Monday, November 14, 2016

రామ శ్చుంబతి రావణస్య వదనం


రామ శ్చుంబతి రావణస్య వదనం




సాహితీమిత్రులారా!


స్రశ్నలు విపరీతంగా ఉండేది విషమ ప్రహేళిక.
దీన్నే సమస్య అని కూడ అంటారు.
ఇది యథాసంఖ్యంగా పూరింపబడుతుంది.

సమస్య -
రామ శ్చుంబతి రావణస్య వదనం సీతావియోగాతుర:
                                                                     (సంస్కృతం)
(రాముడు సీతావిరహార్తుడై రావణుని మోము ముద్దిడుకొనెను)

క: కాంతార మగాత్ పితు ర్వచనత: సంశ్లిష్య కంఠస్థలీం
కామీ కిం కురుతే చ గృధ్రనఖత శ్చిన్నం ప్రరూఢంచ కిమ్
కా రక్ష: కులకాలరాత్రి రభవత్ చంద్రాతపం ద్వే క:
రామ శ్చుంబతి రావణస్య వదనం సీతావియోగాతుర:

దీనిలో మూడుపాదాలలో ప్రశ్నలు
నాలుగవపాదంలో సమాధానాలు ఉన్నాయి.

క: పితు వచనత: కాంతారమ్ అగాత్ ?- 
(తండ్రిమాటవలన అడవికి వెళ్ళినవాడెవరు?)
- రామ: (రాముడు)

కామీ కంఠస్థలీం సంశ్లష్య కిం కురుతే?
(కాముకుడు ప్రేయసీ కంఠమును కౌగిలించి ఏమిచేయును?)
- చుంబతి (ముద్దిడుకొనును)

గృధ్రనఖత: ఛిన్నం ప్రరూఢం కిమ్?
(జటాయువు గోళ్లవలన తెగి తిరిగి మొలచినదేది?)
- రావణస్య వదనమ్(రావణుని తల)

కా రక్ష: కులకాలరాత్రి: అభవత్?
(రాక్షస వంశమునకు కాలరాత్రియైనదెవరు?)
- సీతా
క: చంద్రాతపం ద్వేష్టి?
(వెన్నెలను ద్వేషించు వాడెవడు?)
- వియోగాతుర: (విరహార్తుడు)

No comments: