Thursday, January 5, 2017

ఏకాక్షర నిఘంటువు - 32


ఏకాక్షర నిఘంటువు - 32



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ద్మా - ధ్వనించుట, అగ్నితో కలియుట

ధృ - ధరించుట, పట్టుకొనుట

ధ్యై - ధ్యానించుట

న - నిషేధించుట, సామ్యము

ని - గృహము, మిక్కిలి, క్రిందగుట, ఉంచుట, రాశి,
         ఆధారము, కట్టుట, మోక్షము, దానము, చూచుట,
         అణగుట, సమీపము, నేర్పు, చాలించుట, శాశ్వతము,
         సందేహము, నింద

ను - ప్రశ్న, సంశయార్థము, గడచినది, ఊఱట, ఊహ,
            అవమానము, మిష, అవాంతరార్థకల్పన, అతిక్రమించు,
            అడుగుట

నఞ్ - లేదు అడ్డగింత, స్వరూపము, అతిక్రమము,
                   కొంచెము, సామ్యము, విరోధము, ఇతరము

నభ్ - చంపుట

నమ్ - వంకరతిరుగుట, వంగుట, శబ్దము చేయుట

నయ్ - తీసుకొని వచ్చుట

No comments: