Saturday, January 7, 2017

వానిసుతు, వాని యమిత్రుని, వాని మిత్రునిన్


వానిసుతు, వాని యమిత్రుని, వాని మిత్రునిన్




సాహితీమిత్రులారా!

క్రీ.శ. 14వ శతాబ్దంలో కొండవీటి ప్రభువైన కుమారగిరి రెడ్డికి మంత్రిగా
ఉండిన కాటయ వేమన మీద చెప్పిన గూఢచిత్ర పద్యం చూడండి-

మానుష దానమాన బలమానిత ధర్మరమా మనోజ్ఞరే
ఖానుభూతి విత్తముల కాటయవేమన పోలు వాసవిన్
వానివిరోధి, వానివిభు, వాని విపక్షుని, వాని యగ్రజున్
వాని మరంది, వానిసుతు, వాని యమిత్రుని, వాని మిత్రునిన్

కాటయవామన పరాక్రమంలో, దానగుణంలో, అభిమానంలో,
బలంలో, ధర్మగుణంలో, సౌందర్యంలో, లక్ష్మీపతిత్వంలో,
ఐశ్వర్యంలో, ధనసంపదలో వరుసగా అర్జునునితో, కర్ణునితో,
దుర్యోధనునితో, భీమునితో, ధర్మరాజుతో, కృష్ణునితో,
మన్మథునితో, శివునితో, కుబేరునితో సమానుడుగా
పోల్చదగి ఉన్నాడు - అని భావం.

అంటే
కాటయవేమన పరాక్రమంలో అర్జునునితో,
దానగుణంలో కర్ణునితో, అభిమానంలో దుర్యోధనునితో,
బలంలో భీమునితో, ధర్మగుణంలో ధర్మరాజుతో,
సౌందర్యంలో మన్మథునితో, లక్ష్మీపతిత్వంలో కృష్ణునితో,
ఐశ్వర్యంలో శివునితో, ధనసంపదలో కుబేరునితో సమానంగా
 పోల్చదగినవాడు అని అర్థం.


No comments: