Monday, January 2, 2017

గరితకు తన తండ్రివలన గర్భంబయ్యెన్


గరితకు తన తండ్రివలన గర్భంబయ్యెన్




సాహితీమిత్రులారా!


సమస్య -
గరితకు తన తండ్రివలన గర్భంబయ్యెన్

గద్వాల ప్రభువు రామభూపాలుని సమక్షంలో
కార్యమపూడి రాజమన్నారు కవి పూరణ-

వర పుత్రఫలము పతి తన
తరుణికి నీ మరచి ఆత్మ తనయకు నొసగన్
మురియుచు భక్షింపగ ఆ
గరితకు తన తండ్రివలన గర్భంబయ్యెన్

సందర్భాన్ని కథాపూరణద్వారా సమస్యపూరణ
జరిగింది. తండ్రివలన గర్భంకాదు
తండ్రి ఇచ్చిన ఫలం వలన గర్భం అనే
దానివల్ల అనుచితము ఉచితంగా మారింది.



మీరునూ మరోరకంగా పూరించి పంపగలరు.

No comments: