Wednesday, November 23, 2016

వగలాడి పొందుగోరిన


వగలాడి పొందుగోరిన



సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి "ఆర్యా" శతకంలోని
ఈ శబ్దచిత్రపద్యం చూడండి-

వగలాడి పొందుగోరిన
వగయొక్కటి లాడి యొకటి వగకాడైనన్
వగచే కాడుంబడి తా
వెగడొందును వానివలన వినుమా యార్యా!

ఇందులో
వగలాడి అంటే శృంగార చేష్టలుగల స్త్రీ,
వగ అంటే దు:ఖము,
లాడి అంటే వ్రణం,
కాడు అంటే అరణ్యం, శ్మశానం.

పురుషులు విలాస చేష్టలుగల స్త్రీల వలలో తగులుకొంటే
చివరకు దు:ఖాన్ని అనుభవిస్తారు. ఎలాగంటే సుమతి భర్త
కౌశికుని వలె వ్రణాలపాలుగూడ అవుతారు. అలాగే స్త్రీలుగూడ
అటువంటి వానివలలో తగులుకున్నపుడు చివరకు దు:ఖాలపాలై
కాడుపడిపోతారు. కాబట్టి రూపం, శృంగారచేష్టలు అనే రెండు గూడ
మనిషికి  ఎంత అందమో అంత ప్రమాదకరమైనవికూడ. అందువలన
వీధిలో ప్రదర్శించుకుని ఎవరైనా దు:ఖాలపాలు కారాదు - అని భావం.

No comments: