Monday, January 2, 2017

ఏకాక్షర నిఘంటువు - 29


ఏకాక్షర నిఘంటువు - 29




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........


షమ్/ షం - సస్యం, మధువు, ధారణ

సత్ - సత్యం, యజ్ఞం, సాధుభావం,
               విష్ణు ప్రీతికరమైన  కర్మ,
               సద్భావం, మంచి

- శివుడు, విష్ణువు, హంస, యుద్ధము, గగుర్పాటు,
           గుఱ్ఱము, గర్వము, వరుణుడు, పిలుపు(సంబోధనము),
           ప్రసిద్ధి, పాదపూరణము, పూజ, వికారము, నింద,
           చంపుట, ఆజ్ఞ, ప్రేరేపించుట, కోపము, ఏనుగు,
           దివసము, వైద్యుడు, పృథ్వీ బీజము, ప్రాణవాయువు.

హమ్ - అస్త్రము, సుఖము, పరబ్రహ్మ, బాణము, మణికాంతి,
                  పిలుచుట, లేచుట, నవ్వుట, వీణాది సకల వాద్యధ్వని,
                  ఆకాశబీజము.

హస్ - నవ్వుట

హా - మనోవ్యథ, వగపు, నింద, బాధ,
          పేడ, త్యాగము, నడుపు(గమనము), వీణ.


హి - ఆశ్చర్యము, వ్యధపడుట, పాదపూరణము, కారణము,
           సంతోషము, విచారము, పద్యావరణము, నిశ్చయము,
           అతిశయము, కారణవ్యాజము, తొట్రుపాటు, ఓర్వలేమి,
          సర్పము, మృగము


హిం - ప్రశ్న, ఊహ


హీ - ఆశ్చర్యము, పిలుచుట, దుఖఃము,
           వ్యాపారము,  వినయము.

హ్లీం - మృద్భీజము


హు - సంతోషము, కోపము, విచారము, నహుషుడు


No comments: