీదువాదు నావినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.

భోగములకు గద్దెనెక్కు పురుషుడె


భోగములకు గద్దెనెక్కు పురుషుడె




సాహితీమిత్రులారా!




ఆర్యాశతకంలోని
ఈ శబ్దచిత్ర పద్యం చూడండి-

రాగలిగినట్టి జన్యు డె
ఓగుగలుగు వేళ జనుల నొగిగావగవా
డేగద రాజన్యుడు భువి
భోగములకు గద్దెనెక్కు పురుషుడె యార్యా!

జన్యుడు అంటే పుట్టునటువంటివాడు
                అంటే మానవుడుగా జన్మించినవాడు
ఓగుగలుగు వేళ - ప్రక్కవారికి కీడు కలిగినపుడు ఆదుకొనుటకు
                               లేదా రక్షించుటకు రాగలవాడే రాజన్యుడు
అనగా పట్టభద్రుడైన రాజు గాని కేవలం భోగం అనుభవించటానికి
గద్దెనెక్కినవాడు రాజు కాడని ఈ పద్య భావం

జన్యుడు అనే శబ్దానికి మొదట రా కలిపినపుడు
లేదా చేరినపుడు రాజన్యుడు అవుతుంది.

Thursday, November 24, 2016

అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల


అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల



సాహితీమిత్రులారా!


సమస్య-
అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల నొక్కడు భానుమాలికిన్

తాడిచెర్ల కృష్ణశర్మగారి పూరణ-

దైర్ఘ్య దివాక రోష్ణకర తైజసవర్ధిత మీ జగంబు కా
నర్ఘ్యము విప్రదత్తము త దర్క పరాక్రమ పోషకం బగున్
అర్ఘ్య విధానమాగమ వచోన్విత మౌటను బ్రాహ్మణుండు తా
అర్ఘ్యము లిచ్చెరా త్రి సమయమ్ముల నొక్కడు భానుమాలికిన్

అర్ఘ్యము లిచ్చె - రాత్రి సమయమ్ముల
అనే దాన్ని రాత్రివేళ కాదు
అర్ఘ్యములిచ్చెరా - త్రి సమయమ్ముల -
అని మార్చి - ఉదయ, మధ్యాహ్న,
సాయంకాల సంధ్యావందన భావనను వర్ణించారు.

ఆసక్తిగల మీరును రసరమ్యంగా 
మరో చమత్కారంలో పూరించి పంపండి.

భూపాలుండ రక్షించవే


భూపాలుండ రక్షించవే



సాహితీమిత్రులారా!


కామినేని మల్లారెడ్డి గారి షట్చక్రవర్తి చరిత్రలోని
కార్తవీర్యార్జునుని కథలో తన తండ్రి యనంతరము
రాజ్యభారము వహించుటకు కార్తవీర్యార్జునుడు
ఇష్టపడలేదు. గర్గుని బోధనవలన దత్తాత్రేయుని
సేవించడాని వెళ్ళాడు. నిరంతరము మదవతీలోలుడును,
మద్యపానరతుడు అయి కాలము బుచ్చుతున్న దత్తాత్రేయ
యోగిని, కార్తవీర్యార్జునునకు మధ్యజరిగిన సంభాషణ చిత్రం ఇది.


ఓరీ యర్భక, నీ వదెవ్వఁడవురా ఓ సామి, భూభృన్మణిన్
మేరుగ్రావమవో మహాత్మ యినుఁడన్ నీరేజమిత్రుండవో
కారుణ్యాకర, రాజ శీతఘృణివో కానయ్య, యీ ధరుణీ
భారం బూనిన కార్తవీర్యుడను భూపాలుండ రక్షింపవే
                 (షట్చక్రవర్తి చరిత్ర 8-28)

దత్తాత్రేయుడు- ఓరీ! యర్భక, నీ వదెవ్వఁడవురా? 
కార్తవీర్యుడు - ఓ సామి, భూభృన్మణిన్
దత్తాత్రేయుడు- మేరుగ్రావమవో? 
కార్తవీర్యుడు- మహాత్మ యినుఁడన్ 
దత్తాత్రేయుడు - నీరేజమిత్రుండవో?
కార్తవీర్యుడు- కారుణ్యాకర, రాజ 
దత్తాత్రేయుడు- శీతఘృణివో? 
కార్తవీర్యుడు- కానయ్య, యీ ధరుణీభారం బూనిన 
                    కార్తవీర్యుడను భూపాలుండ రక్షింపవే

Wednesday, November 23, 2016

వగలాడి పొందుగోరిన


వగలాడి పొందుగోరిన



సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి "ఆర్యా" శతకంలోని
ఈ శబ్దచిత్రపద్యం చూడండి-

వగలాడి పొందుగోరిన
వగయొక్కటి లాడి యొకటి వగకాడైనన్
వగచే కాడుంబడి తా
వెగడొందును వానివలన వినుమా యార్యా!

ఇందులో
వగలాడి అంటే శృంగార చేష్టలుగల స్త్రీ,
వగ అంటే దు:ఖము,
లాడి అంటే వ్రణం,
కాడు అంటే అరణ్యం, శ్మశానం.

పురుషులు విలాస చేష్టలుగల స్త్రీల వలలో తగులుకొంటే
చివరకు దు:ఖాన్ని అనుభవిస్తారు. ఎలాగంటే సుమతి భర్త
కౌశికుని వలె వ్రణాలపాలుగూడ అవుతారు. అలాగే స్త్రీలుగూడ
అటువంటి వానివలలో తగులుకున్నపుడు చివరకు దు:ఖాలపాలై
కాడుపడిపోతారు. కాబట్టి రూపం, శృంగారచేష్టలు అనే రెండు గూడ
మనిషికి  ఎంత అందమో అంత ప్రమాదకరమైనవికూడ. అందువలన
వీధిలో ప్రదర్శించుకుని ఎవరైనా దు:ఖాలపాలు కారాదు - అని భావం.

పర్వతం మాల్యవంతమ్


పర్వతం మాల్యవంతమ్



సాహితీమిత్రులారా!



వ్యపేత పాదచతుష్ట మధ్యమాంత 
యమకమును గురించి తెలుసుకుందాము-
దీనికి ఉదాహరణ
భట్టికృత రావణవధ కావ్యం నుండి చూడండి-

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

(హనుమంతుడు సంతోషంతో వేగముతో మితము
నర్థవంతమునైన యూ వాక్యములను ఆమెకు(సీతకు)చెప్పెను.
ఓ దేవీ! నీ విషాదమును తెలిసికొంటిని. రాక్షసుల నందరను చూచితిని.
ఎల్లపుడును మాంగల్యమును గలిగించు మాల్యవంతముమీదుగా
ప్రకాశముగా రఘువృషభుడయిన రాముని చెంతకు వెళ్ళుదును.)

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

దీనిలో
మొదటిపాదం 7,8 అక్షరాలు కలుపగా "దారం" అయినది
అలాగే పాదాంతమున "దారం" అని ఉంది.
రెండవపాదంలో 7,8 అక్షరాలు కలపగా "కాశం" అని అగును
అలాగే పాదాంతమున "కాశం" పునరుక్తమైనది.
మూడవ పాదంలో 7,8 అక్షరాలు కలుపగా "షాద:" అగును
అదే విధంగా పాదాంతమున పునరావృతమైనది.
నాలుగవపాదం 7,8 అక్షరములు కలుపగా "వంతం" అగుచున్నది
అదేవిధంగా పాదాంతమున "వంతం" పునరావృతమైనది
కావున దీనిలో ప్రతీపాదంనందు యమకము వచ్చింది
కాని ప్రతిదానికి మధ్య అంతరము ఉండటం వలన వ్యపేతమగుచున్నది
కావున ఇది వ్యపేత పాదచతుష్ట మధ్యాంతయమకమునకు
ఉదాహరణ అగుచున్నది.

Tuesday, November 22, 2016

కరులన్ జూచిన శత్రు సింహములు


కరులన్ జూచిన శత్రు సింహములు



సాహితీమిత్రులారా!


సమస్య-
కరులన్ జూచిన శత్రుసింహములు వీకన్ దోక జాడించెడిన్

 చోట్నీరు శ్రీరామమూర్తిగారి పూరణ-

వరణీ యాత్మబల ప్రతాప కలనా వైవిధ్య సన్నద్ధతన్
పరులన్ జెండి పరాక్రమించు విజయున్ పార్శ్వంబునం జూచియే
కురు సైన్యంబులు వారె భీతి హృదయ క్షోభ ప్రదాత్యంత భీ
కరులన్ జూచిన శత్రు సింహములు వీకన్ తోక జాడించెడిన్

ఏనుగులను చూసి సింహాలు తోక జాడిస్తున్నాయి అనే అసంబద్ధతను
అత్యంత భీకరులన్ - అని మార్చటం వలన అర్థస్పూర్తి కలిగిస్తూ
చేసిన పూరణ ఇది.

మీరునూ రమణీయాత్మకంగా పూరించి పంపగలరు.

పవనశ్చ ధూతనవనీపవన:


పవనశ్చ ధూతనవనీపవన:




సాహితీమిత్రులారా!



వ్యపేత చతుష్టపాద ఆద్యంత 
యమకమును గురించి తెలుసుకుందాము-

దీనికి ఉదాహరణ మాఘశిశుపాలవధనుండి-

విహగా: కదంబ సురభావిహ గా:
కలయం త్యనుక్షణ మనేకలయమ్
భ్రమయన్నుపైతి ముహు రభ్రమయం
పవనశ్చ ధూతనవనీపవన:

(విహంగములు కడిమిపూల సువాసనలు
నిండిన యీ పర్వతమునందు ప్రతి క్షణం
బహులయాత్మకములయిన కూజితములను
చేయుచున్నవి. కడిమితోటలను కదలించిన
పవనము మేఘమును భ్రమింపచేయుచున్నది.)

విహగా: కదంబ సురభావిహ గా:
కలయం త్యనుక్షణ మనేకలయమ్
భ్రమయన్నుపైతి ముహు రభ్రమయం
పవనశ్చ ధూతనవనీపవన:

దీనిలో మొదటిపాదము మొదటిలో విహగా: - చివరలో విహగా:
రెంవపాదం మొదటిలో కలయం - చివరలో కలయం
మూడవపాదం మొదటిలో భ్రమయం - చివరలో భ్రమయం
నాలుగవపాదం మొదటిలో పవన: - చివరలో పవన:
అని రావడం వలన
ఆది అంత్య యమకం అగుచున్నది
మరియు ఒక అక్షరగుచ్ఛానికి మరో అక్షరగుచ్ఛానికి మధ్య
అంతరమూ ఎక్కువగా ఉండటంవలన వ్యపేతమగుచున్నది.
కావున ఇది ప్యపేత చతుష్టపాద ఆద్యంత యమకమునకు
ఉదాహరణ అగుచున్నది.

Monday, November 21, 2016

నన్దామి మేఘాన్ గగనేऽవలోక్య


నన్దామి మేఘాన్ గగనేవలోక్య


సాహితీమిత్రులారా !





ఈ ప్రహేలికను చూడండి-

నన్దామి మేఘాన్ గగనేవలోక్య
నృత్యామి గాయామి భవామి తుష్ట:
నాహం కృషిజ్ఞ పధికోపినాహం
వదంతు విజ్ఞా మమ నామధేయమ్

ఆకాశంలో మేఘాలను చూస్తే 
నా మనసు వికసిస్తుంది. 
నాట్యమాడతాను, పాటలుపాడతాను,
ఆనందం కలుగుతుంది.
నేను కృషీవలునికాను
పధికునికాను.
మీకు నాపేరు తెలిస్తే చెప్పండి

రైతు ఆకాశంలో మేఘాలను చూస్తే ఆనందిస్తాడు
ఆడతాడు పాడతాడు.
ఎండతాపానికి అలసిపోయిన ప్రయాణికుడు
మేఘాలను చూచి ఆనందంతో గంతులేస్తాడు
పాటలుపాడతాడు
ఈ శ్లోకం రైతుకాదు ప్రయాణికుడు కాదంటోంది.

దీన్ని బాగా ఆలోచిస్తే
ఈ లక్షణాలు మయూరానికి అంటే 
నెమలికి సరిపోతాయి
 కావున దానిపేరు - నెమలి(మయూరము)


ఘనగిరీంద్ర విలంఘన శాలినా


ఘనగిరీంద్ర విలంఘన శాలినా




సాహితీమిత్రులారా!


వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య
యమకమును గురించి తెలుసుకుందాము-

దీనికి ఉదాహరణ
భట్టి కృత రావణవధ కావ్యంనుండి-

ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ

(పద్మముల కాంతివంటి కాంతిగల లోచనములు గలది,
వనమునందున్నదియు, జనముల గౌరవమునకు ఆశ్రయైనదియు,
వృక్షచ్ఛాయయందు పరుండియున్నదియు అయిన జానకిని మహాపర్వతలంఘన స్వభావముగల శాఖామృగమైన హనుంతుడు దర్శించెను.)


ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ

దీనిలో మొదటిపాదం మొదట ఘన - మధ్యలో  లంఘన
రెండవపాదం మొదట వన - మధ్యలో వన
మూడవపాదం మొదట జన - మధ్యలో జనకా
నాలుగవపాదం మొదట తరు - మధ్యలో తరుస్థల
రావడం జరిగింది.

పాదమునకు మొదట మరియు మధ్య ఒకేవిధమైన
అక్షరగుచ్ఛము నాలుగుపాదములందు ప్రయుక్తమైనది.
అదియు ఒకదానికి మరొకదానికి అంతరము ఉన్నందున
ఇది వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య యమకము అగుచున్నది.

Sunday, November 20, 2016

హృదయము చీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు


హృదయము చీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు




సాహితీమిత్రులారా!



సమస్య-
హృదయము చీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

ఎవరి హృదయము చీల్చితే
బంగారు రత్నాలు వస్తాయి
హృదయాన్ని చీలిస్తా రత్నాలు,
బంగారం కనబడతాయా
ఇది సాధ్యం కాదుకదా

పూరణ-
చోట్నీరు శ్రీరామమూర్తిగారు-

విదిత కృషీవలత్వమున బీళ్ళను దున్నియు పైడి పంటలున్
బొదలగ జేయు కర్షకులె భూషణమౌ ధర రత్నగర్భ నా
విదిత యశంబు గాంచి వసువృద్ధిని కూర్చును తద్వసుంధరా
హృదయము చీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్

పుడమిపైన బీళ్ళు దున్ని బంగారపు
పంటలను పండిస్తారు కృషీవలులు.
రత్నగర్భ అయిన భూమిలోనుంచి
పండిందంతా
బంగారమే రత్నరాసులే

హృదయము జీల్ప అనేది
వసుంధరా హృదయము జీల్ప అనడంతో
సమస్య హృద్యంగా మారినది.


ఆసక్తిగల మీరు రసరమ్యంగా పూరించి పంపగలరు.

ఉచ్చిష్టం శివనిర్మాల్యం


ఉచ్చిష్టం శివనిర్మాల్యం




సాహితీమిత్రులారా!



ఈ ప్రహేళికను చూడండి-

ఉచ్చిష్టం శివనిర్మాల్యం వమనం శవకర్పటమ్
కాకనిష్ఠానముత్పన్న: పంచైతే2తిప విత్రకా:


దీని అర్థం-
ఎంగిలి శివనిర్మాల్యం, వాంతి పీనుగుబట్టు,
కాకిరెట్టలో పుట్టినది - ఈ ఐదు అతి పవిత్రములు.

ఏమిటి ఎంగిలి, శివనిర్మాల్యం, వాంతి,
పీనుగుబట్ట, కాకిరెట్టలో పుట్టింది ఇవి ఎట్లా పవిత్రాలు.
అంటే -

ఉచ్చిష్టమ్ -
లేగ ఎంగిలి కలిగిన పాలు,

శివనిర్మాల్యం -
శివుని జడలలోనుండి ప్రవహించే గంగ,

వమనమ్ -
తేనెటీగల వాంతి రూపమైనది - తేనె,

శవకర్పటమ్ -
పట్టుబట్ట - పట్టుపురుగులనుండి తయారయే బట్ట,

కాకనిష్ఠాసముత్పన్న: -
రావిచెట్టు (కాకిరెట్టలోనుంచి వచ్చిన
గింజలు మొలచి చెట్టుగా తయారవుతాయి.)

ఇవి పవిత్రమైనవే కదా!

Saturday, November 19, 2016

పాలే కారణమౌచు దుస్థితికి శాపాలట్లు పీడించెడిన్



పాలే కారణమౌచు దుస్థితికి శాపాలట్లు పీడించెడిన్




సాహితీమిత్రులారా!



సమస్య-
పాలే కారణమౌచు దుస్థితికి శాపాలట్లు పీడించెడిన్

 చోట్నీరు శ్రీరామమూర్తిగారి పూరణ-

వాలాయంబు కురుక్షితీశు డలుకన్ బాధించి కౌంతేయులన్
గూలెన్ దాను సబాంధవంబుగ రణ క్షోణిన్ దలంపంగ దు
శ్శీలత్వంబున రెచ్చు వారి యెదలన్ సిద్ధంబుగా నిల్చు కో
పాలే కారణమౌచు దుస్థితికి శాపాలట్లు పీడించెడిన్


ఇందులో కవి  పాలుకాదు
కోపాలే శాపాలయ్యాయి
అని శబ్దానుసంధాన
చాతుర్యం చూపించాడు.
దీనివల్ల  సమస్య రమణీయంగా పూరించాడు.


ఆసక్తిగల మీరునూ మరోరకంగా పూరించి పంపండి.

మోమారామమమాదంద్వే


మోమారామమమాదంద్వే




సాహితీమిత్రులారా!


ప్రహేళికలు చాలా రకాలున్నాయికదా!
వాటిలో ఇప్పటికి కొన్నింటిని చూచాము.
ఇప్పుడు మరోరకం -

మోమారామమమాదంద్వే
హయాగదలనంభష:
యస్యైతాని నవిద్యంతే 
స యాతి పరమాంగతిమ్

ఇందులోని భావం-

మోమారామమమాదంద్వే, హయాగదలనంభషలు
ఎవనికిలేవో వాడే పుణ్యలోకమును పొందును.
మోమారామమమాదంద్వే, హయాగదలనంభష లు
అంటే ఏమిటి ఇవి శ్లోక పూర్వార్థంలోనివి-
వాటిని ఈ క్రిందివిధంగా తీసుకుంటే
విషయం అర్థం అవుతుంది చూడండి-

మో మా రా మ మ మా దం ద్వే
హ యా  గ   ద  ల నం  భ    ష: 
- వీటిని నిలువుగా తీసుకుంటే

మోహము, మాయ, రాగము, మదము
మలము, మానము, దంభము,
ద్వేషము అనే పదాలు వస్తాయి.

ఇవి లేనివాడు పుణ్యలోకమును పొందును అని భావం.

Friday, November 18, 2016

కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్


కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్




సాహితీమిత్రులారా!




సమస్య-
కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్


కోడి గూటిలో కాకులు గుడ్లగూబలు కూడ ఉన్నాయట-
ఎలా సాధ్యం

కొప్పరపు సోదరుల పూరణ-

ఒక్కడగు బోయ పక్షుల
నక్కజముగ నెన్నొ జాతులన దగు వానిన్
కక్కురితి తెచ్చి యొక్కట
కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్


కుక్కుట గృహము అంటే
కోడి ఉండే ఇంటిలో కాకఘూకము లుండెన్
కాకులు, గుడ్లగూబలు ఉన్నాయి
అనే అసందర్భమైన దాన్ని
బొయవాడు రకరకాల పక్షులను తెచ్చి
ఒక్కచోట కుక్కడం చేత
అంటే బలవంతంగా కుక్కి ఉంచడం చేత
ఇంట్లో అన్ని చేరినవి-
అని అర్థం సరిపోతుంది.
ఇది వారి నైపుణ్యానికి మంచి నిదర్శన.


ఆసక్తిగల మీరునూ మరోరకంగా పూరించి పంపగలరు.

ఏకరూపేణ వాక్యేన


ఏకరూపేణ వాక్యేన 




సాహితీమిత్రులారా!



ఏకరూపమైన వాక్యముచేత 
రెండర్థములను తంత్రముతో 
చెప్పటాన్ని శబ్దజ్ఞులు శ్లేష అని పిలుస్తున్నారు.

ఈ శబ్దశ్లేష 6 విధములు అవి-

1. ప్రకృతిశ్లేష
2. ప్రత్యయశ్లేష
3. విభక్తిశ్లేష
4. వచనశ్లేష
5. పదశ్లేష
6. భాషాశ్లేష

ప్రకృతి శ్లేష-

ప్రకృతిని ఆశ్రయించుకొని రెండర్థములు 
కలిగిన యెడల ప్రకృతి శ్లేష అనబడుతున్నది. 
దీని ఉదాహరణ-

ఆత్మవశ్చ పరేషాం చ ప్రతాపస్తవ కీర్తినుత్
భయకృద్భూపతే బాహుర్ద్విషాం చ సుహుదాం చతే
                                                          (సరస్వతీకంఠాభరణమ్ - 2- 152)

ఓ రాజా!  
నీయొక్క ప్రతాపము నీయొక్కయు 
శత్రువులయొక్కయు కీర్తినుత్తు. 
నీ బాహువు శత్రువులకును 
మిత్రులకును భయకృత్తు- 
అని భావం

దీనిలో కీర్తినుత్తు అనే చోట నౌతి, 
నుదతి అను ధాతువులకును
భయకృత్తు అనేచోట కరోతి, కృన్తతి అను 
ధాతువులకు క్విప్ పరమగునపుడు రూపతుల్యే 
కావున ఇది ప్రకృతిశ్లేష.

దీనిలో కీర్తినుత్ అనేది తనకును శత్రువులకు 
సమానంగా ఒకటే ఉపయుక్తమైనది.

తన విషయంలో కీర్తినౌతు అనగా
కీర్తిని ప్రశంసించునది అనే భావం
పరులవిషయంలో కీర్తి నుదతి అనగా 
పరులకీర్తిని చెడగొట్టునని భావం

Thursday, November 17, 2016

చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని


చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని




సాహితీమిత్రులారా!


తమిళనాడులోని తిరిచినాపల్లిజిల్లా,
నవసాలపురమనే పుదుకోట(క్రొత్తకోట)
రాజైన శ్రీరాయ రఘునాథ తొండమాన్
మహీపాలుడు పూరించిన సమస్యలలోని

ఒక సమస్య ఇది-

చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని

పూరణ-

బలునిడివి యైన దాసరి పామొకండు
చెట్టు మీఁదను గొమ్మను జుట్టుకుండి
దెలియకను గూఁటిపిల్లలఁ గలయ ముక్కు
చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని


కొంగ ఒక చేపను తన ముక్కుతో ఎత్తుకొని ఒక వృక్షము మీద
కట్టుకొన్న తన గూటిలోని పిల్లకు చేపను పెట్టడానికి వెళ్ళింది.
ఆ చెట్టు కొమ్మను చుట్టుకొని ఉన్న పాము ఆ చేపను ముక్కుతో
పట్టుకొన్న కొంగను మ్రింగెను.


ముక్కునందుఁజేఁపగలకొంగ -
ముక్కుచేఁపకొంగ అని పూరించడంతో
పూరణ చమత్కారంగా మారింది.



ఆసక్తిగల మీరునూ పూరించి పంపండి.

పిపాసిత: కిం ద్వికరేణ పీతే?


పిపాసిత: కిం ద్వికరేణ పీతే?




సాహితీమిత్రులారా!



బిల్హణుడు ఆయన భార్య మాట్లాడుకున్న
శ్లోకాలు ఎంత చమత్కారంగా ఉన్నాయో చూడండి-
ఇది సంవాదచిత్రంగా చెప్పవచ్చు-

రాత్రి మొదటిజాములోనే సురత క్రీడకు
బిల్హణుడు తొందరపడుతున్నాడు.
అప్పుడు
ఆమె ప్రియునితో-

జాగర్తిలోకో - జ్వలతిప్రదీప:
సఖీజనో ద్వీక్షతి కౌతుకేన
ముహూర్తమాత్రం కురుకాంత ధైర్యం
ఋభుక్షిత: కిం ద్వికరేణ భుంక్తే?

(అందరు మెలకువగా ఉన్నారు.
పెద్ద దీపాలు వెలుగుతున్నాయి.
సఖురాండ్రు మనలను గమనిస్తున్నారు.
ఓ మనోహరా ముహూర్తకాలం ధైర్యమవలంబించు
ఎంత ఆకలి వేసినా రెండు చేతులతో తింటారా)

దానికి బిల్హణుని సమాధానం-

జాగర్తిలోకో - జ్వలతిప్రదీప:
సఖీజనో ద్వీక్షతి కౌతుకేన
ముహూర్తమాత్రం కురుకాంత ధైర్యం
పిపాసిత: కిం ద్వికరేణ పీతే?

(అందరూ మెలకువతో ఉండిన ఉండనీ
పెద్దదీపాలు వెలిగితే వెలగనీ
నీచెలికత్తెలు ఉత్సాహంగా చూస్తుంటే చూడనీ
నేనింక ముహూర్తకాలం దైర్యంవహించలేను
దప్పికగొన్నవాడు రెండు చేతులతో త్రాగడా)

Wednesday, November 16, 2016

తండ్రీ రమ్మని ప్రాణనాథు పిలిచెన్


తండ్రీ రమ్మని ప్రాణనాథు పిలిచెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
తండ్రీ! రమ్మని ప్రాణనాథు బిలిచెన్ దన్వంగి మోహాంధయై


గాడేపల్లి వీర రాఘవశాస్త్రిగారి పూరణ-

మన్మథ బాధతో తపిస్తూన్న కాంత
- ప్రాణనాథుడు కోర్కె తీర్చటానికి రాకపోతే,
తానే పూనుకొని పైబడి ప్రాణనాథుని తీవ్రంగా
పిలుస్తున్న పద్ధతిలో పూరించారు చూడండి-

ఉండ్రానట్టి మనోజ తాపమున ధైర్యోచ్ఛేదమై ప్రేమమున్
గుండ్రాయట్టు లొనర్చి ప్రక్కబడి కోర్కుల్ దీర్చ రానట్టి కో
దండ్రామాభుడు నాథుపై గవసి త్రాతా! రార! బేతాళు పె
త్తండ్రీ! రమ్మని ప్రాణనాథు పిలిచెన్ తన్వంగి మోహాంధయై



మీరునూ మరోరకంగా పూరించి పంపండి.

కలవాడె కలవాడు


కలవాడె కలవాడు



సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని ఈ పద్యం చూడండి-

నిజముగ వాకొనగా న
క్కజముగ గలవాడె కలవాడు కాని యన్యుడున్
అజుడును నభవుండును కా
యజుడైనను లేని వాడే యనుమా యార్యా!


కలవాడు - ఉన్నవాడు, స్థతిమంతుడు.
వాకొనగా - చెప్పగా, వకారం తీసికొనగా.

కలవాడు అనే పదంలో వ-కారాన్ని తీసివేస్తే కలడు.
కలడు అనే సామాన్యార్థం మిగులుతుంది.
కాని వ్యతిరేకార్థంగాని మరొకటిగాని మిగలదు.
ఇది ఇందులోని చమత్కారం

ఇక లక్ష్మిలేనివారిలో అజుడు అభవుడు,
కాయజుడు అనే వారిని పరిశీలించిన
అజుడన్నా, అభవుడన్నా  పుట్టనివాడు
అనే అర్థం. పుట్టినాడు ప్రపంచంలో
ఎలాగూ ఉండనే ఉండరు.

శ్రీ శబ్దానికి లక్ష్మి అనేకాక సరస్వతి,
పార్వతి అనే అర్థాలు కూడా ఉన్నాయి.
కాబట్టి వారులేనపుడు అవాక్కై - బ్రహ్మ,
అర్థశరీరుడై శివుడు
ఉన్నా లేనివారే అవుతారు.

ఇక మన్మథుడో ఎపుడో సశరీరంగా ఉన్నా
శివుని కంటి మంటకు భస్మమై యిపుడెలాగూ
అనంగుడైనాడు.
కాబట్టి లక్ష్మీకటాక్షం లేనపుడు
ఇక్కడ ఉదాహరణగా చెప్పబడిన
బ్రహ్మవంటి సృష్టకర్త, శివునివంటి సర్వజ్ఞుడు,
మన్మథునివంటి రూపవంతుడు
కూడ లేనివారికిందికే లెక్క - అని పద్య తాత్పర్యం.

Tuesday, November 15, 2016

గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్


గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్



సాహితీమిత్రులారా!


సమస్య -
గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్
ఇది భారతంలోని ఒక పద్యపాదం.

మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతు లతి క్షణికంబులు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్

ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వగా దాన్ని
వసంతరావు రామకృష్ణారావుగారు ఇలాపూరించారు

అతి వేగాకుల మగు జీ
వితమున పరిణామ మెపుడు వృద్ధుని చెందున్
క్షితిపై మనుజుల కెప్పుడు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ 

జీవితం అతి వేగం వల్ల కల్లోలితమవుతున్నది.
పరిణామం వృద్ధి చెందుతున్నది.
ఎప్పుడైనా జరిగిన రోజులే మంచి మనిపిస్తున్నవి.
వచ్చే రోజువు ఎలా ఉంటాయో ఏమో
- అనే భావాన్నిచ్చేదిగా పూరించారు.



మీరు మరోవిధంగా పూరించి పంపండి.

ప్రకృతి త్రయస్వరూపిణి


ప్రకృతి త్రయస్వరూపిణి




సాహితీమిత్రులారా!

ఆర్యా శతకంలోని
శబ్దచిత్రం చూడండి-

ప్రకృతి త్రయస్వరూపిణి
సకియ యనం బురుషుడెట్టి జనుడైననుదా
రకళత్రము భార్యగ యో
పికచే దగినట్లు నడుచు వినుమా యార్యా!


ప్రకృతి త్రయస్వరూపిణి - మూడువిధాలైన
ప్రకృతులు అనగా సాత్విక రాజస తామసాలు మూడు గలది.

దార-కళత్రం- భార్య అనే మూడు విధాలైన
పుం, నపుంసక, స్త్రీలింగాలు మూడు గలది.

ఇందులోని శబ్దచమత్కారం-

స్త్రీ మూడు విధాలైన ప్రకృతులు కలది.
కాబట్టి తన భర్త త్రిగుణాలలో ఎలాంటి గుణం
గలవాడైనా అతనికి తగినట్లు నడచుకోగలదు.

దారా అనే శబ్దం పుంలింగం-
పురుషుని భయపెట్టునది, భయపడునది అని వీని అర్థం.
పురుషుడు అపమార్గంలో ఉంటే వాణ్ని భయపెట్టి దారికి
తెచ్చుకుంటుంది. లేదా అనుకూలుడా తానే అతనికి
భయపడుతుంది.

కళత్రం - నపుంసకలింగం.
పురుషుని కళంకంనుండి రక్షించేది.
అతని కళలు కాపాడేది అని అర్థం.
ఇల్లాలు మంచిదైనపుడు తన భర్తకు
ఏమచ్చారాకుండా కాపాడుతుంది.

భార్యా అంటే భరింపబడేది అని అర్థం.
సంసారంలో ఆమె పురుషునిచే భరింపబడుతుంది.
అతడు పెట్టే కష్టాలనన్నిటిని భరిస్తుంది.
ఈ విధంగా ప్రకృతి మూడురకాలు.

Monday, November 14, 2016

జవరాలు వరాలు రాలు


జవరాలు వరాలు రాలు



సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని ఒక చిత్రం చూడండి-


జవరాలి యందునుంగల
వివరాలు వరాలురాలు విరసంబైనన్
తవులుసుమి రాలు చెలువుడు
మివుల రసికుడైన గాక వినుమా యార్యా!


దీనిలో జవరాలు అనే పదంనుండి జ తీసివేస్తే వరాలు,
వరాలు పదంనుండి వ తీసివేస్తే రాలు అవుతాయి.
అంటే జవరాలు లో వరాలు, రాలు రెండూ ఉన్నాయి.
ఆమె చెలువుడు అనుకూలుడైతే అతనికి వరాలు లభిస్తాయి.
అలా కాకుండా దుష్టుడాయెనా రాలు మాత్రం తగులక తప్పవు.

జవరాలు, వరాలు, రాలు -  మొదటి అక్షరం తీసివేస్తే 
ఒకదానినుండి మరొకటి వస్తున్నాయికదా అందువల్ల 
ఇది చ్యుత చిత్రమౌతుంది.

రామ శ్చుంబతి రావణస్య వదనం


రామ శ్చుంబతి రావణస్య వదనం




సాహితీమిత్రులారా!


స్రశ్నలు విపరీతంగా ఉండేది విషమ ప్రహేళిక.
దీన్నే సమస్య అని కూడ అంటారు.
ఇది యథాసంఖ్యంగా పూరింపబడుతుంది.

సమస్య -
రామ శ్చుంబతి రావణస్య వదనం సీతావియోగాతుర:
                                                                     (సంస్కృతం)
(రాముడు సీతావిరహార్తుడై రావణుని మోము ముద్దిడుకొనెను)

క: కాంతార మగాత్ పితు ర్వచనత: సంశ్లిష్య కంఠస్థలీం
కామీ కిం కురుతే చ గృధ్రనఖత శ్చిన్నం ప్రరూఢంచ కిమ్
కా రక్ష: కులకాలరాత్రి రభవత్ చంద్రాతపం ద్వే క:
రామ శ్చుంబతి రావణస్య వదనం సీతావియోగాతుర:

దీనిలో మూడుపాదాలలో ప్రశ్నలు
నాలుగవపాదంలో సమాధానాలు ఉన్నాయి.

క: పితు వచనత: కాంతారమ్ అగాత్ ?- 
(తండ్రిమాటవలన అడవికి వెళ్ళినవాడెవరు?)
- రామ: (రాముడు)

కామీ కంఠస్థలీం సంశ్లష్య కిం కురుతే?
(కాముకుడు ప్రేయసీ కంఠమును కౌగిలించి ఏమిచేయును?)
- చుంబతి (ముద్దిడుకొనును)

గృధ్రనఖత: ఛిన్నం ప్రరూఢం కిమ్?
(జటాయువు గోళ్లవలన తెగి తిరిగి మొలచినదేది?)
- రావణస్య వదనమ్(రావణుని తల)

కా రక్ష: కులకాలరాత్రి: అభవత్?
(రాక్షస వంశమునకు కాలరాత్రియైనదెవరు?)
- సీతా
క: చంద్రాతపం ద్వేష్టి?
(వెన్నెలను ద్వేషించు వాడెవడు?)
- వియోగాతుర: (విరహార్తుడు)

Sunday, November 13, 2016

కాకాననదేదేవివిసాసాహహభూభూ


కాకాననదేదేవివిసాసాహహభూభూ




సాహితీమిత్రులారా!




ఒక పద్యంలో గాని శ్లోకంలో గాని వచ్చిన
అక్షరమే మళ్ళీ మళ్ళీ ఆవృతమైతే దాన్ని
(అక్షరావళి) ఆవళిచిత్రం అంటారు.
దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూడండి-

కాకాననదేదేవివిసాసాహహభూభూ
రారాదదరా రామమనానామమ హేహే
యాయా మమ ఖేఖేదదనానాఘఘనానా
త్వంత్వంగగదాదావవనీనీతతమామా

కాక - కాకాసురునికి, అననదే- రక్షణనిచ్చినదానా,
భూభూ: - భూమినుండి పుట్టినదానా,
నామమహేహే- నామ నమస్కారమందు,
మహా - గొప్పనైన, ఈ హే - అభిలాషగలదానా,
అంగ దేవి - ఓ సీతాదేవీ, నిపాపా - నిర్దోషురాలవు,
అదరా - భయములేనిదానవు,
రామ మనా: - రాముని యందే మనస్సుగలదానావు,
ఖే - అంత:కరణమందు, ఖేదద - దు:ఖముకలిగించు,
నానా అఘ - పలుపాపములచే,
ఘన - దుర్భరులైనవారిని, అనా - రక్షించుదానవు,
గద అదౌ - రోగాలయందు, అవనీ - జనులగాపాడుదానవు,
నీత - తొలగించబడిన, తమా - తమోగుణముగలదానవై,
త్వంతు - నీవు మాత్రం, మమ ఆరాత్ - నాకుదూరంగా,
మాయాయా: - వెళ్ళకుమా.

