Friday, November 18, 2016

ఏకరూపేణ వాక్యేన


ఏకరూపేణ వాక్యేన 




సాహితీమిత్రులారా!



ఏకరూపమైన వాక్యముచేత 
రెండర్థములను తంత్రముతో 
చెప్పటాన్ని శబ్దజ్ఞులు శ్లేష అని పిలుస్తున్నారు.

ఈ శబ్దశ్లేష 6 విధములు అవి-

1. ప్రకృతిశ్లేష
2. ప్రత్యయశ్లేష
3. విభక్తిశ్లేష
4. వచనశ్లేష
5. పదశ్లేష
6. భాషాశ్లేష

ప్రకృతి శ్లేష-

ప్రకృతిని ఆశ్రయించుకొని రెండర్థములు 
కలిగిన యెడల ప్రకృతి శ్లేష అనబడుతున్నది. 
దీని ఉదాహరణ-

ఆత్మవశ్చ పరేషాం చ ప్రతాపస్తవ కీర్తినుత్
భయకృద్భూపతే బాహుర్ద్విషాం చ సుహుదాం చతే
                                                          (సరస్వతీకంఠాభరణమ్ - 2- 152)

ఓ రాజా!  
నీయొక్క ప్రతాపము నీయొక్కయు 
శత్రువులయొక్కయు కీర్తినుత్తు. 
నీ బాహువు శత్రువులకును 
మిత్రులకును భయకృత్తు- 
అని భావం

దీనిలో కీర్తినుత్తు అనే చోట నౌతి, 
నుదతి అను ధాతువులకును
భయకృత్తు అనేచోట కరోతి, కృన్తతి అను 
ధాతువులకు క్విప్ పరమగునపుడు రూపతుల్యే 
కావున ఇది ప్రకృతిశ్లేష.

దీనిలో కీర్తినుత్ అనేది తనకును శత్రువులకు 
సమానంగా ఒకటే ఉపయుక్తమైనది.

తన విషయంలో కీర్తినౌతు అనగా
కీర్తిని ప్రశంసించునది అనే భావం
పరులవిషయంలో కీర్తి నుదతి అనగా 
పరులకీర్తిని చెడగొట్టునని భావం

No comments: