Friday, December 30, 2022

శక్తి బంధం(తమిళ్)

 శక్తి బంధం(తమిళ్)




సాహితీమిత్రులారా!

శక్తి బంధం(తమిళ్)ను

ఆస్వాదించండి-



Wednesday, December 28, 2022

శ్రీరామకథ - చిత్రకవిత్వం

 శ్రీరామకథ -  చిత్రకవిత్వం




సాహితీమిత్రులారా!


శ్రీరామకథ -  చిత్రకవిత్వంలో  సంస్కృతాంధ్ర రచనలు.

 శ్రీరామాయణగాథ ప్రభావం

 సాహిత్యప్రక్రియ లన్నిటిపై  ఉందనడం సత్యదూరం  కాదు. 

ప్రస్తుతం రామాయణ సంబంధిత రచనలలో

చిత్రకవిత్వం విలసిల్లిన రచనలను నామ మాత్రంగ స్మరిద్దాం-

               శ్రీ మద్వాల్మీకి రామాయణం

యుద్ధకాండలో-----

శ్లో.మండలాని విచిత్రణి

                          స్థానానివివిధానిచ,

   గోమూత్రికాదిచిత్రాణి

                      గతప్రత్యాగతాని చ.

            - వా.రా.యుద్ధకాం,౪౦-౨౮

అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశేషంవలె  

సైన్యం యుద్ధం చేసినారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

  వివిధకవిపండితులురామాయణాన్ని

సంస్కృతంలో చిత్రకవనంలో రచించినారు. ఆ  పేర్లు ----

కవిపేరు                      చిత్రరచనపేరు

వేంకటేశ్వర         --రామయమకార్ణవః

వేంకటేశ               --రామచంద్రోదయం

గోపాలార్య           --రామచంద్రోదయం

కృష్ణమోహన        --రామలీలామృతం

శ్రీకాంత                       --రఘూదయం 

చిదంబరకవి        -శబ్దార్థచింతామణిః

వేంకటాధ్వరి     --రాఘవయాదవీయం

దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం

శ్రీకాంత                     --రఘూదయం

నారాణభట్ట     --నిరనునాసికచమ్పూః

మల్లికార్జున     --నిరోష్ఠ్యరామాయణం

వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ 

ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ

చిదమ్బరకవి  -పంచకల్యాణచమ్పూః

సన్ధ్యాకరనన్దినః           --రామచరితం 

          "   -రాఘవయాదవపాణ్డవీయం

వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ

వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం

వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ

కృష్ణకవి    --క్రియాగోపనరామాయణం

కృష్ణరాయ        --ఆర్యాలంకారశతకం

వీరరాఘవ      --విశేషణరామాయణం

రామభద్ర                 --రామస్తవప్రాసః

నిట్టలఉపమాక}

వేంకటేశ్వర      } -రామాయణసంగ్రహః

భాస్కరసూరి.           --సీతారామీయం

సుబ్రహ్మణ్యసూరి        --రామావతారః

సుబ్రహ్మణ్యసూరి      --సీతాకల్యాణం

సుబ్రహ్మణ్యసూరి-రామాయణడోలగీత

           ,,        -ఆసేచనకరామాయణం

వేంకటేశవామన   --రామచన్ద్రోదయం

ముడుమ్బై వేంకట    }రామచన్ద్ర-

రామనరసింహాచార్య}  కథామృతం

డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామ

                                       బాణస్తవః

 - ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి.

---------------------------------------

తెలుగుచిత్రకవనం-రామాయణం:

దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- -మరింగంటిసింగరాచార్య

శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరిం గంటి సింగరాచార్యులు

నిరోష్ఠ్యసీతాకల్యాణం   --పిడుపర్తి బసప్ప

నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య

నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి  రామన

శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం--    పోడూరి పెదరామామాత్య

నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక  పేరయకవి

నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి

అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర --హనుమంతరాయశర్మ

నిర్వచనభారతగర్భరామాయణం--  రావిపాటిలక్ష్మీనారాయణ

    మొదలయినవి ప్రసిద్ధమైనవి

            

      వైద్యంవేంకటేశ్వరాచార్యులువారి సౌజన్యంతో

Monday, December 26, 2022

నామగోపనచిత్రం

నామగోపనచిత్రం




సాహితీమిత్రులారా!


 గణపవరపు వేఃకటకవిగారు రచించిన  ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం 

చిత్రకవిత్వకళావిలాసమందిరం  ఈ కావ్యంలో ఉన్నంత చిత్రకవిత్వం

భారతీయభాషలలోనిమరేకావ్యంలోనూ  లేదని  ఈ కావ్యం గురించి పరిశో

ధించి డాక్టరేట్ పట్టా పొందిన మాన్య ఆత్మీయులు డా.ఏల్చూరిమురళీధర

రావుగారి మాట.    ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసాన్ని   నా   విద్యార్థి దశనుంచి

చదువుతున్నాను.కారణం నాకున్నూ చిత్రకవిత్వం మీద.మక్కువ ఎక్కువ

కనుకనే.     చిత్రకవిత్వంలో నామగోపనచిత్రం అనేది ఉంది.  అంటే, పద్యంలో ఒక

పద్ధతిగ,కవి తాననుకున్న  ఒక పేరును గోప్యంగ ఉండే విధంగ పద్యరచన చే

స్తాడు.ఉదాహరణకు గణపవరపువేం కటకవి రచించిన నామగోపన పద్యా లలో ఒకటి----


.భువనజఠర!జయసన్నుత!

  గవాధిపా!ధన్యకలిత-కారుణ్య!రమా

  ధవ!పరమపురుష!తీవ్ర రి

  పువిపాలమహోవిశాలా!భుజగధరప తీ!

  ఈ పద్యం వేంటేశ్వరస్తుత్యాత్మకం.

అర్థం తెలుసు కుందాం----

భువనజఠర=సమస్తలోకాలనూకడుపులో ఉంచుకున్న విశ్వరూపా!జయ

సన్నుత=జయ అంటే మహాభారతం,

మహాభారతంలో పొగడబడినవాడా!

గవాధిపా=భూదేవీనాయకా!,ధన్యకలి

త కారుణ్యా!=నిన్ను ఆశ్రయించిన ధన్యులయందు కరుణగలవాడా,రమా

ధవా=సిరిమగడా!,పరమపురుష!=పు

రుషోత్తమా,తీవ్ర=తీవరించిన,రిపు=శ

త్రువులను,విపాల=మట్టుపెట్టే,మహః

విశాల!=అధికపరాక్రమంకలవాడా!,భు

జగధరపతీ= శేషశైలమందు  వెలసిన

స్వామీ!  

      పద్యంలో ఏడుకొండల స్వామికి ప్రతీకలుగా ------

భువనజఠర!

జయసన్నుత!

గవాధిపా!

ధన్యకలితకారుణ్యా!

రమాధవా!

పరమపురుష!

తీవ్రరిపు విపాలమహోవిశాల!

అంటూ ఏడు సంబోధనలు ఉన్నాయి.

ఆ ఏడు సంబోధనలలోని తొలి అక్షరా

లను వరుసగా కూర్చితే ---

భు-జ-గ-ధ-ర-ప-తీ! అనే పేరు ఉంటుంది.ఇదే నామగోపనం.

ఈ నామమే  పద్యం చివరన సంబోధ నాత్మక మకుటంగా కూడ ఉంది.

           వేంకటపతయేనమః

          స్వామిపేరు&కవిపేరు

వైద్యం వేంకటెశ్వరాచార్యుల వారి సౌజన్యంతో 

Saturday, December 24, 2022

మహానాగ బంధం

 మహానాగ బంధం



సాహితీమిత్రులారా!

డా. ఏల్చూరి మురళీధరరావుగారు

కూర్చిన   చిత్రభారతము కావ్యం 

భీష్మపర్వము నుండి

మహానాగ బంధం గమనించండి-


సీ. శ్రీమహావిష్ణుని సిద్ధసంకల్పు స

                   ర్వంసహానన్తర్ధవర్ధమాను

     మానుతు ధర్ము ధర్మాధ్యక్షు నందనం

                   దాదిత్యు గోవిందు నావిలాసు

     వాసవు సత్యు నిర్వాణు సాణుశ్రీశు

                   భాను చలాచలమానవిశ్వ

     శాశ్వతైకవ్యాస సాధ్యర్తు గోప్త గ

                   దాధరు ధన్యదు ధామ సామ

గీ. శ్రీరమేశుని సువ్యాసు శ్రీనిలయు ని

     యుక్తు సుశ్రద్ధధానతాసక్తు దిశు మ

     హామఖాధ్యక్షు వాయువాహను సురమ్యు

     భక్తభద్రదు ప్రేముడిన్ ముక్తి గనుమ

బంధం-



Thursday, December 22, 2022

ఆశుకవితపై మొహం మొత్తిందా - 2

 ఆశుకవితపై మొహం మొత్తిందా - 2




సాహితీమిత్రులారా!



సావిత్రీ పరిణయ కర్త

దంతుర్తి దత్తాత్రేయకవి

గ్రంథ పీఠికలో కూర్చిన

ఆశుకవితా నిరసన పద్యాలు

గమనించండి-


నిరలంకృతియునునవరస

వరపాక ప్రక్రియానివారిత శయ్యా

విరహ కృతినాథహీనము

ధరనాశుకవిత దనరు విధవ కాంతవలెన్


ఆశుకవితయందు హావభావాదులు

శ్లేషకల్పనలును జేరకుంట

జేసి కవుల శక్తి వాసి దొలంగును

నటుల గామి గీర్తి యధిక మగును


ఆశుకవిత్వంబందున

సౌశబ్ద్యంబుండదెపుడు సభలో దానన్

బ్రాశస్త్యహాని గలుగదె

యీశసముండైన వానికెప్పుడు భువిలోన్


ఆలోచించని కవనం

బాలోచించంగవలయు నందఱు విబుధుల్

ఆలోచించిన కవనం

బాలోచించంగవలయు నాలోచించన్


స్వవనము కవనము కవులకు

సువిచారత కలిగెనేని శోధింపంగన్

స్వవనము స్వవనము కవులకు

సువిచారత కలిగెనేని శోధించంగన్


రసము లేనట్టి కవిత వ్యర్థంబుగాదె

ఫలము రీతిని గూపంబు పగిది గాను

రసము కలిగిన సుకవిత(ప్రాభవమ్ము)

గలిగియుండును ధరణి శ్లాఘ్యంబు గాదె


మండనమిశ్రునియంతటి

పండితవరునకు(ని)యతియె భంగంబయ్యెన్

కుండలిపతులా మఱి యా 

ఖండలగురులా దలప కవు లాధునికుల్


Tuesday, December 20, 2022

తాలువులతో పలకని పద్యం

 తాలువులతో పలకని పద్యం




సాహితీమిత్రులారా!

మహాకవి మాఘుడు కూర్చిన

శిశుపాలవధమ్(మాఘకావ్యం) లోని

తాలువు(దవడ)లతో పలకని పద్యం

గమనించండి-




Tuesday, December 13, 2022

వృక్ష బంధం

 వృక్ష బంధం




సాహితీమిత్రులారా!

రామరూపపాఠక్ గారి

చిత్రకావ్య కౌతుకమ్ లోని

వృక్షబంధం గమనించండి-







Sunday, December 11, 2022

పద్యభ్రమకం

 పద్యభ్రమకం




సాహితీమిత్రులారా!

పద్యం మొదటి నుండి చదివినా చివరనుండి చదివినా ఒకలాగే ఉంటే 

దాన్ని అనులోమ విలోమపద్యం లేక పద్యభ్రమకం అంటాము. ఇక్కడ

నంది తిమ్మన పారిజాతాపహరణంలోను పద్యభ్రమకం గమనించండి

పద్యం మొదటి నుండి చదివినా చివరనుండి చదివినా ఒకలాగా ఉంది 

గమనించగలరు-




Thursday, December 8, 2022

యేకఫణి నాగబంధం

 యేకఫణి నాగబంధం




సాహితీమిత్రులారా!

యేకఫణి నాగబంధం

శ్రీపన్నాల సీతారామబ్రహ్మశాస్త్రిగారి

అభినవ గద్య ప్రబంధం 

చివరి పుట పై వ్రాయబడినది

గమనించగలరు-







Tuesday, December 6, 2022

శిష్టు కృష్ణమూర్తి కంకణ బంధం రామాయణం

 శిష్టు కృష్ణమూర్తి కంకణ బంధం రామాయణం




సాహితీమిత్రులారా!

శిష్టు కృష్ణమూర్తి గారి

కంకణ బంధం రామాయణం

గమనించండి-



Sunday, December 4, 2022

118 ఛందస్సులతో సీసగర్భ యాదాద్రి నరసింహ శతకం

 118 ఛందస్సులతో సీసగర్భ యాదాద్రి నరసింహ శతకం




సాహితీమిత్రులారా!

శ్రీ చింతా రామకృష్ణరావుగారి

గర్భచిత్రశతకం

యాదాద్రి నరసింహ శతకం

దీనిలో 118 రకాల ఛందస్సులతో

108 సీసగర్భ పద్యాలతో కూర్చబడినది

దీన్ని గురించి పత్రికలో వచ్చిన క్లిప్పింగ్

గమనించండి-




Friday, December 2, 2022

నంది బంధం

 నంది బంధం




సాహితీమిత్రులారా!

రామరూప పాఠక్ గారి

చిత్రకావ్య కౌతుకమ్ లోని

నంది బంధం గమనించండి-