నస్యము వాడు వాని వదనంబున నిండె సుగంధ వీచికల్


నస్యము వాడు వాని వదనంబున నిండె సుగంధ వీచికల్




సాహితీమిత్రులారా!


సమస్య-
నస్యము వాడు వాని వదనంబున నిండె సుగంధ వీచికల్

ఉత్పల సత్యనారాయణాచార్యగారి పూరణ-

హాస్య మదేమొ కాక జననాంతర వాసనయేమొ చంద్రబిం
బాస్య వయస్కులన్ వదలి యా దశమీ స్థుజేరె వాని స్వా
రస్య మదేమి హా తెలిసెరా అతడెప్పుడు మంచి అత్తరున్
నస్యము వాడు వాని వదనంబున నిండె సుగంధ వీచికల్

మంచి అత్తరు వాసన గుబాళించే నస్యం 
ఉపయోగించటం వల్ల చంద్రముఖికి అతడు నచ్చాడట. 



ఆసక్తిగల మీరూ పూరణ 
మరోరకంగా చేసి పంపండి.

Saturday, November 12, 2016

తనసుతు గూడి గర్భమును దాల్చెను


తనసుతు గూడి గర్భమును దాల్చెను



సాహితీమిత్రులారా!


సమస్య-
తనసుతు గూడి గర్భమును దాల్చెను కోమలి యేమి చెప్పుదున్


డా. మారుటూరి పాండురంగారావుగారి పూరణ-

తన సుత యంచు నైన దయదాల్పడు దానవ వంశ గౌరవ
మ్మునకును భంగమైన యెడ - మూర్ఖుడు ప్రేమ నెరుంగ బోడు బా
ణుని కడ నేమి ప్రాప్త మగునో కద యెట్లు వచింతు మీన కే
తనుసుతు గూడి గర్భమును దాల్చెను కోమలి యేమి చెప్పుదున్

బాణసుత - ఉష - మీనకే తన సుతుడు -
(ప్రద్యుమ్న పుత్రుడు)- అనిరిద్ధుని
కూడి గర్భము దాల్చింది - అని రమణీయమైన పూరణ.

తనసుతు - మీనకేతనసుతు గా
రూపొందడం వలన రమణీయత సంతరించుకుంది.


ఆసక్తిగల మీరూ మరోవిధంగా పూరించి పంపగలరు.

రజతోత్సవామోద విశేషమత్తయా


రజతోత్సవామోద విశేషమత్తయా




సాహితీమిత్రులారా!



వ్యపేతయమకంలోని
చతుష్టయపాద అంత యమకం
గురించి చూద్దాం-

నాలుగు పాదాలలో పాదాంతములందు
ఎడమ ఎడమగా ఒకేపదగుచ్ఛము వచ్చిన
అలాంటి దాన్ని
వ్యపేతచతుష్టపాదాంతయమకం అంటాము.
దానికి ఉదాహరణ-

తవ ప్రియా సచ్చరితాప్రమత్త యా
విభూషణం ధార్యమిహాంశుమత్తయా
రజతోత్సవామోద విశేషమ త్తయా
ప్రయోజనం నాస్తి హి కాన్తిమత్తయా
                                                                          (కావ్యాదర్శం -3-41)

(ఒక ఖండితనాయిక తనను
అనుయించడానికి వచ్చిన
నాయకునితో
పలికిన మాటలు ఇవి-
ఓయీ అప్రమత్తుడా!  నీ ప్రియురాలు
సౌశీల్యవంతురాలు.
రజతోత్సవ సంతోషవిశేషములచేత మదించిన
ఆమె చంద్రకాంత మణిభూషణమును ధరించవలెను.
నేను కాంతిని పొంది ఉండుటవల్ల
నాకేవీ ధరించవలసిన పనిలేదు.
కావున మణిభూషణములతో పనిలేదు)


తవ ప్రియా సచ్చరితాప్రమత్త యా
విభూషణం ధార్యమిహాంశుమత్తయా
రజతోత్సవామోద విశేషమ త్తయా
ప్రయోజనం నాస్తి హి కాన్తిమత్తయా

దీనిలో ప్రతిపాదాంతము నందు
మత్తయా అనే పదగుచ్ఛము కలదు
మరియు మొదటి దానికి, రెండవదానికి,
మూడవదానికి, నాలుగవదానికి
మధ్యదూరము చాలకలదు కావున
ఇది వ్యపేత చతుష్టయపాదాంత
యమకమునకు ఉదాహరణ అగుచున్నది.