Tuesday, January 17, 2017

వాయుమిత్రసుతబంధువాహనా


వాయుమిత్రసుతబంధువాహనా




సాహితీమిత్రులారా!


ఒక అర్థాన్ని కనుక్కోడానికి శ్లోకములోని దాదాపు
అన్ని పాదాలను అర్థం తీసుకోవాల్సి వస్తే
అలాంటి దాన్ని ఏకార్థగూఢచిత్రం అంటారు.
దీనికి ఉదాహరణ ఈ శ్లోకం చూడండి-

వాయుమిత్రసుతబంధువాహనా
రాతిభూషణశిరోవలంబినీ
తజ్జవైరిభగినీపతేః సఖా
పాతు మాం కమలలోచనో హరిః

వాయుమిత్ర - అగ్నికి,
(అగ్నికి)సుత - కుమారుడైన కుమారస్వామికి,
(కుమారస్వామికి)బంధు - చుట్టమైన వినాయకునికి,
(వినాయకునికి) వాహన - వాహనమైన ఎలుకకు,
ఎలుకకు, అరాతి - శత్రువైన పాము,
భూషణ - అలంకారముగాగల శివుని యొక్క,
శిరోవలంబినీ- తలను ఆశ్రయించిన గంగ,
తజ్జ - గంగకు పుట్టిన భీష్మునికి, వైరి -శిఖండికి,
భగినీ - సోదరియగు ద్రౌపదికి, పతేః - భర్తయగు
అర్జునునికి,  సఖా - చెలికాడైన,
కమలలోచనః - పద్మములవంటి కనులుగల,
హరిః - కృష్ణరూపుడైన విష్ణువు,
మాంపాతు - నన్ను రక్షించుగాక!



No comments: