Sunday, January 8, 2017

భాగవతములోని సర్వలఘుచిత్రం - 1


భాగవతములోని సర్వలఘుచిత్రం - 1




సాహితీమిత్రులారా!


ఒక పద్యంలోగాని ఒక శ్లోకంగాని
అన్నీ లఘువులతో కూర్చితే దాన్ని
సర్వలఘువుగా పిలుస్తారు. ఇలాంటివి
భాగవతంలో ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో
ఇక్కడ చూద్దాం.
శ్రీమదాంధ్రమహాభాగవతములో
సర్వలఘుచిత్రం
ప్రధానంగా కొన్ని చోట్ల కనిపిస్తుంది.
వాటిలో
మొదటిది -
అష్టమస్కందంలో క్షీరసాగరమథనం వర్ణిస్తున్న
కందపద్యాలు ఇవి పోతనచే కూర్చబడ్డాయి -


పరీక్షిత్తు ప్రశ్నకు సంతోషించిన శుకుడు పరీక్షిత్తుతో
ఈ విధంగా చెప్పాడని సూతుడు శౌనకాదిమునులతో
ఈవిధంగా చెప్పాడు-

కసి మసఁగి యసుర విసరము
లసి లతికల సురలనెగువ నసువులు వెడలం
బసఁ జెడిరి పడిరి కెడసిరి
యసమ సమర విలనముల నను వెడలి నృపా!
                                                                    (భాగవతము - 8-146)

ఓ రాజా! రాక్షసులు ఆయుధాలు ధరించి విజృంభించి
దేవతలను మించిపోయి సాటిలేని పోరాయాలను చేశారు.
దేవతలు బలం తగ్గి ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేత పట్టుకొని
శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లి పోయారు.

సముద్రం నడుమ మందర పర్వతానికి వాసుకిని
చుట్టి తోకను దేవతలు పడగలను రాక్షసులు
పట్టుకొని చిలుకుతున్నారు

విడు విడుఁడని ఫణి పలుకఁగఁ
గడుభరమున మొదలఁగుదురు గలుగమిఁ వెడఁగై
బుడబుడ రవమున నఖిలము
వడ వడ వడకఁగఁ  మహాద్రి వనధి మునింగెన్
                                                                 (భాగవతము - 8 - 199)

ఈ పద్యంలో మహాద్రి వనధి మునింగెన్ - అనే చోటుల
రెండు గురువు వచ్చాయి.
ఆ సమయంలో వాసుకు వదలండి వదలండి అన్నాడు
కొండ అడుగున కుదురు లేనందువల్ల ఆ పర్వతం
మిక్కిలి బరువై  సముద్రములో బుడబుడమని మునిగింది.
దేవరాక్షస సమూహం గడగడ వణికింది - అని భావం

ఎడమఁ గుడి మునుపు దిరుగుచుఁ
గుడి నెడమను వెనుక దిరుగు కుగిరి కడలిన్
గడవెడల సురలు నసురులుఁ
దొడితొడి ఫనిఫణము మొదలు తుదియును దిగువన్

ఆసముద్రంలో మందరపర్వతం మొదట ఎడమవైపునుండి
కుడివైపుకు తిరుగుతూ, తరువాత కుడినుండి ఎడమకు తిరిగేది.
అప్పుడు దేవతలూ, రాక్షసులూ ఉండే చోట్లు మారిపొయేవి.
వారు తొందర తొందరగా పాము తోక తల పట్టుకొని చిలికేవారు

వడిగొని కులగిరి దరువగ
జడనిధికగమకరమఠఝష ఫణిగణముల్
సుడివడు దడబడ గెలకుల
బడు భయపడి నెగసి బయలబడు నురలిపడున్
                                                                       (భాగవతము - 8- 211, 212)


ఆ సముద్రంలో ఉండే పక్షులూ తాబేళ్ళూ చేపలూ
సర్పాలు చీకాకు పడుతూ తొట్రుపడుతూ
పక్కలకు పడుతూ భయంతో ఎగిరి గట్టుపై బడుతూ
పొరలుతూ ఉన్నాయి.




No comments: