Tuesday, January 17, 2017

ఏకాక్షర నిఘంటువు - 44


ఏకాక్షర నిఘంటువు - 44




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ఘః - శివుడు, ఎండ, మొలనూలు, దెబ్బ

ఘట్ - ఏదో ఒక కార్యములో నిమగ్నుడగుట,
                  ప్రయత్నముచేయుట, కలుపుట,
                  కూర్చుట, తెచ్చుట

ఘట్ట్ - కదల్చుట, ఊపుట,తాకుట, రుద్దుట

ఘస్ - తిను, మింగు

ఘృ - అంతటను చల్లుట, తడుపుట

ఘృష్ - పొడి చేయు, పోటీపడు

ఘ్రా - వాసన చూచు, ముద్దు పెట్టుకొను

న్యఙ్ - పొట్టిది, లోతైనది

ప్రాక్ - (తూర్పు)దిక్కును తెలిపేది, దేశాన్ని తెలిపేది,
                      కాలాన్ని తెలిపేది

రుక్ - కాంతి, ప్రకాశం, కోరిక

ఙమ్ - పిల్లనగ్రోవి శబ్దము, కాటుక, స్థిరము

ఙః - భైరవుడు, భయము, దేశము


 - అదియే, అదియు ఇదియు, అలాగైతే, నిశ్చయము,
          కారణము, తుల్యయోగము, మరల అనుట

చమ్ - నెత్తురు, త్రాగుట, ఆచమనము చేయుట, తినుట

No comments: