Thursday, January 12, 2017

ఏకాక్షర నిఘంటువు - 39


ఏకాక్షర నిఘంటువు - 39




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



కృత్ - చేయువాడు, ముక్కలుచేయుట,
                 ముక్కలుచేసి విసరివేయుట, నాశము చేయుట

కృశ్ - క్షీణించుట, దుర్బలుడగుట

కౄ - విసరుట, వెదజల్లుట, నింపుట

కౄత్ - చెప్పుట, పిలుచుట, స్తోత్రముచేయుట

క్ఌప్ - తగియుండుట, ప్రకాశింపజేయుట, ఉత్పత్తిచేయుట,
                    సఫలుడగుట, స్థిరపరచుట, పంచుట, ఆలోచనచేయుట

కః -  ముడి, రాజు

కౌ - భూమియందు, వీరిద్దరెవరు(అనుట)

క్రమ్ - పోవుట, నడచుట, సమీపించుట, దాటిపోవు, ఎక్కు,
                 అతిక్రమించు, అతిశయించు.

క్రుధ్ - కోపించు, కోపము

క్లమ్ - అలసిపోవుట, వాడిపోవుట, భూమి, వృక్షము

క్షి - నివాసము

క్లిద్ - తడిసినది

క్లిశ్ - దుఃఖితుడగుట, కష్టముపొందుట

క్వ - ఎక్కడ

క్వథ్ - కాచు, వెచ్చజేయు, జీర్ణము చేసుకొను




No comments: