రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!
సాహితీమిత్రులారా!
సమస్య-
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!
ఈ సమస్యకు వివిధకవులు చేసిన
మూడు పూరణలు చూడండి-
1వ పూరణ-
గతి లేని వాని నే స
మ్మతి మాలిన మూర్ఖు నెట్టి మానిసి నైనన్
అయి సరసు జేయగల భా
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!
ఎటువంటి మూర్ఖుణ్నైనా
రసికుని చేయగల
భారతి చిత్రం రవికైనా
తెలియదని భావం
2వ పూరణ-
పతిపై నలిగిన స్త్రీతో
అతులితముగ నాట్య మాడి అలసిన స్త్రీతో
అతి నూత్న రజస్వలతో
రతి చిత్రము తెలియరాదు రవికైనా నృపా!
ప్రణయకలహం తీర్చిన తర్వాత,
నర్తించి అలసిన తర్వాత,
క్రొత్తగా వ్యక్తురాలైన కన్యతో -
రతి ఎంతో ఆనందహేతువు- అని భావం.
3వ పూరణ-
క్షితిలోని కవుల కెల్లన్
సతతంబై వెలయు నాంధ్ర సంస్కృతములలో
నతుకన్ మేలయిన ప్లుత వి
రతి చిత్రము తెలియరాదు రవికైన నృపా!
ఇందులో రతి కి ముందు
ప్లుత వి చేర్చడంవలన ప్లుతవిరతి అనే
యతికి సంబంధించినదిగా మారినది.
ఆసక్తిగల మీరును మరో విధంగా పూరించి పంపండి.
1 comment:
కం.
అతిశయము లేని కవనం
బతి పేలవమై చను సడి వడయని గంట
మ్మతి సుందర మైనను హా
రతి చిత్రము తెలియరాదు రవి కైన నృపా!
Post a Comment