ఏకాక్షర నిఘంటువు - 56
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
న - లేదు, కాదు, ఒద్దు
నమ్ - పారమార్థికగా ముక్తిని, లౌకికంగా భుక్తిని
ప్రసాదించే శక్తిగల బీజాక్షరం, వంగు, నమస్కరించు
నద్ - ధ్వనించు, ప్రతిధ్వనించు, మాటలాడు,
అఱచు, గర్జించు
నంద్ - సంతోషించు, ఆనందించు, తృప్తిపడు
నయ్ - పోవు, కాపాడు
నర్ద్ - ఱంకెవేయు, అఱచు, గర్జించు, కదలు
నశ్ - నశించు, అగపడకుండు, చచ్చు
నహ్ - కట్టు, బంధించు, చుట్టు, ధరించు
నాథ్ - అడుగు, కోరు, అధిపతియగు, కష్టపెట్టు, ఆశీర్వదించు
న్యఙ్ - పొట్టివాడు
నఞ్ - లేదు కాదు అని అర్థాన్నిచ్చేది.
నా - లేదు,కాదు, మగవాడు, గండ్రగొడ్డలి, శంకరుడు
No comments:
Post a Comment