ఏకాక్షర నిఘంటువు - 41
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ఖం - అలంబు వృక్షము, లేకపోవుట
ఖ - బుద్ధి
ఖచ్ - బయటకు వచ్చుట, అగపడుట, మరల పుట్టుట,
పవిత్రముచేయుట, ముడివేయుట, కట్టుట
ఖజ్ - చిలుకుట, కలచుట
ఖండ్ - ముక్కలు చేయు, చీల్చు, పూర్తిగా ఓడించు,
నాశముచేయు, తొలగించు, నిరాశ కలిగించు,
విఘ్నము కలిగించు, మోసగించు
ఖన్ - త్రవ్వుట
ఖాత్ - తినుట, మ్రింగుట, కొఱకుట
ఖిద్ - దెబ్బతీయుట, లాగుట, కష్టము కలిగించుట,
పీడింపబడుట, దుఃఖితుడగట, అలయుట
ఖేల్ - కదల్చుట, ఇటు అటు రాకపోకలు చేయుట,
వణకుట, ఆడు
ఖ్యా - చెప్పు, వెల్లడించు
గం- గణపతి, గణపతి బీజము,
సర్వవిఘ్నాలను అణచే శక్తిగల బీజము
గణ్ - లెక్కించు, పరిగణించు, కూడు, గౌరవించు, భావించు
గద్ - స్పష్టముగా పలుకుట, చెప్పుట, లెక్కించుట
No comments:
Post a Comment