Wednesday, January 11, 2017

గోమద్గోభవ గోయుగో వినత గోహస్తాది


గోమద్గోభవ గోయుగో వినత గోహస్తాది




సాహితీమిత్రులారా!



శబ్దచిత్రంలోని ఈ చిత్రం చూడండి-
దీనికి నానార్థశబ్దచిత్రమని పేరు
దీన్ని పాలంకి బ్రహ్మసోమయాజిగారు
రచించారు-

గోమద్గోభవ గోయుగో వినత గోహస్తాది గోపాలకో
గో జా రాధిత పాద గోజ యుగళో గోరాశి జాగో ప్రియః
గోభిర్మర్దిత గోపివైరి తరుణీ గోవిభ్రమో గోప్రదో
గోపీ గోనిచయైక గోస్థల తను ర్గోపాలకః పాతువః

గోమత్ - సూర్యుడు, గోభవ - చంద్రుడు,
గోయుగః - నేత్రద్వయముగా కలవాడు,
వినత - వినమ్రులయిన, గోహస్తారి -
వజ్రాయుధము చేతియందుగల ఇంద్రుడు
మొదలైన, గోపాలకః - దిక్పాలకులు కలవాడు,
గో2జారాధిత - వాణీబ్రహ్మలచేత పూజింపబడిన,
పాదగోజ యుగళః - చరణ కమలముల జంటకలవాడు,
గోరాశి జా - సముద్రము నుండి పుట్టిన లక్ష్మికి,
గోప్రియః - భూదేవికి కూడ ప్రియమైన వాడు,
గోభిః - బాణములతో, మర్దిత - అణచబడిన,
గోవిభ్రమః - నేత్రవిలాసములు గలవాడు,
గోప్రదః - స్వర్గాన్నిచ్చేవాడు, గోపీ పోనిచయ -
గోపికల, గోవుల యొక్క సమూహము,
గోస్థలి తనుః - నేత్ర కిరణాల స్థలము
శరీరముగా కలవాడు అయిన,
గోపాలకః - శ్రీకృష్ణుడు,
వః - మిమ్ములను,
పాతు - రక్షించుగాక

గోః  -  సూర్య, వృషభ, చంద్ర, స్వర్గ, వజ్ర, జల, కేశ, కిరణ, దృక్, బాణ, వాక్, భూ, దిక్, ధేనువు -లు నానార్థాలు.
ఇందులో గో శబ్దానికిగల నానార్థాలను చాల వరకు ఉపయోగించడం వలన దీనికి నానార్థశబ్దచిత్రం గా పిలువ బడుతున్నది.

No comments: