Wednesday, November 30, 2022

నాగపాశ బంధం

 నాగపాశ బంధం




సాహితీమిత్రులారా!

అజితసేనుని 

అలంకార చింతామణి లోని

నాగపాశ బంధం గమనించండి-



Monday, November 28, 2022

ఘంటాశతావధానం

 ఘంటాశతావధానం





సాహితీమిత్రులారా!


శతఘంటావధానం అంటె ఒక గంటలో

నూరు శ్లోకాలను ఆశువుగా చెప్పడం

ఇది జరిగిన సంఘటన గురించి చెప్పిన విషయం-

బాలసరస్వతి_

   శ్రీమాన్ తిరుమల బుక్కపత్తనం

       _*శ్రీనివాసాచార్యులవారు*_

           *ఘంటాశతావధానం*

           అంశం:వజ్రనాభచరితం

      స్థలం:గ్రంథాలయం,ప్రొద్దుటూరు

                   తేది 08-9-1901

                    సభాధ్యక్షులు  సి.సుబ్రహ్మణ్య అయ్యర్ బి.ఎ;బి.ఎల్

                 డిస్ట్రిక్ట్ మున్సిఫ్

                         .....

విశిష్ట అతిథి:ధన్నవాడరాఘవాచార్య

సంస్కృతపాఠశాలా ప్రధానోపాధ్యాయ

                      .....

ప్రారంభం--

శ్లో.అస్తిపురీ సురనగరీ

       పరిహాసకరీ గరీయసీ విభవై,

       వజ్రపురీతి ప్రథితా

       ధరాతరుణ్యా విభూషణం కిమపి.

         ...    ....   ....    ....   ....    ...

         ...    ....    ....    .....     .....

ముగింపు---

   శ్లో.ఇతిచతురతానాం- ప్రొద్దుటూరు స్థితానాం

          సదసి సపది దత్తం- కించిదాలంబ్యవృత్తం,

          శతమతనుత పద్యా- న్యేకఘంటాంతరాళే

           నిపుణఫణితి సాంద్ర- శ్శ్రీనివాసః కవీన్రః.

 సమ్పూర్ణమిదమనుష్టుప్ సంఖ్యాయా

        శతసంఖ్యాకశ్లోక ఘటితం

           *వజ్రనాభఘంటాశతమ్*

                           .....

 BrahmaSri Srinivasa chaetulu, Pandit  of  ATMKUR SAMSTHA NAM, 

NijamsDominions known as BALASARASTI and GHANTA SATA  PADYA GRANDHA NIRMATA  was pleased to under-

take  to compose  a  hundred Stanzas  in  an  hour, and  at a Meeting of the Elite Productie On  8th September 1901 in the Reading room, he  composed Extempore   in  elegant  and scholarly  Sanskrit in the Arya- metre the stipulated number of Slokam that was  proposed  by Audience. It was a rare intellectual treat :and it gives me much pleasure  to announce the fact.

     C.Subramanya Aiyar B.A,B.L;

                         District Munsiff,

                                  Proddutur.

             President,reading room,

                                    Proddutur.

                         ______

ప్రొద్దుటూరునగరస్థ  సంస్కృత  పాఠ శాలా ప్రధానోపాధ్యాయ శ్రీమద్ధన్నవాడ

రాఘవాచార్య విరచితౌ ప్రశంసాశ్లోకౌ.

శ్లో.శ్రీశైలవంశ కలశోదధి పూర్ణచన్ద్ర

   శ్శ్రీవాసదేశికమణిర్విబుధాగ్రగణ్యః,

   శ్రీప్రొద్దుటూరునగరేవిదుషాంసమాజే

   ఘంటాశతం వ్యరచయ న్నిరవద్య

                                         పద్యమ్.

శ్లో.ప్రచురరసవికాసా-సాధ్వలంకారవృత్తి

స్సురుచిరసమరీతి-సద్గుణాక్రాన్తమూర్తిః,

విషయభృశమనోజ్ఞా-లాల్యతేమౌళినాసౌ

కృతిరఖిలసుదృగ్భి-ర్మల్లికామాలికేవ.

                         -------

  చెన్నపురీ మధ్య విద్యోతమానాయాం  ఆనందముద్రాక్షరశాలాయాం

    సమ్ముద్ర్య ప్రకాశితా విజయతాం  శోభకృద్వైశాఖ శు.పంచమి.

       మద్రాసు లైబ్రరిలో పూర్తిగా నకలు  చేసుకున్నవారు,

           ప్రస్తుతం సమర్పించినవారు:

           వైద్యంవేంకటేశ్వరాచార్యులు

Saturday, November 26, 2022

తువిధ నాగబంధం

 తువిధ నాగబంధం




సాహితీమిత్రులారా!

తమిళంలో 

తువిద అంటే ద్వివిధ అని

ఇక్కడ (ద్వివిధ నాగబంధం)

తువిధ నాగబంధం గమనించండి-



Thursday, November 24, 2022

అర్థపాదావృత్తిప్రతిలోమము

 అర్థపాదావృత్తిప్రతిలోమము




సాహితీమిత్రులారా!



వేదుల సూర్యనారాయణ శర్మ  గారు కూర్చిన

లక్ష్మీసహస్రకావ్యము లోని

అర్థపాదావృత్తిప్రతిలోమము గమనించండి

ఇందులో అర్థపాదాన్ని ప్రతిలోమంగా చదివితే

పాదం పూర్తవుతుంది అనగా మిగిలిన పాదమవుతుంది.

గమనించండి-



Tuesday, November 22, 2022

శ్రీకరవృత్తగర్భ చంద్రశేఖరవృత్తము

 శ్రీకరవృత్తగర్భ చంద్రశేఖరవృత్తము




సాహితీమిత్రులారా!


కొక్కొండ వెంకటరత్నంగారి

బిలేశ్వరీయము నుండి

శ్రీకరవృత్తగర్భ చంద్రశేఖరవృత్తము

గమనించండి-





Sunday, November 20, 2022

గోపుర బంధం

 గోపుర బంధం

సాహితీమిత్రులారా! నాదెండ్ల పురుషోత్తమకవి కృత చిత్రకందపద్యరత్నాకరంలో గోపుర బంధం గమనించండి-


Friday, November 18, 2022

రథ బంధం

 రథ బంధం




సాహితీమిత్రులారా!

తమిళంలోని

రథబంధాన్ని

గమనించండి-



Wednesday, November 16, 2022

మయూర బంధం

 మయూర బంధం




సాహితీమిత్రులారా!

తమిళంలోని

మయూర బంధం

గమనించండి-



Monday, November 14, 2022

నాగ బంధం

 నాగ బంధం




సాహితీమిత్రులారా!

విద్యానాథుని ప్రతాపరుద్రీయంలోని

నాగబంధం గమనించండి-






Saturday, November 12, 2022

మాలికాబంధం

 మాలికాబంధం




సాహితీమిత్రులారా!

విద్వాన్ కల్లూరి వెంటసుబ్రహ్మణ్య దీక్షింతులు గారి

శ్రీభాగవత మాహాత్మ్యము 

షష్ఠమ ఆశ్వాసంలోని

మాలికాబంధం 

గమనించండి-






Thursday, November 10, 2022

పంచపాషాణాలలోని ఒక పద్యం

 పంచపాషాణాలలోని ఒక పద్యం




సాహితీమిత్రులారా!



తెలుగులో పంచపాషాణాలు అని 5 పద్యాలున్నాయి.

వాటిలోని ఒక పద్యం ఇది గమనించండి-


అబ్జముఖీ మనోజ నరసాధిప నందన నీ యశం

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ వితీర్ణిమం 

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ పరాక్రమం 

బబ్జ కరాబ్జ  జాబ్జ నయనాబ్జ విలాసము చిత్రమిద్ధరన్ 

ఈ పద్యములో ఒక్కొక్క పాదములో ఒకే పదములున్నా కూడా 

వేర్వేరు అర్థములు వచ్చేట్టు రచించాడు కవి.

తా:--పద్మముఖులగు సుందరీ మణులకు మన్మథుడా,నరసరాజకుమారా!కృష్ణ రాయా!

1. నీ కీర్తి అబ్జ+కర+అబ్జ జాబ్జ నయనా=అబ్జ విలాసము=అమృతము,బ్రహ్మ ,సరస్వతి,శంఖము, వీటి యొక్క విలాసము వంటి కాంతి కలది.

2.నీ దాతృత్వము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ+వి+ల+అసము =పాలసముద్రమును, కర్ణుడిని, నిధులను పొందిన కుబేరుని, చంద్రుని విశేషముగా గ్రహించుటకు స్థాన మైనది.

3.నీ పరాక్రమము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ విలాసము --  శివుడు,కుమారస్వామి,కమలాక్షుడైన 

శ్రీపతి,అర్జునుడు,  వీరి యొక్క విలాసము వంటి కాంతి కలది గా ఈ ధరణి లో చిత్రంగా ప్రకాశిస్తున్నాయి.

తా:- నీ కీర్తి అమృతము, కమలమునందు పుట్టిన బ్రహ్మ, కమలముల వంటి కన్నులుగల సరస్వతి ,శంఖము, వీటి  అన్నింటి యొక్కవిలాసము వంటి కాంతి కలది. నీ దానగుణము పాలసముద్రమును, కర్ణుడినీ, నిధులుగల కుబేరుని, చంద్రుని, విశేషముగా గ్రహించుటకు స్థానమైనది.నీ పరాక్రమము శివుడు,కుమారస్వామి,శ్రీపతి,అర్జునుడు వీరి యొక్క విలాసము వంటి కాంతి కలదిగా ఈ ధరణిలో చిత్రముగా  ప్రకాశిస్తున్నాయి.

Tuesday, November 8, 2022

మత్తేభవృత్త కందగర్భ సీసము

 మత్తేభవృత్త కందగర్భ సీసము




సాహితీమిత్రులారా!

ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారి

రసస్రువు వేము వంశ గాధావళి నుండి

మత్తేభవృత్త కందగర్భ సీసము

గమనించండి-




Sunday, November 6, 2022

సుమగుళుచ్ఛబంధం

 సుమగుళుచ్ఛబంధం




సాహితీమిత్రులారా!

ఆసూరి మఱింగంటి వేంకటనరసింహాచార్య కృత 

తాలాంకనందినీ పరిణయంలోని

సుమగుళుచ్ఛబంధం

గమనించండి-





Thursday, November 3, 2022

డమరుక బంధం

 డమరుక బంధం




సాహితీమిత్రులారా!

డి. యస్ . గణపతిరావు గారి

పద్మవ్యూహం చిత్రకావ్యం నుండి

డమరుక బంధం గమనించండి-






Tuesday, November 1, 2022

గోమూత్రికా బంధం

 గోమూత్రికా బంధం




సాహితీమిత్రులారా!

రూపగోస్వామి కృత

చిత్రకవిత్వాని లోని

గోమూత్రికా బంధం

గమనించండి-