ఏకాక్షర నిఘంటువు - 54
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ద్యు - దినము, ఆకాశము, ప్రకాశము, స్వరము, అగ్ని
ద్యుత్ - ప్రకాశించు, వెలుగు
ద్యో - ఆకాశము, స్వర్గము
ద్వార్ - ద్వారము, వాకిలి, ఉపాయము
ద్విష్ - విరుద్ధమైన, ఇష్టపడని, శత్రుత్వముకల, శత్రువు
ఇష్టపడకుండుట, అసహ్యపడు
ద్విస్ - రెండు సార్లు
ద్రుహ్ - కీడుచేయు
ద్రా - నిద్రించు, పరుగెత్తు, త్వరపడు
ద్రాక్ - శీఘ్రముగా, వెంటనే
ద్రుహ్ - కీడుచేయు
ధా - పెట్టుట, ఉంచుట, నింపుట, వేయుట, నిలుపుట,
ప్రసరింపజేయుట, నిర్దేశించుట, ఇచ్చుట, పట్టుకొనుట,
కట్టుకొనుట, పొందుట, తీసికొనుట, ప్రదర్శించుట,
ఆధారమగుట, పుట్టించుట, కలుగజేయుట
ధావ్ - పరుగెత్తుట, ముందుకు సాగుట, ప్రవహించుట,
ఎగురుట, కడుగుట, శుభ్రముచేయుట,
మెఱయునట్లు చేయుట
ధి - సంతోష పెట్టుట, ఆనందింపచేయుట
ధీ - బుద్ధి, ఊహ, ఆశయము, ప్రయోజనము,
సహజప్రవృత్తి, భక్తి, ప్రార్థన, యజ్ఞము
No comments:
Post a Comment