Sunday, April 5, 2020

హిందీలో విలోమకావ్యం


హిందీలో విలోమకావ్యం
సాహితీమిత్రులారా!
Śrī Rāma & Kṛṣṇa
ప్రపంచంలో విలోమకావ్యాలు సంస్కృతంలో అదీ రెండు వున్నాయని
అందరికి తెలుసు. కాని హిందీలో వుందని చాలామందికి తెలియదు.
1. రామకృష్ణవిలోమకావ్యం(సంస్కృతం)  దైవజ్ఞ సూర్యకవి కృతం
2. రాఘవయాదవీయం(సంస్కృతం)     వేంకటాధ్వరి
ఇక మూడవది - శ్రీరామకృష్ణ కావ్యం
12 రకాల ఛందస్సులతో 50 పద్యాలతో హిందీ(వ్రజభాష)లో కూర్చనడినది.
కూర్చిన వారు హృషీకేశ చతుర్వేది.

ఛందస్సు పేరు        గణాలు
1. ఇంద్రవ్రజ         తతజగగ
2. మౌక్తికదామ         జజజజ
3. శ్యేనికా             రజరలజ
4. తోటక              సససస
5. మోదక             భభభభ
6. స్త్రగ్విణి            రరరర
7. దోహా
8. తూణక             రజరజర
9. సమానికా           రజగ
10. మనోరమ          రసజల
11. పీయూషవర్ష        16 మాత్రలు చివర వ - గణం
12. సంయుత          సజజగ

మొదటి శ్లోకం -
రామపరంగా
रामा हरैँ कष्टइ तीव्र-धारा
हैं सोपमी, सत्य निरीह जो हैं
రామా హరై కష్టఇ తీవ్ర-ధారా
హైఁ సోపమీ, సత్య నిరీహ జో హై


కృష్ణపరంగా - పై శ్లోకాన్ని కుడినుండి ఎడమకు వ్రాయగా

राधा-व्रती इष्ट करैं हमारा
हैं जो हरी, नित्य समीप सोहैं
రాధా-వ్రతీ ఇష్ట కరైఁ హమారా
హైఁ జో హరీ, నిత్య సమీప సోహైఁ

Friday, April 3, 2020

కావ్యం కరోమి............


కావ్యం కరోమి............
సాహితీమిత్రులారా!

భోజరాజు గొప్ప కవితాప్రియుడు.
తన రాజ్యంలో ప్రతిఒక్కరు కవిత్వం అల్లగలిగి ఉండాలి.
కవితాశక్తి లేనివారిని దేశంనుండి తరిమివేయండని భటులకు ఆజ్ఞాపించాడు.
వారు వెదికి వెదికి ఒక సాలెవానిని పట్టుకొని రాజు ఎదుట పెట్టారు.
"కవిత్వం చెప్పగలవా?" అని భోజుడు ప్రశ్నించాడు.
ఆ సాలెవాడు భోజునివంక చూచాడు.
(భోజుని ముఖం చూడగానే ప్రతి వ్యక్తికి కవిత్వం హృదయం నుండి
తన్నుకొని వస్తుందంటారు అదే విధంగా)
వెంటనే
ఆ సాలెవాడు
ఈ క్రింది విధంగా సమాధానం చెప్పాడు -


కావ్యం కరోమి నహి చాతురం కరోమి
యత్నాత్ కరోమి యది చాతురం కరోమి
భూపాలమౌళి మణిరంజిత పాదపీఠ
హో సాహసాంక కవయామి - వయామి - యామి


కావ్యం వ్రాయగలను,
కాని అందంగా రచింపలేను.
ప్రయత్నిస్తే వ్రాయగలను.
రాజులు మణి కిరీట కాంతులతో ప్రకాశించు
పాదపీఠముగల చక్రవర్తీ!
కవయామి(కవనమల్లగలను) -
వయామి(నేతనేయగలను) -
యామి(వెళ్ళుచున్నాను) -
అని భావం.

Wednesday, April 1, 2020

ఆదివర్ణావృత్తి కావ్యాలు


ఆదివర్ణావృత్తి కావ్యాలు
సాహితీమిత్రులారా!
Avercart Lord Dattatreya Poster 12x16 inch Framed (with Frame Size ...
ఒక పద్యం లేదా శ్లోకం మొదలు పెట్టిన అక్షరం
మళ్ళీమళ్ళీ వస్తూ వుంటే దాన్ని ఆదివర్ణావృత్తి అంటాం
ఇలాంటివి అనే ఉన్నాయి.
వాటిలో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం
అయితే ఇవన్నీ భక్తిభరిత స్తోత్రాలు సహస్రనామావళులే.

శ్రీ పరమ పూజ్య పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ శ్రీ శ్రీ మద్వాసుదేవానన్ద సరస్వతీ యతి వరేణ్య
విరచిత దకారాది దత్త సహస్రనామస్తోత్రమ్
గమనించండి-

                 ॥ అథ ధ్యానమ్॥

యావద్ద్వైతభ్రమస్తావన్న శాన్తిర్న పరం సుఖమ్ ॥

అతస్తదర్థం వక్ష్యేఽదః సర్వాత్మత్వావబోధకమ్ ॥

॥ అథ శ్రీ దకారాది శ్రీ దత్త సహస్రనామస్తోత్రమ్ ॥

ఓం దత్తాత్రేయో దయాపూర్ణో దత్తో దత్తకధర్మకృత్ ।
దత్తాభయో దత్తధైర్యో దత్తారామో దరార్దనః ॥ ౧॥

దవో దవఘ్నో దకదో దకపో దకదాధిపః ।
దకవాసీ దకధరో దకశాయీ దకప్రియః ॥ ౨॥

దత్తాత్మా దత్తసర్వస్వో దత్తభద్రో దయాఘనః ।
దర్పకో దర్పకరుచిర్దర్పకాతిశయాకృతిః ॥ ౩॥

దర్పకీ దర్పకకలాభిజ్ఞో దర్పకపూజితః ।
దర్పకోనో దర్పకోక్షవేగహృద్దర్పకార్దనః ॥ ౪॥

దర్పకాక్షీడ్ దర్పకాక్షీపూజితో దర్పకాధిభూః ।
దర్పకోపరమో దర్పమాలీ దర్పకదర్పకః ॥ ౫॥

దర్పహా దర్పదో దర్పత్యాగీ దర్పాతిగో దమీ ।
దర్భధృగ్దర్భకృద్దర్భీ దర్భస్థో దర్భపీఠగః ॥ ౬॥

దనుప్రియో దనుస్తుత్యో దనుజాత్మజమోహహృత్ ।
దనుజఘ్నో దనుజజిద్దనుజశ్రీవిభఞ్జనః ॥ ౭॥

దమో దమీడ్ దమకరో దమివన్ద్యో దమిప్రియః ।
దమాదియోగవిద్దమ్యో దమ్యలీలో దమాత్మకః ॥ ౮॥

దమార్థీ దమసమ్పన్నలభ్యో దమనపూజితః ।
దమదో దమసంభావ్యో దమమూలో దమీష్టదః ॥ ౯॥

దమితో దమితాక్షశ్చ దమితేన్ద్రియవల్లభః ।
దమూనా దమునాభశ్చ దమదేవో దమాలయః ॥ ౧౦॥

దయాకరో దయామూలో దయావశ్యో దయావ్రతః ।
దయావాన్ దయనీయేశో దయితో దయితప్రియః ॥ ౧౧॥

దయనీయానసూయాభూర్దయనీయాత్రినందనః ।
దయనీయప్రియకరో దయాత్మా చ దయానిధిః ॥ ౧౨॥

దయార్ద్రో దయితాశ్వత్థో దయాశ్లిష్టో దయాఘనః ।
దయావిష్యో దయాభీష్టో దయాప్తో దయనీయదృక్ ॥ ౧౩॥

దయావృతో దయాపూర్ణో దయాయుక్తాన్తరస్థితః ।
దయాలుర్దయనీయేక్షో దయాసిన్ధుర్దయోదయః ॥ ౧౪॥

