Sunday, January 1, 2017

కస్త్వం బాల? బలానుజః


కస్త్వం బాల? బలానుజః




సాహితీమిత్రులారా!


లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతంలోని
ఈ సంవాద చిత్రం చూడండి.
ఇది గోపికకు బాలకృష్ణునికి
మధ్యజరిగిన సంవాదం

కస్త్వం బాల బలానుజః కిమిహతే మన్మన్దిరాశఙ్కాయా
యుక్తం తన్నవనీతపాత్రవివరే హస్తం కిమర్థం న్యసేః,
మాతః కఞ్చన వత్సకం మృగయితుం మాగా విషాదం క్షణా
ది త్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః



గోపిక - కస్త్వం బాల?(ఎవరు నీవు?)

బాలకృష్ణుడు - బలానుజః (బలరాముని తమ్ముని)

గో- కిమిహతే? (ఇక్కడ ఏమిపని?)

బా.కృ- మన్మన్దిరాశఙ్కయా(మాయిల్లనుకొని భ్రమతో వచ్చాను)

గో- యుక్తం తన్నవనీత పాత్రేవివహే హస్తం కిమర్థం న్యసేః
       ( అదిసరే  వెన్న కుండలో చేయెందుకు పెట్టావు)

బా.కృ.- మాతః కఞ్చన వత్సకం మృగయితుం 
              (మా దూడ ఒకటి తప్పి పోయినది- అది ఈ బానలో 
               ఉందేమో నని వెదకుచున్నాను)
              మాగా విషాదం క్షణాద్
              (కొంచెం సేపు ఊరకుండు పోతానులే)

ఇత్యేవం వరవల్లనీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః!
ఈవిధంగా గొల్లపడుచుకు జవాబులిచ్చు 
కృష్ణుడు మమ్ములను రక్షించుగాక!

No comments: