Thursday, September 30, 2021

ఒకే అచ్చుతో కూర్చిన ఈవ్స్ లెజెన్డ్

ఒకే అచ్చుతో కూర్చిన ఈవ్స్ లెజెన్డ్




సాహితీమిత్రులారా!



ఆంగ్లంలో  Lord Holtand  లార్డ్  హోలటాన్డ్ 1824లో Eve's Legend ఈవ్స్ లెజెన్డ్ అనే శీర్షికతో  E అచ్చును మాత్రమే తీసుకొని గద్యరచన చేశారు

ఇక్కడ అది గమనించగలరు-

Men were never perfect; yet the three brethren Veres were ever esteemed, respected, revered, even when the rest, whether the select few, whether the mere herd, were left neglected.

The eldest’s vessels seek the deep, stem the element, get pence; the keen Peter, when free, wedded Hester Green,–the slender, stern, severe, erect Hester Green. The next, clever Ned, less dependent, wedded sweet Ellen Heber. Stephen, ere he met the gentle Eve, never felt tenderness; he kept kennels, bred steeds, rested where the deer fed, went where green trees, where fresh breezes greeted sleep. There he met the meek, the gentle Eve; she tended her sheep, she ever neglected self; she never heeded pelf, yet she heeded the shepherds even less. Nevertheless, her cheek reddened when she met Stephen; yet decent reserve, meek respect, tempered her speech, even when she shewed tenderness. Stephen felt the sweet effect: he felt he erred when he fled the sex, yet felt he defenceless when Eve seemed tender. She, he reflects, never deserved neglect; she never vented spleen; he esteems her gentleness, her endless deserts; he reverences her steps; he greets her:

‘Tell me whence these meek, these gentle sheep,–whence the yet meeker, the gentler shepherdess?’

‘Well bred, we were eke better fed, ere we went where reckless men seek fleeces. There we were fleeced. Need then rendered me shepherdess, need renders me sempstress. See me tend the sheep, see me sew the wretched shreds. Eve’s need preserves the steers, preserves the sheep; Eve’s needle mends her dresses, hems her sheets; Eve feeds the geese; Eve preserves the cheese.’

Her speech melted Stephen, yet he nevertheless esteems, reveres her. He bent the knee where her feet pressed the green; he blessed, he begged, he pressed her.

‘Sweet, sweet Eve, let me wed thee; be led where Hester Green, where Ellen Heber, where the brethren Vere dwell. Free cheer greets thee there; Ellen’s glees sweeten the refreshment; there severer Hester’s decent reserve checks heedless jests. Be led there, sweet Eve!”

“Never! we well remember the Seer. We went where he dwells — we entered the cell — we begged the decree,–

Where, whenever, when, ’twere well
Eve be wedded? Eld Seer, tell.

He rendered the decree; see here the sentence decreed!” Then she presented Stephen the Seer’s decree. The verses were these:

Ere the green reed be red,
Sweet Eve, be never wed;
Ere be green the red cheek,
Never wed thee, Eve meek.

The terms perplexed Stephen, yet he jeered the terms; he resented the senseless credence, ‘Seers never err.’ Then he repented, knelt, wheedled, wept. Eve sees Stephen kneel; she relents, yet frets when she remembers the Seer’s decree. Her dress redeems her. These were the events:

Her well-kempt tresses fell; sedges, reeds, bedecked them. The reeds fell, the edges met her cheeks; her cheeks bled. She presses the green sedge where her cheek bleeds. Red then bedewed the green reed, the green reed then speckled her red cheek. The red cheek seems green, the green reed seems red. These were e’en the terms the Eld Seer decreed Stephen Vere.

Here endeth the Legend.

ఇందులో కేవలం E అచ్చును మాత్రమే ఉపయోగించి వ్రాశారు. 

Tuesday, September 28, 2021

శ్లోక గర్భిత పద్యం

 శ్లోక గర్భిత పద్యం




సాహితీమిత్రులారా!



ఒక పద్యంలో ఒక శ్లోకం ఇమిడ్చి చెప్పబడినది

దీన్ని గర్భచిత్రం అంటాము.

ఇక్కడ గణపవరపు వేంకటకవి కృత

ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసములోని 822వ పద్యం

గమనిద్దాం-

చంపకమాల-

నరసఖ నారశాయి నరనాథ నతామర నారదస్తుతా

దరకర ధార దేహ ధరధారి ధరాధిప దారితా శరా

హరిబల హారి కంఠహర హారి హతాహిత హార హృద్ధి దా

స్థిర తర సీర పాణి శివ శీల జితా సుర సింధు బంధనా


దీనిలో ప్రతిపాదం మొదటి 8 అక్షరాలము తొలగించిన 

దానిలోని శ్లోకం బహిర్గత మౌతుంది.

నరసఖ నారశాయి నరనాథ నతామర నారదస్తుతా

దరకర ధార దేహ ధరధారి ధరాధిప దారితా శరా

హరిబల హారి కంఠహర హారి హతాహిత హార హృద్ధి దా

స్థిర తర సీర పాణి శివ శీల జితా సుర సింధు బంధనా


ఆ శ్లోకం-

నరనాథ నతామర నారదస్తుతా
ధరధారి ధరాధిప దారితా శరా
హర హారి హతాహిత హార హృద్ధి దా
శివ శీల జితా సుర సింధు బంధనా

Sunday, September 26, 2021

శ్లోక గర్భిత ద్విపద

శ్లోక గర్భిత ద్విపద




సాహితీమిత్రులారా!



ద్విపదలో శ్లోకాన్ని ఇమిడ్చి చెప్పబడింది

కంకంటి నారసింహ కవి కృత 

విష్ణుమాయా విలాసము లో 

దాన్ని శ్లోక గర్భిత ద్విపద గా 

చెప్పబడుతున్నది గమనించగలరు

ద్విపద-

బాల గోపాల రూపాయ నవీన

నీల నీరద భాసినేతే నమోస్తు

జాన గమ్యాయ కృష్ణాయ నిత్యాయ

తేనమోస్తు తమోహ్యతే నిరీహాయ

                                             (విష్ణుమాయా విలాసం - 5 ఆశ్వాసం)

దీనిలోని శ్లోకం-

బాల గోపాల రూపాయ నవీన

నీల నీరద భాసినేతే నమోస్తు

జాన గమ్యాయ కృష్ణాయ నిత్యాయ

తేనమోస్తు తమోహ్యతే నిరీహాయ


బాలా గాపాల రూపాయ 

నీలనీరదభాసినే

జానగమ్యాయ కృష్ణాయ 

తేనమోస్తు తమోహ్యతే 

Friday, September 24, 2021

దీర్ఘాయష్మాన్ భవ అంటే

 దీర్ఘాయష్మాన్ భవ అంటే




సాహితీమిత్రులారా!


చిన్నపిల్లలను పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు.

ఒకసారి కంచి పరమాచార్యులవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ

మహాస్వాములవారు ఆయన దగ్గరకు వచ్చిన పండితులను

మేము దీవించాలంటే నారాయణ నారాయణ అని దీవిస్తాము

మరి మీరైతే ఎలాదీవిస్తారు అని అడిగారట. దానికి వారు

దీర్ఘాయష్మాన్ భవ సౌమ్య అని దీవిస్తామని చెప్పారట.

దానికి పరమాచార్యవారు అర్థమేమిటని అడిగారట

అదేముంది నిండునూరేళ్ళు జీవించమనికదా అర్థం అన్నారట

దానికి పరమాచార్యవారు అదికాదన్నారట. దానితో పండితులంతా

దాని అర్థం అదేకదా అదికాదంటారేమిటని అలోచనలో పడ్డారట

వారి ఆలోచనకు ఏమీ తట్టటంలేక నిలిచిపోయారట. దానితో

పరమాచార్యవారు నేను చెప్పమంటారా అని అడిగారట. సరే చెప్పమన్నారట.

దీనికి పరమాచార్యవారు ఈవిధంగా చెప్పారట-

మనకు పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, కరణ, యాగాలుంటాయి.

యోగాలలో ఆయుష్మాన్ ఒకటి, కరణంలో బవ ఒకటి, 

సౌమ్య వారం అంటే బుధవారం ఈ మూడు కలిసి వస్తే శుభప్రదం 

మంచి సౌఖ్యాన్నిస్తాయి కాబట్టి ఆ మూడు కలిసి వచ్చే సౌఖ్యం మీకు కలగాలని దాని అర్థం 

అని చెప్పాడట.


Wednesday, September 22, 2021

రెండు హల్లుల పద్యం

రెండు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!



బుక్కపట్టణ రాఘవాచార్య కృత
శ్రీకువలాశ్వ విజయములోని
పంచమాశ్వాసమునుండి-

కేవలం రెండుహల్లులను 

ఉపయోగించి కూర్చిన పద్యం

- అనే రెండు హల్లులతో కూర్చిన పద్యం గమనించండి-

లావు వోవు లే లేవెవలా లి
వేల వోలె వావేవలే
వాలు వీలు వోల వాలు వీలీవే
లే లీల వీవు లోవి వోలె
 (5-71)


Monday, September 20, 2021

నాచన సోముని చమత్కారం

నాచన సోముని చమత్కారం




సాహితీమిత్రులారా!



విద్వత్ప్రభువైన అనవేమారెడ్డిని
సంవత్సరానికొకసారి నాచనసోమనాథకవి
దర్శించేవారట. దర్శించి ఒక పద్యం చెప్పి
సన్మానం అందుకొనేవాడట.
ప్రతిరోజు ఆయనదగ్గరుండే కవులకు ఇది కన్నెర్రైంది.
 దీనితో రాజునకు లేనిపోని కొండేలు చెప్పారు.
విని విని ఒకసారి రాజుగారు సోమనకు కబురు పెట్టారు.
అప్పటికి 8 నెలలైంది. సోముడు రాజాజ్ఞప్రకారం వచ్చి
తన కవితా ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ ఒక కందంలో
కొంతభాగం చెప్పి మిగతా భాగాన్ని
అక్కడి కవులను పూరించమని,
నాలుగునెలల తరువాత తాను
విజయదశమినాడు మిగతా భాగాన్ని
పూరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ పద్యం-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను..........

అనవేముడు తమ గొప్పలు చెప్పుకున్న
కవులను పూరించమని అడిగితే
వారు చేయలేక పోయారట.  చేయలేకపోయారు
అనటంకంటె వారుచేసినవి రాజుకు
నచ్చలేదు అనవచ్చు. విజయదశమి రానే వచ్చింది.
సోమన వచ్చాడు పూరించాడు  ఆ పూరణ-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను కరి ముకురంబున 
పంచాక్షరి శివుడు హరిఁబ్రపంచము వోలెన్


(ఓ అనవేమనృపాలా! అద్దంలో ఏనుగు ఉన్నట్లుగా,
పంచాక్షరి మంత్రంలో శివుడు ఉన్నట్లుగా విష్ణువు
 ప్రపంచమంతా ఉన్నట్లుగా ఈ కొంచెపు లోకంలో
నీ కీర్తి మించింది.)


Saturday, September 18, 2021

పాశ్చాత్యభాషలలో స్థాన చిత్రం

 పాశ్చాత్యభాషలలో స్థాన చిత్రం




సాహితీమిత్రులారా!



ఉచ్ఛరించబడే స్థానాలను అనుసరించి అక్షరాలను పద్యాల్లో ఉపయోగించి చూపటాన్ని స్థానచిత్రం అంటాం. పాశ్చాత్యభాషల్లో లిపోగ్రామట్టా (Lipo grammatta)అనే పద్ధతి ఒకటి ఉంది. దానిలో అర్థమేమంటే లెటర్ డ్రాప్పింగ్(Letter dropping)అని పేరు. దీన్ని వ్రాసేవారిని లిపో గ్రెమటిస్ట్ అంటారు.


ట్రైఫిడస్ (Tryphiodous) అనే గ్రీకు ప్రాచీన రచయిత యులిసెస్(Ulysses)సాహసయాత్రలను గురించి 24 ప్రకరణలుగల గ్రంథాన్ని కూర్చారు. అందులో గ్రీకు వర్ణమాలలోని పేర్లను ఒక్కొకప్రకరణానికి పేర్లు పెట్టాడు.అందులో ఆల్ఫా మొదటిప్రకరణం దీనిలో ఆల్ఫా అనే వర్ణం లేకుండా వ్రాశారు. బీటాలో లో బీటా ఉండదు, గామాలో గామా ఉండదు, డెల్టాలో డెల్టా ఉండదు ఈ విధంగా మొత్తం 24 ప్రకరణాలు కూర్చబడ్డాయి.


స్పానిష్ భాషలో లోప్ డె వేగ (Lope de vega)అనే నవలాకారుడు 5 నవలలను కూర్చాడు

వాటిలో ఒకదానిలో A అనే అచ్చువాడకుండా 

రెండవదానిలో E అనే అచ్చువాడకుండా, 

మూడవదానిలో I అనే అచ్చువాడకుండా, 

నాల్గవదానిలో O అనే అచ్చువాడకుండా, 

ఐదవదానిలో U అనే అచ్చువాడకుండా కూర్చారు

Thursday, September 16, 2021

ఆంగ్ల ఏకాచ్చు పద్యాలు

 ఆంగ్ల ఏకాచ్చు పద్యాలు




సాహితీమిత్రులారా!



తెలుగు, హిందీ, సంస్కృతంలో మాదిరే

ఆంగ్లంలోనూ ఒకే అచ్చును ఉపయోగించి 

కూర్చిన పద్యాలున్నాయి.

వీటిని యూని వోకలిక్ వర్సేస్ (Unin Vocalic Verses)అంటారు

ఇక్కడ కేవలం  ఐ (I)అనే అచ్చుతోటే కూర్చిన 

సాయంకాల వర్ణన పద్యం గమనించండి-

Idling, I sit in this mild twilight dim

Whilst birds, in wild, swift vigils circling skim

Light windo in sigling sink, till rising bright

Night's virgin pilgrim swims in vivid light.




Tuesday, September 14, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 5

 భోజమహారాజు - సమస్యాపూరణలు - 5




సాహితీమిత్రులారా!



ఒకరోజు భోజమహారాజు ధారానగరంలో విహరిస్తూ
దుర్గాదేవి ఆలయానికి పోగా అక్కడ ఒక యోగిని
ఒక కుర్రవానికి అనేకవిధాల లాలిస్తూ ముద్దుముచ్చట
లాడుతోంది. సర్వసంగ పరిత్యాగిగా ఉండవలసిన ఈమెకు
ఈ సంసారపు జంజాటము ఏమిటి అని అనుకొని. అయినా
ఆవిషయం తెలుసుకొందామని ఆమెతో -
 "అమ్మా! ఈ బాలుడు నీకేమి కావాలి? - అని ప్రశ్నించాడు.
దానికి ఆమె రాజును చూచి "మహాప్రభూ! ఈ కుర్రవాడు నాకు సోదరుడు,
మేనల్లుడు, మనుమడు, మామ, కొడుకు,పినతండ్రి, మరిది" - అని చెప్పింది.
ఈ విపరీతపు వావివరుస విని రాజు ఆశ్చర్యపోయాడు. మరునాడు
ఆ యోగిని చెప్పిన వావివరుసను ఒక సమస్యగా
కూర్చి పండితులందరికి ఇచ్చాడు -
సమస్య-
భ్రాత, ర్భ్రాతృవ్య, పౌత్ర, శ్వశుర, సుత, పితృ, వ్యేతి తం దేవరేతి

దీన్నివిన్న పండితులు ఏమీ చెప్పలేక ఉండగా
కాళిదాసు కాళికాప్రసాదంతో ఆ రహస్యాన్ని కనిపెట్టి ఇలా పూరించాడు.

జారోత్పన్నౌ తనయదుహితరౌ, దంపతీ దైవయోగా
ద్యోగిన్యా గర్హితా సా తదనుగమవశాద్యోగినీత్వం ప్రపేదే,
పశ్చాద్భార్యాకృతాంబాజనిత మధ శిశుం లాలయత్యబ్రవీత్సా
భ్రాతర్భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి


ఒక ఊరిలో ఒక జారిణి ఉండేది. ఆమె చిన్నవయసులో ఒకనితో
కలిసి ఒక కొడుకును కని అతన్ని పిల్లవాణ్ణి వదిలేసి ఇంకో ఊరిలో
ఇంకొకనితో ఉండెను. అతనివలన ఒక కుమార్తెను కని, వారిని వదలి
మరొక ఊరిలో వేశ్యావృత్తిలో ఉండినది. కొన్నాళ్ళకు ఆమెకు కలిగిన
కొడుకుకు, కూతురుకు దైవయోగంతో వివాహమయింది.
వారి జన్మరహస్యం గురించి ఒక యోగిని తెలియపరచడంతో
ఆ కన్య సంసారాన్ని వదలి యోగిని అయినది.(ఆమె భోజునికి కనిపించినది.)
ఆమె యోగిని అయిన తరువాత ఆమెను వెదకుచూ ఊరూరా తిరుగుతూ
కన్నతల్లి వేశ్యగా ఉన్న ఊరికి పోయి కామావేశంతో వేశ్యగా ఉన్న తల్లితో
కలియగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆ వేశ్య పిల్లవాన్ని విడిచిపెట్టింది.
ఆ శిశువు ఎట్లో ఈ యోగినికి దొరికాడు. ఆ యోగిని ఆత్మశక్తితో శిశువు
జన్మరహస్యం కనిపెట్టింది కావున ఇన్ని వావివరుసలు చెప్పింది.
వావివరుసలు-
1. సోదరుడు - తన తల్లి అయిన వేశ్యకు కుమారుడు కావున.
2. మేనల్లుడు - తను పెండ్లాడిన తన అన్నకు కొడుకు కావున.
3. మనుమడు - తనతల్లి అయిన వేశ్య తనభర్తకు భార్య అయింది. దీనివల్ల
                        తనతల్లి తనకు సవతి అయింది. ఆ సవితికి మొదట తనభర్త కొడుకు
                        కావున
                       తనభర్త తనకు కొడుకు అతని కొడుకు కావున మనుమడు

4. మామ - తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త, అత్త మొగుడు(తనభర్త)
                 తనకుమామ, ఈ వరుసన తనభర్త, ఈ పిల్లవాడు ఒకే గర్భవాసులు
                 అయినందున మామ.

5. కొడుకు - తనభర్తకు కొడుకు కావున తనకు కొడుకే

6. పినతండ్రి - తనతల్లికి మగడు తనభర్త. తనభర్తకు తనతల్లికి పుట్టినవాడు ఈ శిశువు.
                    తనతల్లికి భర్త అయిన వరుసలో తనకు తండ్రి, ఆ తండ్రికి ఈ శిశువు తమ్ముడు
                    కావున పినతండ్రి.
7. మరిది -  తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త ఆ అత్తకు రెండవ కొడుకు.
                  కావున భర్త తమ్ముడు మరిది

ఇన్ని సంబంధాలను మూడు పాదాలలో ఇమిడ్చి
సమస్యను పూర్తి చేశాడు కాళిదాసు.
అతని ఊహాపోహలకు ప్రతిభా విశేషానికి
భోజరాజు ఆశ్చర్యపడి
గొప్ప సన్మానము చేశాడు.

Sunday, September 12, 2021

ఆంగ్ల నామగోపనం

 ఆంగ్ల నామగోపనం




సాహితీమిత్రులారా!



తెలుగు, హిందీ, సంస్కృతం మొదలైన భాషల్లోలాగే

గ్రీకు, లాటిన్  ఆంగ్లము మొదలైన భాషల్లో కూడ చిత్రకవిత్వం ఉంది.

ఆంగ్లంలో అక్రోటిక్స్ (ACROSTICS ) అనే పేరున ఒక ప్రక్రియ ఉంది

దాన్ని మనం నామగోపనంగా గుర్తించవచ్చు. 

ఇక్కడ ఒక ఆంగ్ల నామగోపనం గమనిద్దాం-

Deep rolls on deep in thy majestic line

Rich music and the state liest march combine;

Yet who that hears its high hamonious strain

Decens not thy genius thou did'st half profane

Exhausting the great power of song on themes

Not worthy of its strong, effuflgent beams.

 DRYDENకవిని గురించిన ఈ పద్యంలో ప్రతిపాదం మొదటి అక్షరాన్ని కలుపగా కవిపేరు DRYDENవస్తుంది గమనించగలరు.

Friday, September 10, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4




సాహితీమిత్రులారా!



భోజరాజు ఒకరోజు రాత్రి ఆకల్లాడక తీవ్రమైన ఉక్కతో
అంత:పురకాంతలను తాకనైనా లేక కేవలము
కనుసన్నలచేతనే ఆలింగనాదులన్నీ అనుభవించుచూ
సరససల్లాపమలచేతనే  కాలక్షేపము చేసి ఆ రాత్రి నిదురించెను.
మరునాడు సభలో తాను అనుభవించిన దాన్నిఒక సమస్యగా ఇచ్చాడు.
సమస్య - మరుదాగమవార్తయా2పి శూన్యే
              సమయే జాగ్రతి సంప్రవృద్ధతాపే

(గాలివచ్చు అనుమాట కూడలేని
   పెనువేసవికాలములో
  ఉమ్మదము, వేడిమి మిక్కిలి
  తీవ్రమవుచుండగా.....)

దీన్ని భవభూతి ఈవిధంగా పూరించాడు.
ఉరగీ శిశవే ఋభుక్షవే స్వా
మదిశత్ఫూత్కృతిమాననానిలేన

(ఆ సమయంలో ఆడుపాము ఆకలితో ఉన్న
తనపిల్లనోటిలో తన నోరుపెట్టి 'ఫూ' అని ఊది గాలిమేపు ఇచ్చెను.)

దానికి భోజుడు  - కవిచంద్రా! లోకోక్తిని చక్కగా సమర్థించి చెప్పావు
                         చాల సంతోషమైంది-
                                                         అని అన్నాడు.
తరువాత కాళిదాసు వైపుచూడగా
ఈవిధంగా పూరించాడు.

అబలాసు విలాసినో2స్వభూప
న్నయనై రేవ నవోపగూహనాని


(విలాసపురుషులు తమ ప్రియురాండ్ర ఎడ నూతన
ఆలింగనములను కన్నలచేతనే అనుభవించినవారైరి)
అని చెప్పగా
రాజు మనసులోని అభిప్రాయమునే
చూచినట్లు సూటిగా చెప్పినందులకు
చాల సంతోషముతో సన్మానము చేసెనట.

Wednesday, September 8, 2021

సంస్కృత సమస్యా పూరణ

 సంస్కృత సమస్యా పూరణ




సాహితీమిత్రులారా!



సంస్కృత సమస్య -
పురః పత్యుః కామాత్ శ్వశుర మియ మాలింగతి సతీ
(పతివ్రత అయిన స్త్రీ భర్త ఎదుట
 కోరికతో మామను కౌగిలించుకున్నది)


పూరణ-
తపాపాయే గోదావరతటభువి స్థాతుమనసి
ప్రవిష్టే తత్పూరం భగవతి మునౌకుంభజమషి
ద్రుతం లోపాముద్రా స్వయ మవికలం గంతు ముదితా
పురః పత్యుః కామాత్ శ్వశుర మియ మాలింగతి సతీ


అగస్త్యముని ప్రవాహంలో దిగి వెళుతుండగా,
ఆయన్ను చేరుకోవాలని నదిని దాటడానికి
కుండను సహాయంగా తీసుకున్నది లోపాముద్ర
- అని భావం.

అగస్త్యుడు కుంభసంభవుడు కావున కుండ లోపాముద్రకు
మామ అవుతాడు ప్రవాహాన్ని కుండసాయంతో దాటడం
లోక ప్రసిద్ధమేకదా కావున కవి ఈ విధంగా చమత్కారంగా
పూరించాడు.


Monday, September 6, 2021

ప్రశ్నోత్తర చిత్రం

 ప్రశ్నోత్తర చిత్రం




సాహితీమిత్రులారా!



సమస్య-
సంధ్యావందన మాచరంతి విబుధాః నారీ భగాంతర్జలైః
(పండితులు(స్త్రీ)ల యోని జలంతో సంధ్యావందనం చేస్తారు)
ఇది చాల చిత్రమైన సమస్య
ఇందులోని అర్థం పైకి సరైనదిగాలేదు

పూరణ-
కిం కుర్వంత్యుషసి ద్విజాః? 
గుణవతః కే మానినీయాః ప్ర భో?
కావా సాహసీ? 
నిశాసు సతతం ద్యౌః కీదృశీ వర్తతే?
కుత్రాస్తే మధు నారికేళ ఫలకే? 
కైః స్యాత్పిపాసాశమః?
సంధ్యావందన మాచరంతి విబుధాః నారీ భగాంతర్జలైః

ఇందులో సమస్యను క్రమాలంకారంతో పూరింపబడినది.
ఇందులో 6 ప్రశ్నలు కూర్చి సమస్యలోని 6 పదాలను
సమాధానాలుగా మార్చాడు కవి.


1. కిం కుర్వంత్యుషసి ద్విజాః?
      బ్రాహ్మణులు ప్రాతః కాలంలో ఏం చేస్తారు?
    - సంధ్యవందన మాచరంతి

2.   గుణవతః కే మానినీయాః ప్ర భో?
      గుణవంతుడైన రాజుచేత గౌరవింపదగినవారెవరు?
   - విబుధాః (పండితులు)

3.  కావా సాహసీ?
     సాహసం కలవారెవరు?
   - నారీ(స్త్రీ)

4.  నిశాసు సతతం ద్యౌః కీదృశీ వర్తతే?
      రాత్రులందు ఆకాశం ఎట్లా ఉంటుంది?
   - భగా (నక్షత్రాలతో కూడి ఉంటుంది)

5.  కుత్రాస్తే మధు నారికేళ ఫలకే?
       కొబ్బరికాయలో తీపి ఎక్కడుంటుంది?
      - అంతః(లోపల)

6.    కైః స్యాత్పిపాసాశమః?
       దాహము వేటితో తీరుతుంది?
      - జలైః (నీళ్ళతో)

ఈ విధమైన వాటిని ప్రశ్నోత్తచిత్రమనికూడ అంటారు.
ఇందులోనే ప్రశ్నలు ఉన్నాయి ఉత్తరాలు ఉన్నాయి
కావున ఇది ప్రశ్నోత్తర చిత్రం అవుతుంది.


Saturday, September 4, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3




సాహితీమిత్రులారా!



 ఒకమారు ముగ్గురు వ్యక్తులు భోజరాజు దర్శనానికి

వెళ్ళగా వారికి ఉచితరీతిని సత్కరించి మీరేమైనా
శ్లోకాలు రాశారా?  అని ప్రశ్నించాడు. దానికి వారు
ఇప్పటికి ఏమీ రాసుకొని రాలేదు నెలవైతే రాసుకొని
వస్తామని చెప్పి సెలవుతీసుకున్నారు.
కానీ కవిత్వమంటే ఏంటో వారికి తెలియదు
వారు రాయాలని ఆలోచన ప్రారంభించారు.
ఆశ చెడ్డదికదా! ఏలాగైనా నాలుగు పాదాలు కూర్చుకొని
ఒక శ్లోకమైనా పూర్తి చేయాలని ముగ్గురు కూడబలుక్కొని
ఒక్కొక్కపాదం ఒకరు పూర్తి చేసేవిధంగా మాట్లాడుకున్నారు.
ఎంత ప్రయత్నించినా ఎవరికీ ఏమీ తెలియడంలేదు.
వారిలో ఒకడు సాధారణంగా అనుకొనే ఒకపాదాన్ని
గుర్తుకురాగా అది చెప్పి గండం గడిచిందనుకున్నాడు.
ఆ పాదం-
అనిత్యాని శరీరాణి

రెండవవాడు ఎప్పుడో విన్న పాదం చెప్పి
తనగండం గడిచిందనుకున్నాడు.
రెండవ పాదం -
శాకాయ లవణాయ చ

మూడవవాడు చిన్నప్పుడు చదివిన
బాలరామాయణశ్లోకంలోని పాదం చెప్పి
ఊరకున్నాడు.
ఆ పాదం -
కూజన్తం రామ రామేతి

మూడు పాదాలు పూర్తయినాయి కాని నాలుగవపాదం
ఎంతప్రయత్నించినా వారి వల్లకాలేదు. మాటిమాటికి ఆ పాదాలనే
వల్లెవేస్తూ దారిలో వెళుతున్నవారిని కాళిదాసు వారి అవస్థనుచూచి
నాలుగవపాదం పూర్తిచేసి ఇక మీకు సన్మానం జరుగుతుంది రాజుదగ్గరకు
రండి అని చెప్పి లోనికి వెళ్ళాడు. కాళిదాసు పూర్తిచేసి ఇచ్చిన తర్వాత
కడతేరాం దేవుడా!  అనుకొని రాజుగారి ముందుకు వెళ్ళారు.
దాని్ని చూచిన రాజుగారు నాల్గవపాదం చెప్పినవారికి
అక్షరలక్షలు ఇచ్చితిని అనగా వారు రాజుగారికి
జరిగినదంతా చెప్పారు.
దానితో కాళిదాసును రాజుగారు సత్కరించాడు.
ఆ (పూర్తి)శ్లోకం -

అనిత్యాని శరీరాణి
శాకాయ లవణాయ చ
కూజన్తం రామ రామేతి
మత్వా మాగా గళం వహ

వీటి అర్థం-
అనిత్యాని శరీరాణి (శరీరము అనిత్యము)
శాకాయ లవణాయ చ (శాకమునకును, లవణమునకును)
కూజన్తం రామ రామేతి (రామ రామ అని కూయుచున్నది)
ఈ మూడు పాదములకు అతుకు పెట్టి క్రమాలంకారంలో చెప్పాడు కాళిదాసు.
మత్వా మాగా గళం వహ

అనిత్యాని శరీరాణి మత్వా 
(శరీరము అనిత్యమని తలచి)
శాకాయ లవణాయ చ మాగా: 
(శాకమునకును, లమణమునకును పోకుము)
కూజన్తం రామ రామేతి గళం వహ
(రామరామ అని కంఠమున వహింపుము)

దీని భావం -
ఓ నరుడా! శరీరము అనిత్యమని తలచి,
కూరగాయలు కావాలని ఉప్పు కావాలని వెంపర్లాడకు.
ఎల్లపుడు రామరామ అని కీర్తనను కంఠంనందు
వహించు అనగా ఎల్లపుడు రామనామాన్ని
సంకీర్తన చేస్తూ ఉండు - అని భావం.