ఏకాక్షర నిఘంటువు - 37
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........
ఐ - స్మృతి, ఆకలింతకుతెచ్చునది, పిలుచుట,
మీ ఇష్టమని చెప్పుట, బిందులేనివాగ్భవబీజము
కట్ - పోవు, కప్పివేయు, ప్రకాశించు, చూపు,
ప్రదర్శించు, అవతరించు
కంఠ్ - దుఃఖించు, పోగొట్టుకొను,
తీవ్రముగా కోరు, గుర్తించు
కత్థ్ - పొగడుకొను, స్తోత్రముచేయు
కథ్ - చెప్పుట, వెల్లడిచేయుట, మాటలాడుట,
తెలుపుట, చూపుట, వివరించుట
కర్ణ్ - చీల్చుట, విసిగించుట, వినుట
కల్ - లెక్కించు, ధ్వనించు, భరించు, మోయు,
తీసుకొను, తెలిసికొను, ఆలోచించు,
అనుభవించు, అనుషించిపోవు, ఆధారపడు
కవ్ - స్తోత్రముచేయుట, వర్ణించుట, రచించుట, చిత్రించుట.
కష్ - రాయుట, పరీక్షించుట, ప్రయత్నించుట,
ఒరిపిడి రాతిపై గీయుట
కస్ - కదలు, పోవు, చేరు, తొలగించు
కమ్ - కోరుట
No comments:
Post a Comment