ఏకాక్షర నిఘంటువు - 52
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
దభ్ / దంభ్ - గాయపరచుట, దెబ్బతీయుట, మోసగించుట
దయ్ - దయచూపుట, ప్రేమించుట, రక్షించుట
దా - ఇచ్చుట, కోయు, నఱకు, సమర్పించు, విడిచిపెట్టు,
ఉంచు, నాటు, పెండ్లిచేయు
దివ్ - స్వర్గము, ఆకాశము, దినము, వెలుగు, ప్రకాశించుట,
విసరుట, జూదమాడుట, పాచికలు వేయుట,
పరిహాసమాడుట, పందెమువేయుట, అమ్ముట, పొగడుట,
సంతోషించుట, ఉన్మత్తుడగుట
దిశ్ - దిక్కు, పది, చూపుట, నిర్దేశించుట, ప్రదర్శించుట,
అప్పగించుట, ఇచ్చుట, అంగీకరించుట, ఆజ్ఞాపించుట,
అనుమతించుట
దిహ్ - పూయుట, రుద్దుట, వ్యాపించుట,
అపవిత్రముచేయుట
దీక్ష్ - ఆచార నియమముకై పూనుకొనుట
దీప్ - ప్రకాశించుట, వెలుగుట, మండుట, కోపముచే
మండిపడుట, ప్రసిద్ధుడగుట
దుః - కాల్చుట, దహించుట, బాధించుట, పీడితుడగుట
దూ - బాధపడుట
దృ - ఆదరించుట, సమ్మానించుట, పూజించుట
దృప్ - ప్రకాశింపచేయు, వెలిగించు, ప్రజ్వలింపచేయు,
గర్వించు, క్రూరుడగు
దే - రక్షించు, పెంచు
దేవ్ - ఆడు, జూదమాడు, దుఃఖించు, ప్రకాశించు
No comments:
Post a Comment