నీ విభుని చక్కని పేరు వచింపుమన్న
సాహితీమిత్రులారా!
ఒక లజ్జావతి తన భర్త పేరును
ఎంత తెలివిగా చెప్పిందో చూడండి-
సరసిజనేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న ఆ
పరమ పతివ్రతామణియు భావమునం ఘనమై సిగ్గునన్
కరియును రక్కసుండు హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
బరయగ వీనిలోని నడిమక్కరముల్ గణుతింప పేరగున్
ఆ లజ్జావతి చెప్పిన పదములలోని
మధ్యనున్న అక్షరాలను తీసుకొని
కలిపిన తన భర్తపేరు వస్తుందట-
అవి అలాగే తీసుకుంటే అందులో చిత్రమేమి ఉంటుంది-
వాటిని ఈవిధంగా మూడు అక్షరాల పదాలుగా మార్చాలి
కరి - ద్విరద
రక్కసుడు - అఘుడు
హరుకార్ముకము - పినాకం
శరము - సాయకం
అద్దము - మకురం
శుకం - చిలుక
ద్విరదం, అఘుడు, పినాకం, సాయకం, ముకురం, చిలుక
వీటిలోని మధ్య అక్షరాలు తీసుకొంటే
రఘునాయకులు అని వస్తుంది.
అది ఆవిడ భర్తపేరు.
ఇందులో ఆవిడ భర్తపేరు
గోపనం చేసినందువల్ల
ఇది గూఢచిత్రం అవుతుంది.
No comments:
Post a Comment