Wednesday, February 1, 2017

ఏకాక్షర నిఘంటువు - 59


ఏకాక్షర నిఘంటువు - 59



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


పూర్ - పట్టణం, నింపుట, సంతోష పెట్టుట,
                  గాలితో నింపుట, తృప్తిపరచు, పటిష్టము చేయు

పృ/ పౄ - కార్యనిమగ్నుడగుట, ఉంచు, నింపు,
                           బయటకు తెచ్చు, అవ్వలి దరిచేరు,
                           నిర్వహింపజాలు, కాపాడు

పృచ్ - కలియు, తాకు, తృప్తి పరచు, పెంచు

ప్రచ్ఛ్ - అడుగుట, వెదకుట

ప్రాచ్ - ముందున్న, తూర్పునందున్న, తూర్పుదేశమువాడు

ప్రాంచ్ - పూర్వికుడు

ప్రీ - సంతోషపెట్టు, తృప్తి పరచు, దయతో మాటలాడు,
            సంతోషించు

ప్రః - జడ

ప్రాక్ - గడచిన కాలము, తూర్పుదిక్కు,
                 తూర్పుదేశం, ముందు(మొదట)

ఫట్ - విఘ్నము

ఫల్ - కాచు, పండు, సఫలమగు, ఫలితమునిచ్చు

ఫా - కఠినోక్తి, ఆట, గుడిసె

ఫాట్ - ఓయి


No comments: