అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే
సాహితీమిత్రులారా!
సమస్య -
అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే
బాపట్ల వేంకట పార్థసారథిగారి పూరణ -
కొందరు వ్యక్తి గొప్పని - కొందరు సంస్థయె మిన్నటంచు నిం
కొందరు ఆత్మతత్వమని - కొందరు బుద్ధి వికాసమంద్రు వీ
రందర గూర్చువాడు పరమాత్మయటంచు దలంపరక్కటా
అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే
లోకంలోని విధానాన్ని తీసుకొని
పూరించారు కవిగారు
అర్థవంతంగా ఉందికదా
ఈ సమస్య చాలకాలం నాటిది
దీనికి అనేక పూరణలున్నాయి.
మీరూ మరోవిధంగా పూరించి పంపగలరు
No comments:
Post a Comment