ఉపోఢ రాగాప్యబలా మదేన సా
సాహితీమిత్రులారా!
యమకాలంకారంలో కొన్ని రకాలు చూశాము-
ఇక్కడ సంధిస్థూలావ్యపేత యమకాన్ని
గురించి చూద్దాం-
ఈ ఉదాహరణశ్లోకం చూడండి
ఇది దండికావ్యాదర్శంలోనిది
ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
నయోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే
(కావ్యాదర్శ: - 3-52)
(ఆమె(నాయిక) అబల అయికూడ,
తారుణ్యమదముచేత భరింపబడిన
అనురాగము కలదయికూడ, తనను
తాను నిగ్రహించుకొన్నదయి,
నా పాపముచేత క్రోధరసముతో
కూడుకొన్నదయి మన్మథునికే తాపము
కలిగించిన దైననూ నాకు తానింత తాపము
కలిగించునది కాలేదు (ఇంతని చెప్పటానికి
వీలులేనంత తాపము కలిగించెనని భావము))
ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
నయోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే
దీనిలో అక్షరసముదాయం పాదము చివరలందు
పాదం మొదటిలోను వ్యవధానంలేకుండా
ఆవృత్తమవుచున్నది. అదీను నాలుగు అక్షరముల
సముదాయం కావున ఇది సూక్ష్మముకాక
స్థూలమైనదిగా గమనించాలి.
మరియు పాదముల సంధినందు ఆవృత్తం
కావడం వల్ల ఇది సంధిస్థూలావ్యపేత యమకంగా
చెప్పబడుచున్నది
దీనికే సందష్టక యమకమనేపేరు కూడ ఉంది.
దాన్నిగురించి తరువాత తెలుసుకుందాం..
No comments:
Post a Comment