ఏకాక్షర నిఘంటువు - 55
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ధు/ధూ - కదల్చుట, దించుట, తొలగించుట, విసరివేయుట,
ఊదుట, నాశనముచేయుట, ప్రజ్వలింపచేయుట,
గాయపరచుట
ధుక్ష్ - ప్రజ్వలింపచేయుట, బ్రతుకుట, కష్టములనుభవించుట
ధుర్ - కాడి, బరువు, ఉచ్చస్థానము, అగ్రము
ధూః - వణకుట, కదలుట, కలతచెందుట
ధృ - అగుట, సంకల్పించుట, ఉండుట, జీవించుట,
పట్టుకొను, సహించు, మోయు, ఆధారపడు,
స్వాధీనుడై ఉండు, స్వీకరించు, ధరించు,
నిలుపు, నిరోధించు, అప్పగించు, అప్పుపడు
ధృష్ - ఏకీభవించు, కలియు, గాయపరచు, కోపింపచేయుట,
అవమానించుట, తక్కువచేయుట, అతిశయించుట,
జయించుట, చెఱచుట, ధైర్యముగానుండుట,
విశ్వాసముతో నుండుట, గర్వించుట,
సహనముకోల్పోవుట, సాహసించుట, ముట్టడించుట
ధే - త్రాగుట, పీల్చుట, వెలికి తెచ్చుట, తీసుకొని పోవుట
ధోర్ - వేగముగాపోవు, నేర్పరియై ఉండు
ధ్మా - ఊదుట, నిశ్వాసించుట,
నిప్పును మండునట్లుచేయుట,
ధ్వనితో ఊదుట
ద్యై - ఆలోచించు, ఊహించు
ధ్వస్ - పతనమగు, వ్రయ్యలగు, ఇంకిపోవు, నశించు
ధ్వన్ - మ్రోయు, శబ్దముచేయు
No comments:
Post a Comment