Friday, January 6, 2017

అమ్మా! నాకూజా తెమ్ము


అమ్మా! నాకూజా తెమ్ము




సాహితీమిత్రులారా!


లీలాశుకుని శ్రీకృష్ణామృతములోని
యశోదాకృష్ణుల సంవాదము చూడండి-

మాతః కిం యదునాథ దేహి చషకం కిం తేన పాతుం పయ
స్తన్నా స్త్యద్య కదాస్తి వా నిశి నిశా కావా2న్ధకారోదయః,
ఆమీ ల్యాక్షియుగం నిశా ప్యుపగతా దేహీతి మాతుర్ముహు
ర్వక్షోజాంశుకకర్షణోద్యతకరః కృష్ణ స్స పుష్ణాతు నః

కృష్ణుడు - హేమాతః!
                   (ఓ అమ్మా!)
యశోద - కిం యదునాథ?
                (ఓ యాదవులరాజా ఏమిరా?)
కృ- దేహి చషకం 
         (నాకూజాను తెమ్ము)
య- కిం తేన? 
         (దానితో ఏమి పని)
కృ - పాతుం పయః
        (పాలను త్రాగుటకు)
య - తత్ ఆద్య నాస్తి
          ((ఆ గిన్నె)ఆపాలు ఇప్పుడు లేవు)
కృ - కదా ఆస్తినా? 
         (ఎప్పుడు ఉంటాయి)
య - నిశి
         (రాత్రి యందు)
కృ - నిశా కా? 
         (రాత్రి అంటే ఏది)
య - అన్ధకారోదయః 
         (చీకటి పడుట)
అనగానే 
ఆమీల్యాక్షియుగం
(రెండు కన్నులు గట్టిగా మూసుకొని)
కృ - నిశాప్యుపగతా దేహీతి
     (రాత్రికూడ వచ్చింది పాలగిన్నె తెమ్ము)
అని 
మాతుః వక్షోజాంశుకకర్షణోద్యతకరః కృష్ణ స్స పుష్ణాతు నః!
తల్లి అయిన యశోద పైటకొంగును లాగుటకై చాచబడిన 
చేయిగల ఆ శ్రీకృష్ణడు మమ్ము రక్షించుగాక!

No comments: