అతి సర్వత్ర వర్జయేత్
సాహితీమిత్రులారా!
అతి సర్వత్ర వర్జయేత్ - అనే
నీతిని సంస్కృతంలోకి
అనువదించమని
మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్యులవారిని అడిగారట-
దానికి ఆయన ఈ విధంగా చెప్పారట.
అతిహితమపి జంతూనా
మతిచేదహితం భవేదు భయథా లోకే
అమృతమస్యహీనం
సీతం కుర్యాత్ స్వయంమృతం సత్సీతం
మిక్కలిహితమైనది అయినా అతి అయితే
ప్రాణులకు రెండువిధాల(శబ్దం వలన, అర్థం వలన)
అహితమవుతుంది.
శబ్దం వలన అహితమెలా అవుతుందో-
అతిహితం - అనే పదంలో
అతి - అంటే తి లేనిది - అంటే కేవలం - అ
అతిహితంలో - తి - పోతే,
అహితం - అవుతుంది.
అర్థం వలన అహితం ఎలాఅవుతుందో-
తియ్యగా ఉండే దేదైనా ఎక్కువైతే
తినగాతినగా గారెలు కండ్రయెక్కె
అనడం సుప్రసిద్ధమే కదా!
దీనికి ఉదాహరణ ఉత్తరార్థంలో చెప్పబడింది.
అమృతమైనా ఎక్కువైతే మృతమై
త్రాగిన వాణ్ని చంపుతుంది.
అహీనం అంటే ఆకారంలేని,
అమృతం అంటే అమృతం - అ - మృతం, కదా!
తేనె అయినా ఎక్కువైతే వికటిస్తుంది వెగటు కలిగిస్తుంది.
ఇది కవిగారు చెప్పిన వివరణే.
No comments:
Post a Comment