Monday, November 14, 2016

జవరాలు వరాలు రాలు


జవరాలు వరాలు రాలు



సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని ఒక చిత్రం చూడండి-


జవరాలి యందునుంగల
వివరాలు వరాలురాలు విరసంబైనన్
తవులుసుమి రాలు చెలువుడు
మివుల రసికుడైన గాక వినుమా యార్యా!


దీనిలో జవరాలు అనే పదంనుండి జ తీసివేస్తే వరాలు,
వరాలు పదంనుండి వ తీసివేస్తే రాలు అవుతాయి.
అంటే జవరాలు లో వరాలు, రాలు రెండూ ఉన్నాయి.
ఆమె చెలువుడు అనుకూలుడైతే అతనికి వరాలు లభిస్తాయి.
అలా కాకుండా దుష్టుడాయెనా రాలు మాత్రం తగులక తప్పవు.

జవరాలు, వరాలు, రాలు -  మొదటి అక్షరం తీసివేస్తే 
ఒకదానినుండి మరొకటి వస్తున్నాయికదా అందువల్ల 
ఇది చ్యుత చిత్రమౌతుంది.

No comments: