Friday, January 13, 2017

మఱ్ఱాకున విడముసేయ మనసాయెగదా!


మఱ్ఱాకున విడముసేయ మనసాయెగదా!




సాహితీమిత్రులారా!



సమస్య -
మఱ్ఱాకున విడముసేయ మనసాయెగదా!

పూర్వకవి పూరణ -

కొఱ్ఱన్నము ఘృతసూపము
బఱ్ఱెల పెరుఁగూరగాయ పచ్చడితోడన్
బిఱ్ఱుగ భోంచేస్తిమయా
మఱ్ఱాకున; విడముసేయ మనసాయెగదా!

మఱ్ఱాకున విడము(తాంబూలము)సేయ మనసాయె
అనే అర్థం కాస్తా కవిగారు భోంచేస్తిమయా మఱ్ఱాకున
అనడంతో అర్థవంతంగా మారింది.


మీరునూ మరోవిధంగా సమస్యను పూరించి పంపగలరు

No comments: