ఏకాక్షర నిఘంటువు - 34
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
అయ్ - పోవుట, లోనికి వచ్చుట
అర్థ్ - యాచించుట, కోరుట
అశ్ - వ్యాప్తమగుట, పూర్తిగా నిండుట, ప్రవేశించుట,
చేరుట, పొందుట, అనుభవించుట, తినుట,
రుచిచూచుట
అస్ - అగుట, ఉండుట, విసరుట, విడచుట, పోవుట,
తీసికొనుట, ప్రకాశించుట, పట్టుకొనుట
అర్ఘ్ - వెలకట్టుట
అర్చ్ - పూజించుట, గౌరవించుట
అర్ - సంపాదించుట, బాధించుట, పీడించుట,
యాచించుట, పోవుట.
ఆప్ - పొందుట, చేరుట, పోవుట, వ్యాపించుట,
కలిగించుట, ఆక్రమించుట.
ఆస్ - కూర్చుండుట, పరుండుట, విశ్రాంతిగైకొనుట,
నివసించుట, ఊరకుండుట, మరియు
ఈ సందర్భాలలో అస్ అని వాడతారు-
స్మరణము, క్రోధము, బాధ, దుఃఖము,త్రోసిపుచ్చుట.
ఇ - వెళ్ళుట, అధ్యయనముచేయుట
ఈక్ష్ - దర్శించుట
No comments:
Post a Comment