Thursday, November 24, 2016

అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల


అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల



సాహితీమిత్రులారా!


సమస్య-
అర్ఘ్యములిచ్చె, రాత్రి సమయమ్ముల నొక్కడు భానుమాలికిన్

తాడిచెర్ల కృష్ణశర్మగారి పూరణ-

దైర్ఘ్య దివాక రోష్ణకర తైజసవర్ధిత మీ జగంబు కా
నర్ఘ్యము విప్రదత్తము త దర్క పరాక్రమ పోషకం బగున్
అర్ఘ్య విధానమాగమ వచోన్విత మౌటను బ్రాహ్మణుండు తా
అర్ఘ్యము లిచ్చెరా త్రి సమయమ్ముల నొక్కడు భానుమాలికిన్

అర్ఘ్యము లిచ్చె - రాత్రి సమయమ్ముల
అనే దాన్ని రాత్రివేళ కాదు
అర్ఘ్యములిచ్చెరా - త్రి సమయమ్ముల -
అని మార్చి - ఉదయ, మధ్యాహ్న,
సాయంకాల సంధ్యావందన భావనను వర్ణించారు.

ఆసక్తిగల మీరును రసరమ్యంగా 
మరో చమత్కారంలో పూరించి పంపండి.

No comments: