స్తుతిమతియైన ఆంధ్రకవి
సాహితీమిత్రులారా!
భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలు
ధూర్జటిని గురించి
ఈ విధంగా పద్యం ప్రారంభించగా---
స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనీ
అతులిత మాధురీ మహిమ........
అనగానే తెనాలిరామకృష్ణుడు అందుకొని
.....హా తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతాపహారి సం
తత మధురాధరోధిత సుధారస ధారల గ్రోలుటం జుమీ
- అని ఆన్నాడు.
ఈ అధిక్షేపణ సమాధానం ప్రసిద్ధమైనవి.
కానీ ఒకసారి
భువనవిజయనాటకంలో
ధూర్జటి పాత్రవేసిన వావిలాల సోమయాజులుగారు
(రామకృష్ణుని పద్యపూరణ) వెంటనే
ఈ విధంగా చెప్పారు-
-------
ఔ తెలియందగు లోక మోహనో
ద్ధత సుమసాయక ప్రబల తాపమహోజ్వల పూజ్య పార్వతీ
పతి పదమంజులాబ్జ మధుపాన మధువ్రతుడై చెలంగుటన్
(నాకు కవిత్వ మాధుర్యం లభించింది.
వేశ్యాధర పానం చేయటం వల్ల కాదు.
శివ పదాంబుజ మధుపానం చేయటంవల్ల
- దీని భావం)
No comments:
Post a Comment