దరద్రావితవాతశ్చ దరద్రావితభాస్కరః ।
దరద్రావితవహ్నిశ్చ దరద్రావితవాసవః ॥ ౧౫॥

దరద్రావితమృత్యుశ్చ దరద్రావితచంద్రమాః ।
దరద్రావితభూతౌఘో దరద్రావితదైవతః ॥ ౧౬॥

దరాస్త్రధృగ్దరదరో దరాక్షో దరహేతుకః ।
దరదూరో దరాతీతో దరమూలో దరప్రియః ॥ ౧౭॥

దరవాద్యో దరదవో దరధృగ్దరవల్లభః ।
దక్షిణావర్తదరపో దరోదస్నానతత్పరః ॥ ౧౮॥

దరప్రియో దస్రవన్ద్యో దస్రేష్టో దస్రదైవతః ।
దరకణ్ఠో దరాభశ్చ దరహన్తా దరానుగః ॥ ౧౯॥

దరరావద్రావితారిర్దరరావార్దితాసురః ।
దరరావమహామంత్రో దరారార్పితభీర్దరీట్ ॥ ౨౦॥

దరధృగ్దరవాసీ చ దరశాయీ దరాసనః ।
దరకృద్దరహృచ్చాపి దరగర్భో దరాతిగః ॥ ౨౧॥

దరిద్రపో దరిద్రీ చ దరిద్రజనశేవధిః ।
దరీచరో దరీసంస్థో దరీక్రీడో దరీప్రియః ॥ ౨౨॥

దరీలభ్యో దరీదేవో దరీకేతనహృత్స్థితిః ।
దరార్తిహృద్దలనకృద్దలప్రీతిర్దలోదరః ॥ ౨౩॥

దలాదర్నష్యనుగ్రాహీ దలాదనసుపూజితః ।
దలాదగీతమహిమా దలాదలహరీప్రియః ॥ ౨౪॥

దలాశనో దలచతుష్టయచక్రగతో దలీ ।
ద్విత్ర్యస్రపద్మగతివిద్దశాస్రాబ్జవిభేదకః ॥ ౨౫॥

ద్విషడ్దలాబ్జభేత్తా చ ద్వ్యష్టాస్రాబ్జవిభేదకః ।
ద్విదలస్థో దశశతపత్రపద్మగతిప్రదః ॥ ౨౬॥

ద్వ్యక్షరావృత్తికృద్-ద్వ్యక్షో దశాస్యవరదర్పహా ।
దవప్రియో దవచరో దవశాయీ దవాలయః ॥ ౨౭॥

దవీయాన్దవక్త్రశ్చ దవిష్ఠాయనపారకృత్ ।
దవమాలీ దవదవో దవదోషనిశాతనః ॥ ౨౮॥

దవసాక్షీ దవత్రాణో దవారామో దవస్థగః ।
దశహేతుర్దశాతీతో దశాధారో దశాకృతిః ॥ ౨౯॥

దశషడ్బంధసంవిద్దో దశషడ్బంధభేదనః ।
దశాప్రదో దశాభిజ్ఞో దశాసాక్షీ దశాహరః ॥ ౩౦॥

దశాయుధో దశమహావిద్యార్చ్యో దశపఞ్చదృక్ ।
దశలక్షణలక్ష్యాత్మా దశషడ్వాక్యలక్షితః ॥ ౩౧॥

దర్దురవ్రాతవిహితధ్వనిజ్ఞాపితవృష్టికః ।
దశపాలో దశబలో దశేన్ద్రియ విహారకృత్ ॥ ౩౨॥

దశేన్ద్రియ గణాధ్యక్షో దశేన్ద్రియదృగూర్ధ్వగః ।
దశైకగుణగమ్యశ్చ దశేన్ద్రియమలాపహా ॥ ౩౩॥

దశేన్ద్రియప్రేరకశ్చ దశేన్ద్రియనిబోధనః ।
దశైకమానమేయశ్చ దశైకగుణచాలకః ॥ ౩౪॥

దశభూర్దర్శనాభిజ్ఞో దర్శనాదర్శితాత్మకః ।
దశాశ్వమేధతీర్థేష్టో దశాస్యరథచాలకః ॥ ౩౫॥

దశాస్యగర్వహర్తా చ దశాస్యపురభఞ్జనః ।
దశాస్యకులవిధ్వంసీ దశాస్యానుజపూజితః ॥ ౩౬॥

దర్శనప్రీతిదో దర్శయజనో దర్శనాదురః ।
దర్శనీయో దశబలపక్షభిచ్చ దశార్తిహా ॥ ౩౭॥

దశార్తిగో దశాశాపో దశగ్రన్థవిశారదః ।
దశప్రాణవిహారీ చ దశప్రాణగతిర్దృశిః ॥ ౩౮॥

దశాఙ్గులాధికాత్మా చ దాశార్హో దశషట్సుభుక్ ।
దశప్రాగాద్యఙ్గులీకకరనమ్రద్విడన్తకః ॥ ౩౯॥

దశబ్రాహ్మణభేదజ్ఞో దశబ్రాహ్మణభేదకృత్ ।
దశబ్రాహ్మణసమ్పూజ్యో దశనార్తినివారణః ॥ ౪౦॥

దోషజ్ఞో దోషదో దోషాధిపబంధుర్ద్విషద్ధరః ।
దోషైకదృక్పక్షఘాతీ దష్టసర్పార్తిశామకః ॥ ౪౧॥

దధిక్రాశ్చ దధిక్రావగామీ దధ్యఙ్మునీష్టదః ।
దధిప్రియో దధిస్నాతో దధిపో దధిసిన్ధుగః ॥ ౪౨॥

దధిభో దధిలిప్తాఙ్గో దధ్యక్షతవిభూషణః ।
దధిద్రప్సప్రియో దభ్రవేద్యవిజ్ఞాతవిగ్రహః ॥ ౪౩॥

దహనో దహనాధారో దహరో దహరాలయః ।
దహ్రదృగ్దహరాకాశో దహరాఛాదనాన్తకః ॥ ౪౪॥

దగ్ధభ్రమో దగ్ధకామో దగ్ధార్తిర్దగ్ధమత్సరః ।
దగ్ధభేదో దగ్ధమదో దగ్ధాధిర్దగ్ధవాసనః ॥ ౪౫॥

దగ్ధారిష్టో దగ్ధకష్టో దగ్ధార్తిర్దగ్ధదుష్క్రియః ।
దగ్ధాసురపురో దగ్ధభువనో దగ్ధసత్క్రియః ॥ ౪౬॥

దక్షో దక్షాధ్వరధ్వంసీ దక్షపో దక్షపూజితః ।
దాక్షిణాత్యార్చితపదో దాక్షిణాత్యసుభావగః ॥ ౪౭॥

దక్షిణాశో దక్షిణేశో దక్షిణాసాదితాధ్వరః ।
దక్షిణార్పితసల్లోకో దక్షవామాదివర్జితః ॥ ౪౮॥

దక్షిణోత్తరమార్గజ్ఞో దక్షిణ్యో దక్షిణార్హకః ।
ద్రుమాశ్రయో ద్రుమావాసో ద్రుమశాయీ ద్రుమప్రియః ॥ ౪౯॥

ద్రుమజన్మప్రదో ద్రుస్థో ద్రురూపభవశాతనః ।
ద్రుమత్వగమ్బరో ద్రోణో ద్రోణీస్థో ద్రోణపూజితః ॥ ౫౦॥

ద్రుఘణీ ద్రుద్యణాస్త్రశ్చ ద్రుశిష్యో ద్రుధర్మధృక్ ।
ద్రవిణార్థో ద్రవిణదో ద్రావణో ద్రావిడప్రియః ॥ ౫౧॥

ద్రావితప్రణతాఘో ద్రాక్ఫలో ద్రాక్కేన్ద్రమార్గవిత్ ।
ద్రాఘీయ ఆయుర్దధానో ద్రాఘీయాన్ద్రాక్ప్రసాదకృత్ ॥ ౫౨॥

ద్రుతతోషో ద్రుతగతివ్యతీతో ద్రుతభోజనః ।
ద్రుఫలాశీ ద్రుదలభుగ్దృషద్వత్యాప్లవాదరః ॥ ౫౩॥

ద్రుపదేడ్యో ద్రుతమతిర్ద్రుతీకరణకోవిదః ।
ద్రుతప్రమోదో ద్రుతిధృగ్ద్రుతిక్రీడావిచక్షణః ॥ ౫౪॥

దృఢో దృఢాకృతిర్దార్ఢ్యో దృఢసత్త్వో దృఢవ్రతః ।
దృఢచ్యుతో దృఢబలో దృఢార్థాసక్తివారణః ॥ ౫౫॥

దృఢధీర్దృఢభక్తిదృగ్దృఢభక్తివరప్రదః ।
దృఢదృగ్దృఢభక్తిజ్ఞో దృఢభక్తో దృఢాశ్రయః ॥ ౫౬॥

దృఢదణ్డో దృఢయమో దృఢప్రదో దృఢాఙ్గకృత్ ।
దృఢకాయో దృఢధ్యానో దృఢాభ్యాసో దృఢాసనః ॥ ౫౭॥

దృగ్దో దృగ్దోషహరణో దృష్టి ద్వంద్వ విరాజితః ।
దృక్పూర్వో దృఽగ్మనోతీతో దృక్పూతగమనో దృగీట్ ॥ ౫౮॥

దృగిష్టో దృష్ట్యవిషమో దృష్టిహేతుర్దృష్టత్తనుః ।
దృగ్లభ్యో దృక్త్రయయుతో దృగ్బాహుల్యవిరాజితః ॥ ౫౯॥

ద్యుపతిర్ద్యుపదృగ్ద్యుస్థో ద్యుమణిర్ద్యుప్రవర్తకః ।
ద్యుదేహో ద్యుగమో ద్యుస్థో ద్యుభూర్ద్యుర్ద్యులయో ద్యుమాన్ ॥ ౬౦॥

ద్యునిడ్గతిద్యుతిద్యూనస్థానదోషహరో ద్యుభుక్ ।
ద్యూతకృద్ద్యూతహృద్ద్యూతదోషహృద్ద్యూతదూరగః ॥ ౬౧॥

దృప్తో దృప్తార్దనో ద్యోస్థో ద్యోపాలో ద్యోనివాసకృత్ ।
ద్రావితారిర్ద్రావితాల్పమృత్యుర్ద్రావితకైతవః ॥ ౬౨॥

ద్యావాభూమిసంధిదర్శీ ద్యావాభూమిధరో ద్యుదృక్ ।
ద్యోకృద్ద్యోతహృద్ద్యోతీ ద్యోతాక్షో ద్యోతదీపనః ॥ ౬౩॥

ద్యోతమూలో ద్యోతితాత్మా ద్యోతోద్యౌర్ద్యోతితాఖిలః ।
ద్వయవాదిమతద్వేషీ ద్వయవాదిమతాన్తకః ॥ ౬౪॥

ద్వయవాదివిజయీ దీక్షాద్వయవాదినికృన్తనః ।
ద్వ్యష్టవర్షవయా ద్వ్యష్టనృపవంద్యో ద్విషట్క్రియః ॥ ౬౫॥

ద్విషత్కలానిధిర్ద్వీపిచర్మధృగ్ద్వ్యష్టజాతికృత్ ।
ద్వ్యష్టోపచారదయితో ద్వ్యష్టస్వరతనుర్ద్విభిత్ ॥ ౬౬॥

ద్వ్యక్షరాఖ్యో ద్వ్యష్టకోటిస్వజపీష్టార్థపూరకః ।
ద్విపాద్ద్వ్యాత్మా ద్విగుర్ద్వీశో ద్వ్యతీతో ద్విప్రకాశకః ॥ ౬౭॥

ద్వైతీభూతాత్మకో ద్వైధీభూతచిద్ద్వైధశామకః ।
ద్విసప్తభువనాధారో ద్విసప్తభువనేశ్వరః ॥ ౬౮॥

ద్విసప్తభువనాన్తస్థో ద్విసప్తభువనాత్మకః ।
ద్విసప్తలోకకర్తా ద్విసప్తలోకాధిపో ద్విపః ॥ ౬౯॥

ద్విసప్తవిద్యాభిజ్ఞో ద్విసప్తవిద్యాప్రకాశకః ।
ద్విసప్తవిద్యావిభవో ద్విసప్తేన్ద్రపదప్రదః ॥ ౭౦॥

ద్విసప్తమనుమాన్యశ్చ ద్విసప్తమనుపూజితః ।
ద్విసప్తమనుదేవో ద్విసప్తమన్వన్తరర్ధికృత్ ॥ ౭౧॥

ద్విచత్వారింశదుద్ధర్తా ద్విచత్వారికలాస్తుతః ।
ద్విస్తనీగోరసాస్పృగ్ద్విహాయనీపాలకో ద్విభుక్ ॥ ౭౨॥

ద్విసృష్టిర్ద్వివిధో ద్వీడ్యో ద్విపథో ద్విజధర్మకృత్ ।
ద్విజో ద్విజాతిమాన్యశ్చ ద్విజదేవో ద్విజాతికృత్ ॥ ౭౩॥

ద్విజప్రేష్ఠో ద్విజశ్రేష్ఠో ద్విజరాజసుభూషణః ।
ద్విజరాజాగ్రజో ద్విడ్ద్వీడ్ ద్విజాననసుభోజనః ॥ ౭౪॥

ద్విజాస్యో ద్విజభక్తో ద్విజాతిభృద్ద్విజసత్కృతః ।
ద్వివిధో ద్వ్యావృతిర్ద్వంద్వవారణో ద్విముఖాదనః ॥ ౭౫॥

ద్విజపాలో ద్విజగురుర్ద్విజరాజాసనో ద్విపాత్ ।
ద్విజిహ్వసూత్రో ద్విజిహ్వఫణఛత్రో ద్విజిహ్వభత్ ॥ ౭౬॥

ద్వాదశాత్మా ద్వాపరదృగ్ ద్వాదశాదిత్యరూపకః ।
ద్వాదశీశో ద్వాదశారచక్రధృగ్ ద్వాదశాక్షరః ॥ ౭౭॥

ద్వాదశీపారణో ద్వార్దశ్యచ్యో ద్వాదశ షడ్బలః ।
ద్వాసప్తతి సహస్రాఙ్గ నాడీగతి విచక్షణః ॥ ౭౮॥

ద్వంద్వదో ద్వంద్వదో ద్వంద్వబీభత్సో ద్వంద్వతాపనః ।
ద్వంద్వార్తిహృద్ ద్వంద్వసహో ద్వయా ద్వంద్వాతిగో ద్విగః ॥ ౭౯॥

ద్వారదో ద్వారవిద్ద్వాస్థో ద్వారధృగ్ ద్వారికాప్రియః ।
ద్వారకృద్ ద్వారగో ద్వారనిర్గమ క్రమ ముక్తిగః ॥ ౮౦॥

ద్వారభృద్ ద్వారనవకగతిసంసృతిదర్శకః ।
ద్వైమాతురో ద్వైతహీనో ద్వైతారణ్యవినోదనః ॥ ౮౧॥

ద్వైతాస్పృగ్ ద్వైతగో ద్వైతాద్వైతమార్గవిశారదః ।
దాతా దాతృప్రియో దావో దారుణో దారదాశనః ॥ ౮౨॥

దానదో దారువసతిర్దాస్యజ్ఞో దాససేవితః ।
దానప్రియో దానతోషో దానజ్ఞో దానవిగ్రహః ॥ ౮౩॥

దాస్యప్రియో దాసపాలో దాస్యదో దాసతోషణః ।
దావోష్ణహృద్ దాన్తసేవ్యో దాన్తజ్ఞో దాన్త వల్లభః ॥ ౮౪॥

దాతదోషో దాతకేశో దావచారీ చ దావపః ।
దాయకృద్దాయభుగ్ దారస్వీకారవిధిదర్శకః ॥ ౮౫॥

దారమాన్యో దారహీనో దారమేధిసుపూజితః ।
దానవాన్ దానవారాతిర్దానవాభిజనాన్తకః ॥ ౮౬॥

దామోదరో దామకరో దారస్నేహోతచేతనః ।
దార్వీలేపో దారమోహో దారికాకౌతుకాన్వితః ॥ ౮౭॥

దారికాదోద్ధారకశ్చ దాతదారుకసారథిః ।
దాహకృద్దాహశాన్తిజ్ఞో దాక్షాయణ్యధిదైవతః ॥ ౮౮॥

ద్రాంబీజో ద్రాంమనుర్దాన్తశాన్తోపరతవీక్షితః ।
దివ్యకృద్దివ్యవిద్దివ్యో దివిస్పృగ్ దివిజార్థదః ॥ ౮౯॥

దిక్పో దిక్పతిపో దిగ్విద్దిగన్తరలుఠద్యశః ।
దిగ్దర్శనకరో దిష్టో దిష్టాత్మా దిష్టభావనః ॥ ౯౦॥

దృష్టో దృష్టాన్తదో దృష్టాతిగో దృష్టాన్తవర్జితః ।
దిష్టం దిష్టపరిచ్ఛేదహీనో దిష్టనియామకః ॥ ౯౧॥

దిష్టాస్పృష్టగతిర్దిష్టేడ్దిష్టకృద్దిష్టచాలకః ।
దిష్టదాతా దిష్టహన్తా దుర్దిష్టఫలశామకః ॥ ౯౨॥

దిష్టవ్యాప్తజగద్దిష్టశంసకో దిష్టయత్నవాన్ ।
దితిప్రియో దితిస్తుత్యో దితిపూజ్యో దితీష్టదః ॥ ౯౩॥

దితిపాఖణ్డదావో దిగ్దినచర్యాపరాయణః ।
దిగమ్బరో దివ్యకాంతిర్దివ్యగంధోఽపి దివ్యభుక్ ॥ ౯౪॥

దివ్యభావో దీదివికృద్దోషహృద్దీప్తలోచనః ।
దీర్ఘజీవీ దీర్ఘదృష్టిర్దీర్ఘాఙ్గో దీర్ఘబాహుకః ॥ ౯౫॥

దీర్ఘశ్రవా దీర్ఘగతిర్దీర్ఘవక్షాశ్చ దీర్ఘపాత్ ।
దీనసేవ్యో దీనబన్ధుర్దీనపో దీపితాన్తరః ॥ ౯౬॥

దీనోద్ధర్తా దీప్తకాన్తిర్దీప్రక్షురసమాయనః ।
దీవ్యన్ దీక్షితసమ్పూజ్యో దీక్షాదో దీక్షితోత్తమః ॥ ౯౭॥

దీక్షణీయేష్టికృద్దీక్షాదీక్షాద్వయవిచక్షణః ।
దీక్షాశీ దీక్షితాన్నాశీ దీక్షాకృద్దీక్షితాదరః ॥ ౯౮॥

దీక్షితార్థ్యో దీక్షితాశో దీక్షితాభీష్టపూరకః ।
దీక్షాపటుర్దీక్షితాత్మా దీద్యద్దీక్షితగర్వహృత్ ॥ ౯౯॥

దుష్కర్మహా దుష్కృతజ్ఞో దుష్కృద్దుష్కృతిపావనః ।
దుష్కృత్సాక్షీ దుష్కృతహృత్ దుష్కృద్ధా దుష్కృదార్తిదః ॥ ౧౦౦॥

దుష్క్రియాన్తో దుష్కరకృద్ దుష్క్రియాఘనివారకః ।
దుష్కులత్యాజకో దుష్కృత్పావనో దుష్కులాన్తకః ॥ ౧౦౧॥

దుష్కులాఘహరో దుష్కృద్గతిదో దుష్కరక్రియః ।
దుష్కలఙ్కవినాశీ దుష్కోపో దుష్కణ్టకార్దనః ॥ ౧౦౨॥

దుష్కారీ దుష్కరతపా దుఃఖదో దుఃఖహేతుకః ।
దుఃఖత్రయహరో దుఃఖత్రయదో దుఃఖదుఃఖదః ॥ ౧౦౩॥

దుఃఖత్రయార్తివిద్ దుఃఖిపూజితో దుఃఖశామకః ।
దుఃఖహీనో దుఃఖహీనభక్తో దుఃఖవిశోధనః ॥ ౧౦౪॥

దుఃఖకృద్ దుఃఖదమనో దుఃఖితారిశ్చ దుఃఖనుత్ ।
దుఃఖాతిగో దుఃఖలహా దుఃఖేటార్తినివారణః ॥ ౧౦౫॥

దుఃఖేటదృష్టిదోషఘ్నో దుఃఖగారిష్టనాశకః ।
దుఃఖేచరదశార్తిఘ్నో దుష్టఖేటానుకూల్యకృత్ ॥ ౧౦౬॥

దుఃఖోదర్కాచ్ఛాదకో దుఃఖోదర్కగతిసూచకః ।
దుఃఖోదర్కార్థసన్త్యాగీ దుఃఖోదర్కార్థదోషదృక్ ॥ ౧౦౭॥

దుర్గా దుర్గార్తిహృద్ దుర్గీ దుర్గేశో దుర్గసంస్థితః ।
దుర్గమో దుర్గమగతిర్దుర్గారామశ్చ దుర్గభూః ॥ ౧౦౮॥

దుర్గానవకసమ్పూజ్యో దుర్గానవకసంస్తుతః ।
దుర్గభిద్ దుర్గతిర్దుర్గమార్గగో దుర్గమార్థదః ॥ ౧౦౯॥

దుర్గతిఘ్నో దుర్గతిదో దుర్గ్రహో దుర్గ్రహార్తిహృత్ ।
దుర్గ్రహావేశహృద్ దుష్టగ్రహనిగ్రహకారకః ॥ ౧౧౦॥

దుర్గ్రహోచ్చాటకో దుష్టగ్రహజిద్ దుర్గమాదరః ।
దుర్దృష్టిబాధాశమనో దుర్దృష్టిభయహాపకః ॥ ౧౧౧॥

దుర్గుణో దుర్గుణాతీతో దుర్గుణాతీతవల్లభః ।
దుర్గన్ధనాశో దుర్ఘాతో దుర్ఘటో దుర్ఘటక్రియః ॥ ౧౧౨॥

దుశ్చర్యో దుశ్చరిత్రారిర్దుశ్చికిత్స్యగదాన్తకః ।
దుశ్చిత్తాల్హాదకో దుశ్చిచ్ఛాస్తా దుశ్చేష్టశిక్షకః ॥ ౧౧౩॥

దుశ్చిన్తాశమనో దుశ్చిద్దుశ్ఛన్దవినివర్తకః ।
దుర్జయో దుర్జరో దుర్జిజ్జయీ దుర్జేయచిత్తజిత్ ॥ ౧౧౪॥

దుర్జాప్యహర్తా దుర్వార్తాశాన్తిర్దుర్జాతిదోషహృత్ ।
దుర్జనారిర్దుశ్చవనో దుర్జనప్రాన్తహాపకః ॥ ౧౧౫॥

దుర్జనార్తో దుర్జనార్తిహరో దుర్జలదోషహృత్ ।
దుర్జీవహా దుష్టహన్తా దుష్టార్తపరిపాలకః ॥ ౧౧౬॥

దుష్టవిద్రావణో దుష్టమార్గభిద్ దుష్టసంగహృత్ ।
దుర్జీవహత్యాసంతోషో దుర్జనాననకీలనః ॥ ౧౧౭॥

దుర్జీవవైరహృద్ దుష్టోచ్చాటకో దుస్తరోద్ధరః ।
దుష్టదణ్డో దుష్టఖణ్డో దుష్టధ్రుగ్ దుష్టముండనః ॥ ౧౧౮॥

దుష్టభావోపశమనో దుష్టవిద్ దుష్టశోధనః ।
దుస్తర్కహృద్ దుస్తర్కారిర్దుస్తాపపరిశాన్తికృత్ ॥ ౧౧౯॥

దుర్దైవహృద్ దున్దుభిఘ్నో దున్దుభ్యాఘాతహర్షకృత్ ।
దుర్ధీహరో దుర్నయహృద్దుఃపక్షిధ్వనిదోషహృత్ ॥ ౧౨౦॥

దుష్ప్రయోగోపశమనో దుష్ప్రతిగ్రహదోషహృత్ ।
దుర్బలాప్తో దుర్బోధాత్మా దుర్బన్ధచ్ఛిద్దురత్యయః ॥ ౧౨౧॥

దుర్బాధాహృద్ దుర్భయహృద్ దుర్భ్రమోపశమాత్మకః ।
దుర్భిక్షహృద్దుర్యశోహృద్ దురుత్పాతోపశామకః ॥ ౧౨౨॥

దుర్మన్త్రయన్త్రతన్త్రచ్ఛిద్ దుర్మిత్రపరితాపనః ।
దుర్యోగహృద్ దురాధర్పో దురారాధ్యో దురాసదః ॥ ౧౨౩॥

దురత్యయస్వమాయాబ్ధి తారకో దురవగ్రహః ।
దుర్లభో దుర్లభతమో దురాలాపాఘశామకః ॥ ౧౨౪॥

దుర్నామహృద్ దురాచారపావనో దురపోహనః ।
దురాశ్రమాఘహృద్దుర్గపథలభ్యచిదాత్మకః ॥ ౧౨౫॥

దురధ్వపారదో దుర్భుక్పావనో దురితార్తిహా ।
దురాశ్లేషాఘహర్తా దుర్మైథునైనోనిబర్హణః ॥ ౧౨౬॥

దురామయాన్తో దుర్వైరహర్తా దుర్వ్యసనాన్తకృత్ ।
దుఃసహో దుఃశకునహృద్ దుఃశీలపరివర్తనః ॥ ౧౨౭॥

దుఃశోకహృద్ దుఃశఽగ్కాహృద్దుఃసఙ్గభయవారణః ।
దుఃసహాభో దుఃసహదృగ్దుఃస్వప్నభయనాశనః ॥ ౧౨౮॥

దుఃసంగదోషసఽజ్జాతదుర్మనీషావిశోధనః ।
దుఃసఙ్గిపాపదహనో దుఃక్షణాఘనివర్తనః ॥ ౧౨౯॥

దుఃక్షేత్రపావనో దుఃక్షుద్ భయహృద్దుఃక్షయార్తిహృత్ ।
దుఃక్షత్రహృచ్చ దుర్జ్ఞేయో దుర్జ్ఞానపరిశోధనః ॥ ౧౩౦॥

దూతో దూతేరకో దూతప్రియో దూరశ్చ దూరదృక్ ।
దూనచిత్తాల్హాదకశ్చ దూర్వాభో దూష్యపావనః ॥ ౧౩౧॥

దేదీప్యమాననయనో దేవో దేదీప్యమానభః ।
దేదీప్యమానరదనో దేశ్యో దేదీప్యమానధీః ॥ ౧౩౨॥

దేవేష్టో దేవగో దేవీ దేవతా దేవతార్చితః ।
దేవమాతృప్రియో దేవపాలకో దేవవర్ధకః ॥ ౧౩౩॥

దేవమాన్యో దేవవన్ద్యో దేవలోకప్రియంవదః ।
దేవారిష్టహరో దేవాభీష్టదో దేవతాత్మకః ॥ ౧౩౪॥

దేవభక్తప్రియో దేవహోతా దేవకులాదృతః ।
దేవతన్తుర్దేవసమ్పద్దేవద్రోహిసుశిక్షకః ॥ ౧౩౫॥

దేవాత్మకో దేవమయో దేవపూర్వశ్చ దేవభూః ।
దేవమార్గప్రదో దేవశిక్షకో దేవగర్వహృత్ ॥ ౧౩౬॥

దేవమార్గాన్తరాయఘ్నో దేవయజ్ఞాదిధర్మధృక్ ।
దేవపక్షీ దేవసాక్షీ దేవదేవేశభాస్కరః ॥ ౧౩౭॥

దేవారాతిహరో దేవదూతో దైవతదైవతః ।
దేవభీతిహరో దేవగేయో దేవహవిర్భుజః ॥ ౧౩౮॥

దేవశ్రావ్యో దేవదృశ్యో దేవర్ణీ దేవభోగ్యభుక్ ।
దేవీశో దేవ్యభీష్టార్థో దేవీడ్యో దేవ్యభీష్టకృత్ ॥ ౧౩౯॥

దేవీప్రియో దేవకీజో దేశికో దేశికార్చితః ।
దేశికేడ్యో దేశికాత్మా దేవమాతృకదేశపః ॥ ౧౪౦॥

దేహకృద్దేహధృగ్దేహీ దేహగో దేహభావనః ।
దేహపో దేహదో దేహచతుష్టయవిహారకృత్ ॥ ౧౪౧॥

దేహీతిప్రార్థనీయశ్చ దేహబీజనికృన్తనః ।
దేవనాస్పృగ్దేవనకృద్దేహాస్పృగ్దేహభావనః ॥ ౧౪౨॥

దేవదత్తో దేవదేవో దేహాతీతోఽపి దేహభృత్ ।
దేహదేవాలయో దేహాసఙ్గో దేహరథేష్టగః ॥ ౧౪౩॥

దేహధర్మా దేహకర్మా దేహసంబన్ధపాలకః ।
దేయాత్మా దేయవిద్దేశాపరిచ్ఛిన్నశ్చ దేశకృత్ ॥ ౧౪౪॥

దేశపో దేశవాన్ దేశీ దేశజ్ఞో దేశికాగమః ।
దేశభాషాపరిజ్ఞానీ దేశభూర్దేశపావనః ॥ ౧౪౫॥

దేశ్యపూజ్యో దేవకృతోపసర్గనివర్తకః ।
దివిషద్విహితావర్షాతివృష్ట్యాదీతిశామకః ॥ ౧౪౬॥

దైవీగాయత్రికాజాపీ దైవసమ్పత్తిపాలకః ।
దైవీసమ్పత్తిసమ్పన్నముక్తికృద్దైవభావగః ॥ ౧౪౭॥

దైవసమ్పత్త్యసమ్పన్నఛాయాస్పృగ్దైత్యభావహృత్ ।
దైవదో దైవఫలదో దైవాదిత్రిక్రియేశ్వరః ॥ ౧౪౮॥

దైవానుమోదనో దైన్యహరో దైవజ్ఞదేవతః ।
దైవజ్ఞో దైవవిత్పూజ్యో దైవికో దైన్యకారణః ॥ ౧౪౯॥

దైన్యాఞ్జనహృతస్తంభో దోషత్రయశమప్రదః ।
దోషహర్తా దైవభిషగ్దోషదో దోర్ద్వయాన్వితః ॥ ౧౫౦॥

దోషజ్ఞో దోహదాశంసీ దోగ్ధా దోష్యన్తితోషితః ।
దౌరాత్మ్యదూరో దౌరాత్మ్యహృద్దౌరాత్మ్యార్తిశాన్తికృత్ ॥ ౧౫౧॥

దౌరాత్మ్యదోషసంహర్తా దౌరాత్మ్యపరిశోధనః ।
దౌర్మనస్యహరో దౌత్యకృద్దౌత్యోపాస్తశక్తికః ॥ ౧౫౨॥

దౌర్భాగ్యదోఽపి దౌర్భాగ్యహృద్దౌర్భాగ్యార్తిశాన్తికృత్ ।
దౌష్ట్యత్రో దౌష్కుల్యదోషహృద్దౌష్కుల్యాధిశామకః ॥ ౧౫౩॥

దందశూకపరిష్కారో దందశూకకృతాయుధః ।
దన్తిచర్మపరిధానో దన్తురో దన్తురారిహృత్ ॥ ౧౫౪॥

దన్తురఘ్నో దణ్డధారీ దణ్డనీతిప్రకాశకః ।
దాంపత్యార్థప్రదో దంర్పత్యచ్యో దంపత్యభీష్టదః ॥ ౧౫౫॥

దంపతిద్వేషశమనో దంపతిప్రీతివర్ధనః ।
దన్తోలూఖలకో దంష్ట్రీ దన్త్యాస్యో దన్తిపూర్వగః ॥ ౧౫౬॥

దంభోలిభృద్దంభహర్తా దండ్యవిద్దంశవారణః ।
దన్ద్రమ్యమాణశరణో దన్త్యశ్వరథపత్తిదః ॥ ౧౫౭॥

దన్ద్రమ్యమాణలోకార్తికరో దణ్డ త్రయాశ్రితః ।
దణ్డపాణ్యర్చపద్దణ్డి వాసుదేవస్తుతోఽవతు ॥ ౧౫౮॥

ఇతి శ్రీమద్దకారాది దత్తనామ సహస్రకం ।
పఠతాం శృణ్వతాం వాపి పరానన్దపదప్రదమ్ ॥ ౧౫౯॥

              ॥ ఇతి ॥

Tuesday, March 31, 2020

పెదిమలు తగిలే పద్యం


పెదిమలు తగిలే పద్యం

సాహితీమిత్రులారా!

- వర్గాక్షరాలు అంటే ప,ఫ,బ,భ,మ - మరియు
అంతస్థానాలలో- , అచ్చుల్లో - ఉ,ఊ - మరియు
కంఠోష్ట్యాలు - ఒ,ఓ,ఔ - లు వీటిని ఓష్ఠ్యాలు అంటాము.
వీటితో కూర్చబడే పద్యాన్ని లేదే శ్లోకాన్ని
(స + ఓష్ఠ్యం) సోష్ఠ్యం అంటాము.
ఇవి కేవలం పెదిమలతో మాత్రమే పలుకబడతాయి.
కాణాదం పెద్దన సోమయాజి గారి ఆధ్యాత్మరామాయణ
అరణ్యకాండలోని 431వ పద్యం ఇది చూడండి.

భూమాప్రేమ సుభావ గోపయువ సుభ్రూ విభ్రమా విద్భవ
వ్యామోహారు విభావ భావ భవ భావ ప్రాప్త భానూద్భవా
భూమీ పార్శ్వ భవద్రుమ ప్రభ శుభాంభో భృద్విభావైభవా
సోమక్ష్మాప వరోపభావ్య విభవ స్తోమా బహుప్రాభవా!

ఈ పద్యంలో పైన మనం చెప్పుకున్న వాటినుండే
కూర్చబడినదిగా గమనించగలము.
దీనిలో ర, స - అనే హల్లులు ఓష్ఠ్యాలు కాదు
కాని వాటికి చేరిన అచ్చులు ఓష్ఠ్యాలుగా గమనించాలి.

Saturday, March 28, 2020

రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడా?రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడా?

సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూచి అర్థం తెలుసుకొన ప్రయత్నించండి.

సమరే హేమరేఖాంకమ్ బాణం ముంచతి రాఘవే
న రావణోపి ముముచే మధ్యే రీతి ధరం శరమ్

యుద్ధంలో రాముడు సువర్ణ రేఖాంకితమైన
బాణాన్ని వదలగా (ప్రయోగించగా)
ఆ రావణుడూ మధ్యలో
ఇత్తడి బాణమును విడిచెను - అని భావం

ఇది సరైనదేనా?  రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడు
ఇదేమి విశేషం ఇది కాదు
బాగా ఆలోచించాలి.
దీనిలోని గమ్మత్తు ఏమిటంటే
మధ్యే రీతి ధరం శరమ్ అంటే రీ కారము మధ్యలోగల శరం అంటే శరీరం -
శరీరం - లో
రీ మధ్యలో ఉంది
అంటే రావణుడు శరీరం వదిలాడు - ఇది సరైన భావం.

Thursday, March 26, 2020

దవడలు తాకని పద్యం


దవడలు తాకని పద్యం
సాహితీమిత్రులారా!

అక్షరముల ఉత్పత్తి స్థానమును బట్టి
కంఠము, తాలువు, మూర్దము, దంతము, ఓష్ఠము అని ఐదు
విధములని తెలుసుకొని ఉన్నాము.
వీటిలో కేవలము కంఠస్థానమున పుట్టెడి అక్షరములతో
పద్యం కూర్చిన అది కంఠ్యము అని,
ఒకవేళ కంఠస్థానమున ఉత్పత్తి అయ్యే అక్షరములను వదలి
మిగిలిన వాటితో పద్యం కూర్చిన కంఠ్యములు లేనిది
నిష్కంఠ్యము అని పిలువబడుచున్నది.
అలాగే తాలువులతో కూర్చిన తాల్యము అని,
తాలువులతో కాక మిగిలిన వాటితో కూర్చిన (దవడలు తాకని)
నిస్తాలవ్యమని అందురు.
మరి, తాలువు = దవుడ, దవుడ నుండి పుట్టేవాటిని తాలువులు అంటారు.
తాలువులయందు పుట్టు అక్షరములు - ఇ-వర్ణము(స్వరము),
చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము ఇవి తాలవ్యములు.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం కూర్చిన అది నిస్తాలవ్యము.

ఉదాహరణ గమనిద్దాం-
స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బుర:
మేఘనాదో2థ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
                                                                              (సరస్వతీకంఠాభరణము -2-268)

(ప్రకాశించుచున్న కర్ణభూషణరత్న సమూహమనెడి
హరివిల్లుచేత పొడలుగలిగినవాడై సంగ్రామమునందు మేఘనాధుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము వలె ప్రకాశించెను.)
(ప్రావృట్టు = వర్షర్తువు)

ఈ శ్లోకంలో పై చెప్పిన అక్షరాలు ఉన్నాయేమో? గమనించండి.
ఉంటే భోజమహారాజును నిలదీద్దాం.
ఆ అక్షరాలు మరొక్కసారి చూస్తారా- ఇవే
ఇ-వర్ణము(స్వరము), చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము.

Monday, March 23, 2020

అత్వం (ఏకస్వర పద్యం)


అత్వం (ఏకస్వర పద్యం)
సాహితీమిత్రులారా!


ఏదైనా ఒక స్వరము(అచ్చు)ను
మాత్రమే తీసుకొని పద్యమంతటనూ
ఉపయోగించిన దానిని ఏకస్వర చిత్రమంటారు

ఈ దిగువ పద్యంలో అ - మాత్రమే తీసుకొని కూర్చబడినది
దీన్ని అత్వం అని కూడ అంటారు  చూడండి-

కమలచరణభజనకలనన సఫలత
సకలసంపదమలసద్మ మలర
రమ్యతరకళత్రరతమహ మమరంగ
తనయతనయతనయజనన మరయ
                                                     (ఆంధ్ర లక్ష్మీసహస్రము - 22-32)

ఈ పద్యంలో అ - అనే అచ్చుమాత్రమే
ఉపయోగించబడినది గమనించగలరు.

Wednesday, March 18, 2020

ఇటు చదివితే ఒక అర్థం అటు చదివితే మరొకటి


ఇటు చదివితే ఒక అర్థం అటు చదివితే మరొకటి
సాహితీమిత్రులారా!

ఒక పద్యాన్ని మామూలుగా చదివితే
దాన్ని అనులోమ పద్యం అంటాం.
అదే పద్యాన్ని చివరనుండి మొదటికి
చదివిన ప్రతిలోమమవుతుంది
అంటే మరొక పద్యం అవుతుంది.
అర్థం కూడా వేరౌతుంది
లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.

అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం -
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

ఈ విధంగా భావం మారిపోతున్నది.

Monday, March 16, 2020

ఎన్నిరకాల మామయో?ఎన్నిరకాల మామయో?సాహితీమిత్రులారా!

విచిత్రమైన చమత్కార ప్రార్థన.
ఇందులో ఎంత మంది మామలున్నారో
చూడండి.మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా
మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై
మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యె డున్


1. కంసుడనే మామను చంపి,

2. సముద్రుడనేమామకు గర్వమణచి(రామావతారంలో)

3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు 
     అని ఒక అర్థం)

4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,

5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)

6. రతీదేవికి తానే మామయై,

7. సముద్రుడు విష్ణువుకు మామ,

8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,

అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక!

Saturday, March 14, 2020

"దామోదర రదమోదా" (పాదభ్రమక పద్యం)


"దామోదర రదమోదా" (పాదభ్రమక పద్యం)


సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేదా శ్లోకం లోని పాదాలు మొదటినుండి
చివరకు చదివినా చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని పాదభ్రమకం అంటాం.
పాదభ్రమకానికి ఉదాహరణగా  ఈ  పద్యం చూడండి-
ఇది "విక్రాల శేషాచార్యు"లవారి
"శ్రీవేంకటేశ్వరచిత్రరత్నాకరం" ఉత్తర భాగంలోనిది.

దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూమతతమ భూతత మాభూ

ఇది ప్రతి పాదం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది గమనించండి -

(ర - జంకును, ద - ఖండించువాడా, మోదా - ఆనంద స్వరూపుడా
తత - విస్తృతమైన, రా - బంగారు కలవాడా, తత - అధకమైన,
మా - బుద్ధికి, రా - శాలయైనవాడా, రామా - లక్ష్మి వలన, జని - పుట్టుక కల, నిజ - నిత్యుడైన, మారా - కాముడు కలవాడా, భూమా - విరాట్ స్వరూపుడా, తత - పెద్దదియగు, భూ - భూదేవికి, మతతమ - మిక్కిలి ప్రియుడా, భూ - భూమివలె, తత - గొప్పదియగు, మా - లక్ష్మికి, భూ - స్థానమైనవాడా, దామోదర, జయ - జయించుము.)

Thursday, March 12, 2020

యాదవరాఘవీయ విలోమకావ్యం


యాదవరాఘవీయ విలోమకావ్యం
సాహితీమిత్రులారా!


వేంకటాధ్వరి కృత యాదవరాఘవీయం విలోమకావ్యం
అంటే ముందు నుండి (మామూలుగా) చదివితే
యదుకులభూషణుడైన కృష్ణుని కథను
అదే చివరనుండి చదివితే రామచంద్రునికథ
వచ్చేవిధంగా వ్రాయబడిన కావ్యం ఇది.
ఇందులో కేవలం 30 శ్లోకాలే ఉన్నాయి.
వీటికి విలోమము కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది
ఆస్వాదించగలరు.


వందేఽహం దేవం తం శ్రీతం రన్తారం కాలం భాసా యః ।
రామో రామాధీరాప్యాగో లీలామారాయోధ్యే వాసే ॥ ౧॥

విలోమమ్
సేవాధ్యేయో రామాలాలీ గోప్యారాధీ మారామోరాః ।
యస్సాభాలంకారం తారం తం శ్రీతం వన్దేఽహం దేవమ్ ॥ ౧॥

సాకేతాఖ్యా జ్యాయామాసీద్యావిప్రాదీప్తార్యాధారా ।
పూరాజీతాదేవాద్యావిశ్వాసాగ్ర్యాసావాశారావా ॥ ౨॥

విలోమమ్
వారాశావాసాగ్ర్యా సాశ్వావిద్యావాదేతాజీరాపూః ।
రాధార్యప్తా దీప్రావిద్యాసీమాయాజ్యాఖ్యాతాకేసా ॥ ౨॥

కామభారస్స్థలసారశ్రీసౌధాసౌఘనవాపికా ।
సారసారవపీనాసరాగాకారసుభూరుభూః ॥ ౩॥

విలోమమ్
భూరిభూసురకాగారాసనాపీవరసారసా ।
కాపివానఘసౌధాసౌ శ్రీరసాలస్థభామకా ॥ ౩॥

రామధామసమానేనమాగోరోధనమాసతామ్ ।
నామహామక్షరరసం తారాభాస్తు న వేద యా ॥ ౪॥

విలోమమ్
యాదవేనస్తుభారాతాసంరరక్షమహామనాః ।
తాం సమానధరోగోమాననేమాసమధామరాః ॥ ౪॥

యన్ గాధేయో యోగీ రాగీ వైతానే సౌమ్యే సౌఖ్యేసౌ ।
తం ఖ్యాతం శీతం స్ఫీతం భీమానామాశ్రీహాతా త్రాతమ్ ॥ ౫॥

విలోమమ్
తం త్రాతాహాశ్రీమానామాభీతం స్ఫీత్తం శీతం ఖ్యాతం  ।
సౌఖ్యే సౌమ్యేసౌ నేతా వై గీరాగీయో యోధేగాయన్ ॥ ౫॥

మారమం సుకుమారాభం రసాజాపనృతాశ్రితం ।
కావిరామదలాపాగోసమావామతరానతే ॥ ౬॥

విలోమమ్
తేన రాతమవామాస గోపాలాదమరావికా ।
తం శ్రితానృపజాసారంభ రామాకుసుమం రమా ॥ ౬॥

రామనామా సదా ఖేదభావే దయా-
వానతాపీనతేజారిపావనతే ।
కాదిమోదాసహాతాస్వభాసారసా-
మేసుగోరేణుకాగాత్రజే భూరుమే ॥ ౭॥

విలోమమ్
మేరుభూజేత్రగాకాణురేగోసుమే-
సారసా భాస్వతాహాసదామోదికా ।
తేన వా పారిజాతేన పీతా నవా
యాదవే భాదఖేదాసమానామరా ॥ ౭॥

సారసాసమధాతాక్షిభూమ్నాధామసు సీతయా ।
సాధ్వసావిహరేమేక్షేమ్యరమాసురసారహా ॥ ౮॥

విలోమమ్
హారసారసుమారమ్యక్షేమేరేహవిసాధ్వసా ।
యాతసీసుమధామ్నాభూక్షితాధామససారసా ॥ ౮॥

సాగసాభరతాయేభమాభాతామన్యుమత్తయా ।
సాత్రమధ్యమయాతాపేపోతాయాధిగతారసా ॥ ౯॥

విలోమమ్
సారతాగధియాతాపోపేతాయామధ్యమత్రసా ।
యాత్తమన్యుమతాభామా భయేతారభసాగసా ॥ ౯॥

తానవాదపకోమాభారామేకాననదాససా ।
యాలతావృద్ధసేవాకాకైకేయీమహదాహహ ॥ ౧౦॥

విలోమమ్
హహదాహమయీకేకైకావాసేద్ధ్వృతాలయా ।
సాసదాననకామేరాభామాకోపదవానతా ॥ ౧౦॥

వరమానదసత్యాసహ్రీతపిత్రాదరాదహో ।
భాస్వరస్థిరధీరోపహారోరావనగామ్యసౌ ॥ ౧౧॥

విలోమమ్
సౌమ్యగానవరారోహాపరోధీరస్స్థిరస్వభాః ।
హోదరాదత్రాపితహ్రీసత్యాసదనమారవా ॥ ౧౧॥

యానయానఘధీతాదా రసాయాస్తనయాదవే ।
సాగతాహివియాతాహ్రీసతాపానకిలోనభా ॥ ౧౨॥

విలోమమ్
భానలోకినపాతాసహ్రీతాయావిహితాగసా ।
వేదయానస్తయాసారదాతాధీఘనయానయా ॥ ౧౨॥

రాగిరాధుతిగర్వాదారదాహోమహసాహహ ।
యానగాతభరద్వాజమాయాసీదమగాహినః ॥ ౧౩॥

విలోమమ్
నోహిగామదసీయామాజద్వారభతగానయా ।
హహ సాహమహోదారదార్వాగతిధురాగిరా ॥ ౧౩॥

యాతురాజిదభాభారం ద్యాం వమారుతగన్ధగమ్ ।
సోగమారపదం యక్షతుంగాభోనఘయాత్రయా ॥ ౧౪॥

విలోమమ్
యాత్రయాఘనభోగాతుం క్షయదం పరమాగసః ।
గన్ధగంతరుమావద్యం రంభాభాదజిరా తు యా ॥ ౧౪॥

దణ్డకాం ప్రదమోరాజాల్యాహతామయకారిహా ।
ససమానవతానేనోభోగ్యాభోనతదాసన ॥ ౧౫॥

విలోమమ్
నసదాతనభోగ్యాభో నోనేతావనమాస సః ।
హారికాయమతాహల్యాజారామోదప్రకాణ్డదమ్ ॥ ౧౫॥

సోరమారదనజ్ఞానోవేదేరాకణ్ఠకుంభజమ్ ।
తం ద్రుసారపటోనాగానానాదోషవిరాధహా ॥ ౧౬॥

విలోమమ్
హాధరావిషదోనానాగానాటోపరసాద్రుతమ్ ।
జమ్భకుణ్ఠకరాదేవేనోజ్ఞానదరమారసః ॥ ౧౬॥

సాగమాకరపాతాహాకంకేనావనతోహిసః ।
న సమానర్దమారామాలంకారాజస్వసా రతమ్ ॥ ౧౭॥

విలోమమ్
తం రసాస్వజరాకాలంమారామార్దనమాసన ।
సహితోనవనాకేకం హాతాపారకమాగసా ॥ ౧౭॥

తాం స గోరమదోశ్రీదో విగ్రామసదరోతత ।
వైరమాసపలాహారా వినాసా రవివంశకే ॥ ౧౮॥

విలోమమ్
కేశవం విరసానావిరాహాలాపసమారవైః ।
తతరోదసమగ్రావిదోశ్రీదోమరగోసతామ్ ॥ ౧౮॥

గోద్యుగోమస్వమాయోభూదశ్రీగఖరసేనయా ।
సహసాహవధారోవికలోరాజదరాతిహా ॥ ౧౯॥

విలోమమ్
హాతిరాదజరాలోకవిరోధావహసాహస ।
యానసేరఖగశ్రీద భూయోమాస్వమగోద్యుగః ॥ ౧౯॥

హతపాపచయేహేయో లంకేశోయమసారధీః ।
రాజిరావిరతేరాపోహాహాహంగ్రహమారఘః ॥ ౨౦॥

విలోమమ్
ఘోరమాహగ్రహంహాహాపోరాతేరవిరాజిరాః ।
ధీరసామయశోకేలం యో హేయే చ పపాత హ ॥ ౨౦॥

తాటకేయలవాదేనోహారీహారిగిరాసమః ।
హాసహాయజనాసీతానాప్తేనాదమనాభువి ॥ ౨౧॥

విలోమమ్
విభునామదనాప్తేనాతాసీనాజయహాసహా ।
ససరాగిరిహారీహానోదేవాలయకేటతా ॥ ౨౧॥

భారమాకుదశాకేనాశరాధీకుహకేనహా ।
చారుధీవనపాలోక్యా వైదేహీమహితాహృతా ॥ ౨౨॥

విలోమమ్
తాహృతాహిమహీదేవ్యైక్యాలోపానవధీరుచా ।
హానకేహకుధీరాశానాకేశాదకుమారభాః ॥ ౨౨॥

హారితోయదభోరామావియోగేనఘవాయుజః ।
తంరుమామహితోపేతామోదోసారజ్ఞరామయః ॥ ౨౩॥

విలోమమ్
యోమరాజ్ఞరసాదోమోతాపేతోహిమమారుతమ్ ।
జోయువాఘనగేయోవిమారాభోదయతోరిహా ॥ ౨౩॥

భానుభానుతభావామాసదామోదపరోహతం ।
తంహతామరసాభక్షోతిరాతాకృతవాసవిమ్ ॥ ౨౪॥

విలోమమ్
వింసవాతకృతారాతిక్షోభాసారమతాహతం ।
తం హరోపదమోదాసమావాభాతనుభానుభాః ॥ ౨౪॥

హంసజారుద్ధబలజాపరోదారసుభాజిని ।
రాజిరావణరక్షోరవిఘాతాయరమారయమ్ ॥ ౨౫॥

విలోమమ్
యం రమారయతాఘావిరక్షోరణవరాజిరా ।
నిజభాసురదారోపజాలబద్ధరుజాసహమ్ ॥ ౨౫॥

సాగరాతిగమాభాతినాకేశోసురమాసహః ।
తంసమారుతజంగోప్తాభాదాసాద్యగతోగజమ్ ॥ ౨౬॥

విలోమమ్
జంగతోగద్యసాదాభాప్తాగోజంతరుమాసతం ।
హస్సమారసుశోకేనాతిభామాగతిరాగసా ॥ ౨౬॥

వీరవానరసేనస్య త్రాతాభాదవతా హి సః ।
తోయధావరిగోయాదస్యయతోనవసేతునా ॥ ౨౭॥

విలోమమ్
నాతుసేవనతోయస్యదయాగోరివధాయతః ।
సహితావదభాతాత్రాస్యనసేరనవారవీ ॥ ౨౭॥

హారిసాహసలంకేనాసుభేదీమహితోహిసః ।
చారుభూతనుజోరామోరమారాధయదార్తిహా ॥ ౨౮॥

విలోమమ్
హార్తిదాయధరామారమోరాజోనుతభూరుచా ।
సహితోహిమదీభేసునాకేలంసహసారిహా ॥ ౨౮॥

నాలికేరసుభాకారాగారాసౌసురసాపికా ।
రావణారిక్షమేరాపూరాభేజే హి ననామునా ॥ ౨౯॥

విలోమమ్
నామునానహిజేభేరాపూరామేక్షరిణావరా ।
కాపిసారసుసౌరాగారాకాభాసురకేలినా ॥ ౨౯॥

సాగ్ర్యతామరసాగారామక్షామాఘనభారగౌః ॥
నిజదేపరజిత్యాస శ్రీరామే సుగరాజభా ॥ ౩౦॥

విలోమమ్
భాజరాగసుమేరాశ్రీసత్యాజిరపదేజని ।
గౌరభానఘమాక్షామరాగాసారమతాగ్ర్యసా ॥ ౩౦॥

॥ ఇతి శ్రీవేఙ్కటాధ్వరికృతం శ్రీరాఘవయాదవీయం సమాప్తమ్ ॥

Monday, March 9, 2020

సీతారావణ సంవాదం


సీతారావణ సంవాదం
సాహితీమిత్రులారా!


చిత్రమీమాంసలోని చ్యుతాక్షర శ్లోకం
ఇది చ్యుతాక్షర చిత్రానికి ఉదాహరణగా ఇవ్వబడినది.

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఇందులో సీతా రావణ సంవాదం ఉంది.

రావణుడు -  భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
                   స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
                   ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
(అరటిస్తంభాల వంటి ఊరువులు గల
ఓ సీతా! ఇపుడు దేవతల ముఖాలు వాడిపోతాయి.
లక్ష్మణసహితుడైన ఆ రాముడు యుద్ధంలో నా ఎదుట నిలబడలేడు.
ఇప్పుడీ వానరసేన గొప్ప ఆపద పొందగలదు.)
సీత - లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
     (ఓ నీచుడా! దీనినే ఏడవ అక్షరం తొలగించి మళ్ళీ చదువు)
మూడు పాదాలలోని ఏడవ అక్షరాలు తీసివేయగా

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
మొదటి పాదం (భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా)లో -
                            దశవదనగ్లాని:(రావణుని లేదా పది ముఖాల గ్లాని
                            (శ్రమముచేత కలిగిన దౌర్బల్యము))
రెండవ పాదం (స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:)లో -
                            రామ: స్థాతా యుధి(రాముడు యుద్ధంలో నిలబడతాడు)
మూడవ పాదం(ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:)లో
                      - ఉచ్చై: పదమ్ (ఉన్నతస్థితిని)
                      అనే అర్థాలున్న పదాలు ఏర్పడ్డాయి.
దీనిలో రావణుడు అనుకున్న వాటికి విరుద్ధంగా వచ్చాయి.

Saturday, March 7, 2020

చరకాష్టకమ్


చరకాష్టకమ్
సాహితీమిత్రులారా!

మంగిడిపూడి వేంకటశర్మగారి
చరకాష్టకమ్ తిలకించండి-
ఇది ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1925
నుండి -Thursday, March 5, 2020

పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం


పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం
సాహితీమిత్రులారా!

ఓష్ఠ్యములు అంటే పెదిమలు తగిలే విధంగా పలికే అక్షరాలు
అంటే పెదవుల నుండి పుట్టే అక్షరాలు.
 వీటితోను నాలుకతాకు లేకుండా కూర్చిన పద్యం ఇది.
"ఆయలూరు కందాళయార్య" విరచిత
"అలంకారశిరోభూషణే "
శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.
చూడండి నాలుక కదులుతుందేమో!

భవభామా భావగాహ బహుభామా మవాభవ
మమ భోభవభూమావ భవభూపా వభూమహ 

(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో
ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా
శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!
నన్ను రక్షించు)

Tuesday, March 3, 2020

జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు


జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు 
సాహితీమిత్రులారా!


సమస్య - 
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

 సింహాద్రి శ్రీరంగం గారి పూరణ -
సారములేని సంసరణ సాగర మియ్యదటంచు నెంచి, సం
సారము తోడ మెట్లు వరుసన్ తరియించుచు కొండలయ్య! మా
భారము నీవె కావు మని పల్కుచు కోవెలచేరి యందు పూ
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

పూరణలో జారులకు గాక పూజారులకు వందనం చేశారనటంతో
సమస్య తొలగిపోయింది కదా

Sunday, March 1, 2020

చిత్రకావ్య కౌతుకమ్


చిత్రకావ్య కౌతుకమ్
సాహితీమిత్రులారా!

రామరూప్ పాఠక్ సంస్కృతభాషలో పేరుపొందిన కవి. సంస్కృత సాహిత్యాన్ని, భారతచరిత్ర సంస్కృతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి రామరూప్ పాఠక్. ఈయన 1891లో బీహార్ లోని షహాబాద్ లో మంచి చదువు సంస్కారం ఉన్న కుటుంబంలో జన్మించారు.
చిత్రకావ్య కౌతుకమ్ కు 1967లో సాహిత్య అకాడమీ అవార్డు
లభించింది. చిత్రకవిత్వ విధానంలో చేసిన ప్రయోగాలకు ఈ పుస్తకం పేరుపొందింది. ఆధునికయుగంలో చిత్రకావ్య వైతాళికుడుగా కీర్తిని పొందాడు పాఠక్.  చిత్రకవిత్వంలో అంతకు ముందున్న గ్రంథాలకన్న
అభివ్యక్తిలోనూ, ఇతివృత్తం విషయంలోనూ విశిష్టమైనదిగా విమర్శకుల మన్ననలు పొందింది. ఈ గ్రంథంలో 55 రకాల చిత్రబంధాలున్నాయి.
ఈ గ్రంథంలో మూడు ఖండాలున్నాయి. మొదటి ఖండంలో చిత్రకావ్య భూమికను, రెండవ ఖండంలో చిత్రకావ్య మూల గ్రంథాలను గురించి వివరిస్తూ 55 బంధాలను వివరించారు. మూడవ ఖండంలో రెండు అనుబంధాలున్నాయి. వాటిలో మొదటి అనుబంధంలో పాఠక్ కృత
లఘుకృతులు ఇచ్చాడు. రెండవ ఖండంలో సమస్యాపూరణలు కూర్చారు.
ఇక్కడ బంధం గమనించండి-