Sunday, November 6, 2016

తల నరకుట హింస కాదు


తల నరకుట హింస కాదుసాహితీమిత్రులారా!


సమస్య-
తల నరకుట హింస కాదు ధర్మమ్మె అగున్


నరాల రామారెడ్డిగారి పూరణ-

బలవంతులు దుర్జనులై
బలహీను అణగద్రొక్కి బాధింపగ ఆ
తల పొగరు నిడిన నియంత
తల నరకుట హింస కాదు ధర్మమ్మె అగున్

తల నరకుట కాదు.
దుర్మార్గులైన నియంతలను
సంహరించటం అని అనడంతో
పూరణ సౌందర్యాన్ని సంతరించుకుంది.


ఆసక్తి ఉన్నవారు మరోవిధంగా పూరించి పంపగలరు.

No comments: