Friday, January 13, 2017

ఏకాక్షర నిఘంటువు - 40


ఏకాక్షర నిఘంటువు - 40




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


క్షః - నాశము, అదర్శనము, లోపము, మేఱుపు

క్షణ్ - దెబ్బకొట్టు, గాయపరచు, చీల్చు, ముక్కలు చేయు

క్షప్ - ఉపవసించు

క్షమ్ - అనుమతించు, క్షమించు, సహించు

క్షర్ - ప్రవహించు, కాఱు, బొట్టుబొట్టుగా పడు,
             నశించు, వ్యర్థమగు

క్షల్ - కడుగు, పవిత్రముచేయు, శుభ్రముచేయు, తుడిచివేయు

క్షి - నశించు, పరిపాలించు, నాశముచేయు, చెడగొట్టు,
     చంపు, గాయపరచు

క్షిష్ - విసరువేయు, వంపుపోనిచ్చు, పెట్టు, నిరాకరించు,
      అవమానపరచు, నిందించు

క్షివ్ - మత్తెక్కు, ఉమ్మివేయు

క్షు - తుమ్ము, దగ్గు

క్షుత్ - తుమ్ము, ఆకలి

క్షుధ్ - ఆకలిగొను, తుమ్ము

క్షుభ్  - కదలు, వణకు, కలతజెందు


క్షుర్ - నఱకు, కోయు


క్షై - క్షీణించు, నశించు, కృశించు




No comments: