ఏకాక్షర నిఘంటువు - 47
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
జౄ - వృద్ధుడగుట, శిధిలమగుట, శుష్కించుట,
నశించుట, జీర్ణమగుట
జ్వర్ - జ్వరము, ఆవేశములచే వేడెక్కుట,
జ్వరితుడగుట, రోగియగుట
జ్వల్ - ప్రకాశముతో మండుట, ప్రకాశించుట, తగులబడుట,
తగులబెట్టుట, ప్రజ్వలింపచేయుట, వెలిగించుట
జమ్ - పెండ్లాము(ఆలు), మొలనూలు మొదలైన అలంకారము,
తేజస్సు, నీరు, పుట్టువు
జః - పరుల సంపదకు ఓర్వలేనివాడు, జయించు
స్వభావముగల పురుషుడు
జ్ఞ - తెలిసినవాడు, బుద్ధిమంతుడు
జ్ఞః - బ్రహ్మ, పండితుడు, బుధగ్రహము
జ్ఞా - తెలిసికొను, పరిచయము, పొందు, పరిశీలించు, గుర్తించు,
పరీక్షించు, గౌరవించు, ప్రేరణార్థమున(తెలుపుట, కోరుట,
వెల్లడించుట, అడుగుట, తెలిసికొనగోరుట)
రుక్ - కాంతి, కిరణము, కోరిక
త్వక్ - చర్మము, నారపట్ట, లవంగపుచెట్టు
న్యఙ్ - నీచమైనది, పల్లమైనది, గుబిలి
ఝః - మదము, బృహస్పతి
ఞః - ఊర్థ్వముఖమైనది, మూఢస్వరూపమయినది,
భయము, కీర్తి
No comments:
Post a Comment