Sunday, January 15, 2017

ఏకాక్షర నిఘంటువు - 42


ఏకాక్షర నిఘంటువు - 42




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


గంధ్ - గాయపరచుట, అడుగుట, కదలుట, పోవుట

గమ్ - పోవు, కదలు, వెడలు, కదలు, తొలగు, చేరు, దాటు

గర్ - అరచుట, గర్జించుట, బొబ్బలిడుట

గర్వ్ -  గర్వించు

గల్ - పడు, జారు, అదృశ్యమగు

గాధ్ - నిలచు, వెడలు, ప్రవేశించు, వెదకు,
               అడిగి తెలుసుకొను, పేను, నేయు

గాహ్ - (నీటి)లోనికి చొచ్చుట, స్నానముచేయుట,
                  ప్రవేశించుట, కలతనొందుట, చిలుకుట,
                   దాగుట, నాశముచేయుట

గిర్ - వాక్కు, భాష, సరస్వతి

గిల్ - మ్రింగు

గుజ్ - ధ్వనిచేయు, రొదచేయు

గుంఠ్ - చుట్టు మూయు, కప్పివేయు, దాచు

గుప్ - కాపాడు, రక్షించు, పర్యవేక్షించు,
                ప్రకాశించు, దాచు

గుహ్ - కప్పిపెట్టు, దాచు, రహస్యముగానుంచు


No comments: