ఏకాక్షర నిఘంటువు - 49
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగా కొట్టుట,
మ్రోగించుట, వీణ మొదలైన వాద్యముల
తీగల మీటుట
తద్ - అది, వాడు, ఆమె, ప్రసిద్ధమైన, అదియే
తన్ - చాచు, విస్తరించు, పొడిగించు, వ్యాపించు,
మూయు, నింపు, ఉత్పత్తిచేయు, మూలమగు,
చేయు, నిర్వహించు.
తంత్ర్ - పాలించు, అదుపులో పెట్టు, ఆధారమగు, నిర్వహించు
తత్ - మరియొకటి, హేతువు
తప్ - ప్రకాశించు, వెచ్చగానుండు, బాధను సహించు,
శరీరమును కృశింపచేయు, తగులబడు
తమ్ - అలయు, బాధనొందు
తర్జ్ - భయపెట్టు, నిందించు
త్వక్ - లవంగచెక్క, జ్ఞానేంద్రియములలో ఒకటి
త్వః - మఱియొకటి
త్విట్ - కాంతి, అగ్ని, జ్వాల
తు - పాదపూరణము, అయ్యేవే, విశేషము, నిశ్చయము,
మర్యాదచేయుట, కారణము, అభిప్రాయము, నిద్దుర,
దూరమునుంచి పిలుచుట, వికారము, శుభము, పొర్లాడు
తే - నీచేతను అన్నమాట
తిఙ్ - సహించు, ధైర్యము వహించు
No comments:
Post a Comment