Friday, November 11, 2016

కరి సింహము మీద నెక్కి కదిసెను దనుజున్


కరి సింహము మీద నెక్కి కదిసెను దనుజున్




సాహితీమిత్రులారా!



సమస్య -
కరి సింహము మీద నెక్కి కదిసెను దనుజున్

వసంతరావు రామకృష్ణరావుగారి పూరణ-

పరులను పీడించుచు పలు
దురితము లొనరించునట్టి ధూర్తుని జంపన్
కరుణామయ భక్తవశం
కరి సింహము మీద నెక్కి కదిసెను దనుజున్

ఇందులో కరి - భక్తవశంకరి గా మార్చిపూరించాడు కవి.
భక్తవశంకరి - పరమేశ్వరి సింహ వాహన అయి రాక్షసుని
శిక్షించటానికి బయలుదేరింది- అనే అర్థంగా మారిపోయింది.
దీనితో సమస్య అందమైన పూరణాగా మారింది.

ఆసక్తిగల మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.

No comments: